22, జులై 2023, శనివారం

ఆదర్శవంతుడైన తండ్రి

 ఉత్తరాఖండ్ రాస్ట్రంలొని హరిద్వార్ నగరంలొ ఉద్యొగ మేళా జరుగుతుంది. అంతలొ అక్కడికి ఇద్దరు అమ్మాయిలను తీసుకుని ఒక పెద్దయన ఆటొలొ వచ్చారు. అంతే వాళ్లను చూసి అక్కడి అధికారులు, పొలీసులు, ఇతరులకు షాక్ కొట్టినట్టయింది. ఒక్కసారిగా అందరూ బిత్తరపొయి, నొరెళ్లబెట్టారు.

 

ఏందుకంటే అక్కడ జరుగుతున్న ఉద్యొగమేళా కు ఇంటర్యూ కు వచ్చిన ఆ ఆడపిల్లలిద్దరూ సాక్ష్యాత్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాధ్ గారి మేనకొడళ్ళయిన లక్ష్మి రావత్, అర్చనా లు. వారిని తీసుకుని వచ్చిన ఆ పెద్దాయన ( చేతిలొ కర్ర, టొపి పెట్టుకున్న పెద్దాయన) సాక్ష్యాత్తు యోగి ఆధిత్యనాధ్ తండ్రి గారయిన ఆనంద్ సింగ్ …. ఆనంద్ సింగ్ గారికి, లక్ష్మిరావత్_అర్చనా లు సొంత మనుమరాళ్ళు.

.


.

ఇక వారిని చూసి ప్రభుత్వ అధికారులు రాచమర్యాదలు చేయడం ప్రారంభించడంతొ, యోగి ఆధిత్యనాధ్ తండ్రి ఆనంద్ సింగ్ గారు, వారి మర్యాదలను తిరస్కరించి, తన మనువరాళ్లను అందరితొ పాటే లైన్లొ ఇంటర్యూకు పంపారు. ఈ సంధర్బంగా అక్కడికి వచ్చిన లొకల్ మీడియా తొ ఆనంద్ సింగ్ గారు మట్లాడుతూ ” ఇంటర్యూలకు వెళుతూఉంటే, ఇంటర్యూలలొ ఏలా విజయం సాధించాలొ వారే నేర్చుకుంటారని తెలిపారు. ఉద్యొగాలు అనేవి ప్రతిభ ఆధారంగానే రావాలి కాని, సిఫార్సుల ద్వారా కాదని చెప్పారు. ఒక వేళ నా కొడుకు యోగి ఆధిత్య, వీళ్ళ ఉద్యొగాలకు రికమండ్ చేసినా నేను ససేమిరా ఓప్పుకొనని అయన స్పష్టం చేశారు.

 

బహుశా ఇంత గొప్ప ఆదర్శవంతుడైన తండ్రి పెంపకంలొ పెరగడం వలననే యోగి ఆధిత్యనాద్ గారు గొప్ప  ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా అందరి ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. బహుశా కారణ జన్ములని ఇలాంటి వారినే అంటారేమొ.

కామెంట్‌లు లేవు: