11, మార్చి 2025, మంగళవారం

ఎక్కువ మాటల కన్నను

 *2041*

*కం*

ఎక్కువ మాటల కన్నను

నెక్కువ భావమ్ము నిచ్చు నేర్పరి తనముల్

పెక్కుగ విలువైనవనెడి

చక్కని సత్యమ్మునెపుడు సడలకు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఎక్కువగా మాట్లాడటం కన్నా ఎక్కువ భావము ను కలిగించే నేర్పరితనములు ఎక్కువ విలువైనవనే చక్కని సత్యాన్ని విడువవద్దు.

*సందేశం*:-- ఎక్కువగా మాట్లాడటం కన్నా ఎక్కువ భావాన్ని కలిగించే ప్రవర్తనన అలవాటు చేసుకుంటే దాని వలన ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. ఉదాహరణకు మంచిని బోధించడం కన్నా ఎంతో కొంత మంచి చేస్తూ ఉంటే మంచి బాగా వ్యాపించగలదు,ఉదాహరణకు మీ ఇంటిముందు శుభ్రం చేయమని పదేపదే చెప్పడం కన్నా శుభ్రం చేయడం వలన ఎక్కువ లాభం ఉంటుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: