*ప్రియ బాంధవా మేలుకో 6*
రోజుకు 24 గంటల చొప్పున జీవిత కాలం సమాజం మరియు దేశ సంక్షేమం కొరకు ఆరాటపడి, పాటుపడే మనస్తత్వం కొందరు రచయితలకు ఉంటుంది. ఎందుకింత ఆరాటం అను సందేహాలు ఉద్భవించవచ్చును..అది వారి స్వభావం అంతే. వీరి ధృక్పథం అస్తమానం సామాజిక, జాతీయ అంశాలనే కథా వస్తువులుగా స్వీకరించి రచనలు చేస్తూ *నిస్త్రాణమై ఉన్న సమాజ చైతన్యం కొరకు పాటు పడ్తూ ఉంటారు*. వీరి ఉద్దేశ్యంలో సామాజిక శ్రేయస్సు అనేది ఇతరులతో ప్రజలకున్న సంబంధాల ద్వారా మాత్రమే గాకుండా...ప్రజలు సామాజిక సమూహాలలో ఏలా (మార్గాలు) పాల్గొంటారు... *సామాజిక సంక్షేమం కొరకు ప్రజలు తమ సమయాన్ని మరియు సేవలను ఏలా అందిస్తారు* అను అంశాలను రచయితలు తమ రచనల ద్వారా సూచిస్తారు.
మానవ స్వభావంలో స్వార్థం అను లక్షణం సహజమే. బాల్యంలో విద్య, యౌవనంలో ఉపాధి మరియు సంసార బాధ్యతలు, మధ్య వయస్సులో సంతాన అవసరాలు, వారి అభివృద్ధి, జీవితంలో స్థిరపడుట ఇత్యాది సహజమే. *కాని, జీవితానికి కావలసిన హంగులన్ని సంప్రాప్తమైన పిదప గూడా స్వార్థపుటాలోచనలు* అభ్యంతరకరము మరియు ఒక్కొక్కప్పుడు ప్రమాదకరం కూడా.
మానవ జీవితపు సగటు ఆయుర్ధాయం 80 సంవత్సరాలు అనుకుందాము. 65 సంవత్సరములు వచ్చేవరకు వ్యక్తులు తమ వ్యక్తిగత జీవిత ప్రయాసలు, కుటుంబ బాధ్యతల నిర్వహణ ఇత్యాది పూర్తిచేసుకున్న పిదప తీరుబడి జీవితానికి సమాయత్తమై ఉంటారు. *అప్పుడైనా ప్రజలు సమాజం గురించి ఆలోచించాలని రచయితలు కోరుకుంటారు.*
ప్రకృతి ఎప్పుడు ఒకలా ఉండనట్లె ప్రజలందరూ కూడా ఒకలా ఉండరు. సమాజం, దేశం, ధర్మం, సంప్రదాయం గురించి అలోచించి, సత్కర్మలు ఆచరించే ప్రజలు కొందరవుతే, *ఏది ధర్మమో* తెలిసినా, చేయడానికి మనసొప్పని, ధైర్యం లేక ముందుకు రాని వారు, *ఏది అధర్మమో* తెలిసీ కూడా చేయకుండా ఉండలేని *దుర్యోధన* లక్షణాలు గల కుటిల మనస్కులు మరికొందరు. ఇటువంటి వారికి సంబంధించిన శ్లోకం చూద్దాము.
*శ్లో! జానామి ధర్మం నచమే ప్రవృత్తి. జానామి పాపం నచమే నివృత్తి*.
ఈ మనః ప్రవృత్తి కల జనులు మారరు. వీరు తమ స్వార్థానికే ఎక్కువ అనుకూలం అనుకున్నప్పుడు మాత్రమే ముందడుగేస్తారు. ఈ కోవలోనే మరొక వర్గం గమనిద్దాం.... *పెద్ద మనుష్యుల ముసుగులో గోముఖ వ్యాఘ్రాలు మన మధ్యనే ఉంటాయి*. పైకి చెప్పేది ఒకటి చేసేది మరోకటి. వీరి వల్ల దేశానికి కడు ప్రమాదం పొంచి ఉంటుంది. అప్రమత్తంగా ఉండటం అవసరం.
దేశంలో అన్ని మోసాలు, అకృత్యాలు ప్రభుత్వమే అరికట్టాలనుకోవడం సమంజసం కాదు. *ప్రజా చైతన్యం ఉన్న చోట దుష్టులు వెనకడుగు వేస్తారు*.
ధన్యవాదములు
*(సశేషం)*.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి