11, మార్చి 2025, మంగళవారం

తమకము తోడ వాస్తవ పథమ్ముల

 చ.తమకము తోడ వాస్తవ పథమ్ముల  నెంచెడు యుక్తి లేక నే

గమనము నెంచ నేమగునొ కాంచగ లేక వృథా ప్రయాసలన్

గుములుచుఁ దల్లిదండ్రులకుఁ గూర్చుదు రేలనొ క్రొత్త చిక్కులన్

విమల యశస్సు నొంద గల విజ్ఞతఁ గాంచగ లేమి భారతీ!౹౹ 77


ఉ.హంసల వోలె కాకులు విహారముఁ జేయ సహించి యున్న వి

ధ్వంసమగున్ సమస్తమును దారుణ రీతుల దుష్ట చేష్టలన్

హింసను నింపి వైభవము నేగతి యైనను కూల్చి వేసెడున్

హంసలఁ బోలెడుత్తములె యందల మెక్కుట పాడి భారతీ!౹౹78

కామెంట్‌లు లేవు: