🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*శ్రీ ఆదిశంకరాచార్య విరచితం*
*శివానందలహరి – శ్లోకం – 53*
*ఆకాశేన శిఖీ సమస్తఫణినాం నేత్రా కలాపీ నతా-*
*ఽనుగ్రాహిప్రణవోపదేశనినదైః కేకీతి యో గీయతే ।*
*శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటన్తం ముదా*
*వేదాన్తోపవనే విహారరసికం తం నీలకణ్ఠం భజే ॥ 53 ॥*
ఆకాశము అనే పింఛముకలదీ, సర్పములరాజు వాసుకి అలంకారముగా కలదీ, నమస్కరించువారిని అనుగ్రహించు ప్రణవనాద ధ్వనులనే కేక కలిగినదీ (నెమలి అరుపులకి కేక అను పేరు), పర్వతరాజపుత్రి పార్వతి అను గొప్పకాంతిగల నల్లమేఘమును చూచి ముదమునొంది నాట్యము చేయునదీ, ఉపనిషత్తులనెడు ఉద్యానవనములో విహరించుటయందు అనురాగము కలదీ అగు ఆ (శివుడు అనబడే) నెమలిని సేవించున్నాను.
వ్యోమకేశుడూ, సర్పభూషణుడూ, భక్తులను ప్రణవోపదేశముతో అనుగ్రహించువాడూ, పార్వతీవల్లభుడూ, వేదాన్తవేద్యుడూ అయిన శివుని నమస్కరించుచున్నాను.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శ్రీ ధర్మశాస్త సేవాసమితి 🐆 విజయవాడ 🏹 7799797799
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి