*11/03/2025 - నృసింహ ద్వాదశి /*
ఫాల్గున శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. దీనినే గోవింద ద్వాదశి అని కూడా అంటారు.
ఈ పండుగ వేడుకలు
పూరీలోని జగ్గనాథ్ ఆలయంలో చాలా ముఖ్య మైనవి. గోవింద ద్వాదశి ద్వారక తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం, తిరుమల తిరుపతి బాలాజీ ఆలయం, ఇతర ప్రముఖ ఆలయాలలో కూడా ప్రసిద్ధి చెందింది.
గోవింద ద్వాదశి నాడు, భక్తులు సాయంకాలం విష్ణు దేవాలయాలను సందర్శించి, అక్కడ జరిగే పూజ ఆచారాలలో పాల్గొంటారు. విష్ణువు పేరు జపించడం, 'శ్రీ నరసింహకవచం' మంత్రాన్ని పఠించడం గోవింద ద్వాదశి నాడు చాలా ఘన మని భావిస్తారు.
భారతదేశం లోని దక్షిణరాష్ట్రాలలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకలలో కూడా గోవింద ద్వాదశిని ఎంతో ఉత్సాహంతో, భక్తితో జరుపు కుంటారు.
గోవింద ద్వాదశి రోజున, గంగ, సరస్వతి, యమున, గోదావరి వంటి పవిత్ర నదులలో ఉత్సవ స్నానాల వేడుకలు ఆచరిస్తారు.
ప్రత్యేక మైన హిందూ జ్యోతిష శాస్త్ర ప్రాముఖ్యం కారణంగా పవిత్రస్నానాలు చేయడానికి వేలాది మంది భక్తులు గోవింద ద్వాదశి రోజున పూరి తీరం లోని మహోదాది తీర్థాన్ని సందర్శిస్తారు.
శ్రీమహావిష్ణువు 'పుండరీకాక్ష' రూపాన్ని గోవింద ద్వాదశి నాడు పూజిస్తారు.
ఈ రోజు భక్తులు కఠిన మైన ఉపవాసాలను కూడా పాటిస్తారు.
గోవింద ద్వాదశి నాడు, భక్తులు సాయంసమయంలో విష్ణుదేవాలయాలను సందర్శించి పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు.
శ్రీహరి నామాన్ని జపించడం, నృసింహ ద్వాదశనామ స్తోత్రం, 'శ్రీనరసింహకవచం' పఠించడం వల్ల సమస్తపాపాలూ హరించి ముక్తిని పొందుతారు.
*ఓం శ్రీలక్ష్మీ నారసింహాయ నమః*
🙏🙏🙏🙏💐💐🙏🙏🙏🙏
(డాక్టర్ ఆర్.వి. కుమార్ గారి సౌజన్యంతో)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి