:
_*"కష్టాలు, విఘ్నాలు మనసును బలహీనపరుస్తున్నాయి ! వాటి నుండి ఎలా బయటపడాలి ?"*_
_*మనం ఎప్పుడూ విజయాన్నే కోరుకోవడంవల్ల బాధకు లోనవుతున్నాం. కష్టాలు, విఘ్నాలు ఎవరినీ వదలవు. బాధైనా, కోపమైనా మితంగా ఉండే సందర్భాలున్నాయి. ఎవరికైనా రోజూ కష్టాలే ఉండవు. కాకపోతే వాటినే ఎక్కువగా గుర్తుంచుకొని స్మరిస్తుండటంచేత అలా భావిస్తుంటాం. మనకి లభించిన సంతోషాలను గుర్తుంచుకోవటంలేదు. లేదా అత్యాశ వల్ల పట్టించుకోవటంలేదు. మన విధానం ఎలా ఉండాలో తెలియజెప్పటమే అవతార పురుషుల అంతర్యం. శ్రీరాముడు, హనుమంతుడు కూడా సీతాదేవి విషయంలో బాధను అనుభవించారు. ఆమె కనిపించలేదని హనుమంతుడు చనిపోవాలని అనుకున్నాడు. కష్టాలు, విఘ్నాలను తట్టుకోవటంలోనే మన మనోనిగ్రహం తెలుస్తుంది. శ్రీరాముడు, సీతాదేవి కోసం దుఃఖించాడే తప్ప అలాగే చింతిస్తూ కూర్చుండి పోలేదు. అంత బాధలోనూ తన కర్తవ్యాన్ని విస్మరించనంత ధీరత్వంతో ఉన్నాడు. విజయం కోసం వెంపర్లాడలేదు. కేవలం ధర్మంగా తన పని తాను చేస్తూ వెళ్ళాడు. అదే మనకు సద్బోధ !*_
_*"సత్యం ఆవిష్కారం కావాలంటే అన్నీ త్యాగం చేయాల్సిందేనా ?"*_
_*హిందూ సంస్కృతి పరమ సత్యం కోసం దేన్నైనా త్యాగం చేయమంటుంది. బుద్ధభగవానుడు, రాఘవేంద్రస్వామి సత్యం కోసం సంసారాలే త్యాగం చేశారు. ఎవరికి వారు తాము ఆరాధించే గురువునే అందరూ పూజించాలి అనుకుంటారు. మనం చూస్తున్న మత ఘర్షణలన్నీ దీని వల్లే జరుగుతున్నాయి. జీవితంలో వివేకవంతమైన ప్రయాణం అవసరం. జీవితం గురించిన పరిపూర్ణ అవగాహన కోసమే సత్సంగాలు. మంచి మనసు అంటే సున్నితమైన మనసు. జీవితంలో అన్నీ సుకుమారంగా ఉండాలి. జ్ఞానులు ఫలానా పనే చేస్తామని భీష్మించుకోరు. తమ ముందుకు వచ్చిన పని పూర్తి చేస్తూ ముందుకు వెళతారు. శ్రీరమణమహర్షి ఒకరోజు గోశాలలో పనివారిని తదేకంగా చూస్తూ తన్మయత్వం చెందారు. ఇంతలో ఎవరో వచ్చి తమ కోసం భక్తులు ఎదురు చూస్తున్నారని చెప్పగానే ఏమాత్రం విసుగు చెందకుండా లేచి వెళ్ళారు. రాజ్య పట్టాభిషేకం చేస్తామన్నప్పుడు శ్రీరాముడు ఎలా ఉన్నదో.. అరణ్యవాసానికి వెళ్ళమన్నప్పుడు కూడా అలాగే ఉన్నాడు. మహాత్ముల ప్రతి కడలికలో కూడా ఆ సుకుమారం ఉంటుంది !*_
_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_
_*'వడలాల్సింది కర్తృత్వాన్ని, కర్మలను కాదు !'*-
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి