ఉ.శంకరు భక్తిగొల్చెద రసజ్ఞ విలాస మృదంగ నాద సా
లంకృత నాట్య శోభితుని లాస్య వశంగతు, భక్త జాల ర
క్షంకరణైక లక్షిత విశారదు నీశ్వరు చంద్రశేఖరున్
శంకుని చిత్తమందునిడి సాగిలి మ్రొక్కి నుతింతు భారతీ!౹౹ 75
ఉ.భారపు విద్యలియ్యవి ప్రభా పరిపూర్ణ మనోవికాసమున్
ధీరమతిన్ సమోన్నతిని దీర్చగ నెంచిన మేలొసంగెడిన్
ధారణఁ బెంచుచున్ సునిశితత్వపు ధీమతిఁ గూర్చు విద్యలే
భారత దేశ వైభవము వర్ధిల జేసెడు గాన భారతీ!౹౹ 76
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి