శు భో ద యం 🙏
శ్రీ కాళహస్తీశ్వరా!
మ.
భసితోద్ధూళనధూసరాంగులు, జటాభారోత్తమాంగుల్, తపో
వ్యసనుల్, సాధిత పంచవర్ణరససుల్, వైరాగ్యవంతుల్, నితాం
తసుఖస్వాంతులు, సత్యభాషణసముద్యద్రత్నరుద్రాక్షరా
జిసమేతుల్ తుద నెవ్వరైన గొలుతున్ శ్రీకాళహస్తీశ్వరా!
-ధూర్జటి:కాళహస్తీశ్వరశతకం:102 పద్యం.
భావం: పరమశివుని భక్తులెవరైననూ సరియే వారిని సేవింతునని పరమేశ్వరునకు కవితెలుపుచున్నాడు.ఇది భక్తనకు ఉండవలసిన ప్రధమలక్షణం.
దేవుడెవరైనగానీ వారికి తమభక్తులయెడ అపారమైన కరుణకలిగియుండుట సహజము. భక్తులనారాధించిన వానిపై భగవంతునకు అనుగ్రహముకలుగును.
ధూర్జటి శివభక్తుడు.పరమేశ్వరభక్తులందరూ అతనికారాధ్యులే!
మరి యాభక్తులను గుర్తించుటయెట్లు?ఈపద్యమున దానినే కవి మనవిచేయుచున్నాడు.
శరీమున విభూతి పూతలతో నిండినవారు,జటాధారులు,తపోవ్యసనులు,పంచాక్షరీ మంత్రసాధకులు,విరాగులు,నిత్యానందపరాయణులు,
నిత్యసత్యభాషణులు,అజినాదితపోపరికరయుక్తులు ఎవ్నరైననూ వారిని సేవింతును స్వామీ!నన్ననుగ్రహింపుమనుచున్నాడు.
పరోక్షముగా నాటి శైవులు పాటించు జంగమార్చనా విధానమును ధూర్జటి సూచించుచున్నాడు.
స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి