*సాష్టాంగ నమస్కారం యొక్క విశిష్టత.
*_అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ ( స + అష్టాంగ ) నమస్కారము అని అంటారు._*
*సాష్టాంగ నమస్కారము అంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో నమస్కారము చేయటం అని అర్ధము.*
*ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః౹౹*
*అష్టాంగాలు అంటే...*
*"ఉరసా" అంటే తొడలు,*
*"శిరసా" అంటే తల,*
*"దృష్ట్యా" అనగా కళ్ళు,*
*"మనసా" అనగా హృదయం,*
*"వచసా" అనగా నోరు,*
*"పద్భ్యాం" అనగా పాదాలు,*
*"కరాభ్యాం" అనగా చేతులు,*
*"కర్ణాభ్యాం" అంటే చెవులు.*
*ఇలా "8 అంగములతో కూడిన నమస్కారం" చేయాలి.
*మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నేలకు తగిలించాలి..
*కాని, స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు
*వాళ్ళు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి.
*అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని శాస్త్రం చెబుతుంది.
*పూజ పూర్తయిన తరువాత మంత్రపుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి.
*దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి.
*_నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టాంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి