10, ఆగస్టు 2020, సోమవారం

హెచ్చరిక

సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దు. 
ఇప్పుడు అందరి జేబులు కాళీ అయ్యాయి దానితో దొంగదోవలో డబ్బులు సంపాయించటం ఎలాగ అనేదానిపైనే చాలామంది కృషిచేస్తున్నారు. దానికోసం వాళ్ళ తెలివితేటలూ అన్ని ప్రదర్శిస్తున్నారు. ఇది ఈ రోజు కొత్తగా వచ్చింది ఏమి కాదు పూర్వమునుండి ఇతరులను దోచుకోవటానికి చేసే పన్నాగాలు ఎన్నో వుండేవి  మనకు తెలిసిన వారు కూడా ఎంతోమంది మోసపోయినట్లు మనకు తెలుసు. 
ఈ రోజు ఒక వాట్స్ ఆప్ మెసేజ్ చూసి ఇది వ్రాస్తున్నాను. అది ఏమిటంటే 
Providing Free Laptop For Youth 
Click Below to Book Your Free Laptop Now 
👉 https://oficayuda.club/laptops/

మనం ఇటువంటి మెసేజులు చూడంగానే ముందుగా ఆశ కలుగుతుంది. వెంటనే అది నిజామా కాదా అనే ఒక ఆలోచన కూడా కొంతమందికి కలుగుతుంది. కానీ ఎవ్వరమూ కూడా మనకు ఫ్రీగా ఎందుకు ఇస్తారు అని ఆలోచించం. ఎందుకంటె అది మన బలహీనత. ఈ బలహీనతనే కాష్ చేసుకుంటున్నారు ఎప్పటినుండో నేరగాళ్లు. ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు లేనందుకు ఇదే మంచి అదను అని వాళ్ళు విర్రవీగుతున్నారు. ఇటీవల మనం టీవీలో కూడా ఇటువంటి అనేక మోసాలను చూసాము. 
ఎటిఎం నుండి దొంగతనంగా డబ్బులు డ్రా చేసే ముఠా మొన్నీమధ్యనే పట్టుపడింది. 
ఉచిత గిఫ్టులు: మనం ఏదో పనిమీద వున్నప్పుడు ఒక ఆడ గొంతు ఫోన్ చేస్తుంది అందులో మీకు మేము నిర్వహించిన ఫలానా లాటరీలో మీ నుమ్బెరుకి అష్ట లక్షిమి పెండిట్ వచ్చింది. దాని ఖరీదు 8 వేలు. మీరు 2 వేలు కడితే మీకు వెంటనే పార్సల్ చేస్తాము. 
మీకు ఫలానా లాటరీ వచ్చింది మీ మెయిలు కు అని ఇలా ఎన్నో ఎన్నెన్నో. 
నేను బ్యాంకు మేనేజరును నీ ఏటీఎం కార్డు నెంబర్ చెప్పు, ఓటీపీ చెప్పు అని ఇలా ఎన్నో, ఎన్నెన్నో. 
మన భారతీయులను మభ్యపెట్టి దోచుకోటానికి కొంతమంది విదేశీయులు కూడా పూనుకుంటున్నారని మనం అప్పుడప్పుడు వార్తలు చూస్తున్నాం. 
ప్రస్తుతం మనం ఇంకొక మెసేజ్ చూస్తున్నాం. అదే ఏమిటంటే చివరకు కేంద్ర ప్రేభుత్వం ప్రతి సిటిజనుకు 2వేలు ఇవ్వటానికి ఒప్పుకుంది త్వరగా మీ వివరాలు అన్ని తెలియచేయండి అని వస్తున్నది ఇందులో ఇంకొక విచిత్రం ఏమిటంటే మన దేశపు మూడు సింహాలు గుర్తు వున్నది. అది చుస్తే ఎవరైనా నిజమే అని అనుకుంటారు. 
నాకు తెలిసిన కొన్ని మోసాలు మన జాగ్రత్త కోసం ఇక్కడ వ్రాస్తున్నాను. 
చాలా సమస్తరాలక్రింద జరిగిన ఒక సంఘటన: 
ఒక మధ్యతరగతి మహిళ భర్త ఆఫీసుకి వెళ్లిన తరువాత హైద్రాబాదులో కూరగాయలు కొనటానికి వెళ్ళింది. ఆమె కూరలు కొని ఇంటికి తిరిగి వస్తూవుంటే దారిలో ఒక బంగారు గొలుసు రోడ్డుమీద కనపడ్డది.  అది చూసి ఆమె తీసుకోపోయంది. ఆమె చెయ్ దానిమీద పడటమే ఆలస్యం ఇంకొక స్త్రీ అక్కడికి వచ్చి ఇది నేను చూసాను నాది అని దానిని తీసుకొనే ప్రయత్నం చేసింది. ఇద్దరి మధ్య వాగ్వివాదం మొదలయింది. ఆమె ఆ నగను రెండుగా చేసుకొని తీసుకుందాం అని అన్నది.  అంతలో ఒక మగ మనిషి ఎక్కడినుండి వచ్చాడో వచ్చి మీరిద్దరూ కొట్లాడుకోకండి దీనిని తుంచి తీసుకుంటే ఎవరికి ఉపయోగ పడదు దాని బాపతు మీరు ఒకరికి డబ్బులు ఇవ్వండి అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవు అని తరువాత వచ్చిన స్త్రీ అన్నది. దానిని ఆటను అమ్మ మీ దగ్గర యెంత డబ్బు వుంది అన్నాడు. 3వేలు అని మధ్యతరగతి మహిళ అన్నది అది చాలా తక్కువ ఆయన ఏమిచేస్తాం ఇవ్వండి అని ఆ స్త్రీ తీసుకుంది. చాల ఖరీదయిన బంగారం గొలుసు కేవలం 3 వేలకే వచ్చిందని పాపం ఆమె సంతోషం పెద్దది. కానీ చివరకు సాయంత్రం భర్త ఇంటికి వచ్చిన తరువాత కంసాలి వానివద్దకు వెళ్లిన తరువాత కానీ వాళ్లకు తెలియలేదు అది 100,150 కి దొరికే గిల్టు నగ అని. 
ఇటువంటి మోసాలు ఎన్నో రోజు జరుగుతున్నాయి. అందులో కొన్ని మనకు తెలుస్తున్నాయి కొన్ని తెలియటంలేదు. ఎదుటి వారి దురాశను పావుగా వాడుకొని మోసాలు చేసే వాళ్ళు అనేకమంది వున్నారు. ఇప్పుడు చాలామంది కంప్యూటర్ క్నాలెడ్జ్ వున్నవాళ్లు ఉద్యమంగా ఈ మోసాలు చేస్తున్నారు. స్త్రీలు కూడా ఇప్పుడు మోసాలకు పాలుపడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. 
నేను అందరిని కోరేది ఏమంటే ఎక్కడ ఏది ఉచితంగా రాదు. కేవలం ఎలుకల బోనులోనే ఆహరం ఉచితంగా వస్తుంది. 
మిత్రులు వాళ్లకు వున్న అనుభవాలు కూడా ఇక్కడ పంచుకుంటే మన వాళ్లకు కొంత గుణపాఠంలాగా ఉంటుంది. 
దయచేసి ఈ మెసేజీని మీకు తెలిసిన ఇతర గ్రూపులకు కూడా ఫార్వర్డ్ చేయండి సాటివారిని కొంతైనా మోసాలనుండి రక్షించండి. 
***********************


కామెంట్‌లు లేవు: