24, నవంబర్ 2020, మంగళవారం

🚩 _*కార్తీకపురాణం*_🚩

  🚩 _*కార్తీకపురాణం*_🚩 

🚩 _*5 వ అధ్యాయము*_🚩


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*వనభోజన మహిమ*


☘☘☘☘☘☘☘☘


ఓ జనక మహారాజా! కార్తీక మాసములో స్నాన దాన పూజానంతరమున శివాలయమున నందు గాని విష్ణాలయము నందు గాని శ్రీ మద్భగవద్గీతా పారాయణము   తప్పక చేయవలయును అట్లు చేసినవారి సర్వ పాపములును నివృతి యగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు 

వెళ్ళుదురు. భగవద్గీత  కొంత వరకు పఠించిన  వారికీ విష్ణు లోకం ప్రాప్తించును కడ కందలి శ్లోకము లో నొక్క పదమైననూ కంటస్థ మొనరించిన యెడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరి కాయలతో నిండి వున్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యదోచితంగా  పూజించి , విష్ణుమూర్తిని ధ్యానించి ,  ఉసిరి చెట్టు నీడన  భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించ వలయును.

వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం  చేయవలయును. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజ రూపము కలిగెను - యని  వశిష్టుల వారు  చెప్పిరి. అది విని జనక రాజు *'ముని వర్యా ! ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మమేల కలిగెను ? దానికి గల  కారణమేమి యని'* ప్రశ్నించగా వశిష్టుల వారు ఈ విధంబుగా చెప్పనారంబించిరి.


*కిరాత మూషికములు మోక్షము నొందుట*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


రాజా ! కావేరి తీర మందొక చిన్ని గ్రామమున దేవశర్మ యను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వారి పేరు శివశర్మ . చిన్న తనము నుండి భయ భక్తులు లేక అతి గారాబముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై  మెలగుచుండెను. అతని దురచారములును చూచి ఒకనాడతని  తండ్రి కుమారుని పిలిచి *'బిడ్డా ! నీ దురాచారములు అంతులేకుండా వున్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొను చున్నారు. నన్ను నిలదీసి  అడుగు చున్నారు. నీవల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేక పోవుచున్నాను. కాన , నువ్వు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి , శివ కేశవులను స్మరించి , సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన యెడల , నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును. కాన , నీవు అటులచేయు'* మని భోదించెను. అంతట కుమారుడు *'తండ్రీ ! స్నానము చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమే కానీ వేరు కాదు ! స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా ! దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి ? వాటిని యింటిలోనే పెట్టుట మంచిది కదా ?'* అని వ్యతిరేకర్ధములతో పెడసరంగా సమాదాన మిచ్చెను. కుమారుని సమాధానము 

విని , తండ్రీ *' ఓరి నీచుడా ! కార్తీక మాస ఫలము నంత చులకనగా చుస్తునావు కాన , నీవు అడవిలో రవి చెట్టు తొర్ర యందు ఏలుక రూపములో బ్రతికేదవుగాక '* అని కుమారుని శపించెను. ఆ శాపంతో కుమారుడగు శివశర్మ కు జ్ఞానోదయమై బయపడి తండ్రీ పాదములపై బడి *' తండ్రీ  క్షమింపుము. అజ్ఞానందకారంతో కరములో బడి దైవమునూ , దైవకార్యములనూ  యెంతో చులకన చేసి వాటి ప్రభాములను గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు  పశ్చాత్తాపము కలిగినది. ఆనక శాపవిమోచనమోప్పుడు  ఏవిదముగా కలుగునో దానికి తగు తరుణోపాయ వివరింపు'* మని ప్రాదేయ పడెను. అంతట తండ్రీ *' బిడ్డా ! నా శాపమును అనుభవించుచు మూషికమువై  ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొందుదువు '*  అని కుమారుని వూరడించెను. వెంటనే శివశర్మ  ఏలుక రూపము పొంది అడవికి పోయి , ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలమును తినుచు జీవించుచుండెను.

ఆ అడవి కావేరి నది తీరమునకు సమీపమున నుండుటచే స్నానర్ధమై నదికి వెళ్ళు వారు అక్కడ నున్న ఆ పెద్ద వట వృక్షము నీడన కొంత సేపు విశ్రమించి , లోకబి రామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళు చుండెడి వారు. ఇట్లు కొంత కాలమైన తరువాత కార్తీక మాసములో ఓక రోజున మహర్షి యను విశ్వా మిత్రులవారు శిష్యాసమేతముగా  కావేరి నదిలో స్నానర్ధమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము వున్న ఆ వట వృక్షం క్రిందనకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి. ఈ లోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము విరి దగ్గరనున్న పూజద్రవ్యములలో నేదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బైటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను. 


అంతలో ఓక కిరాతకుడు విరి జాడ తెలుసుకొని *'విరు బాటసరులై వుందురు. విరి వద్ద నున్న ధనమపహరించ వచ్చు' ననెడు దుర్భుద్ది తో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునిశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపొయినది. వారికీ నమస్కరించి ' మహానుభావులారా ! తమరు ఎవరు ? ఎందుండి వచ్చితిరి ? మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది ? గణ , వివరింపుడు '* అని ప్రదేయపడెను. అంత విశ్వా మిత్రుల వారు ' ఓయి కిరాతక ! మేము కావేరి నది స్నానర్దామై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నాన మాచరించి కార్తీక పురాణమును పఠింన్చుచున్నాము. నీవును యిచట కూర్చుని సావదానుడవై ఆలకింపుము' అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్దగా ఆలకించు చుండగా తన వెనుకటి జన్మ వృత్తంత మంతయు జ్ఞాపకమునకు వచ్చి , పురాణ శ్రవణ నంతరము  వారికీ ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి యుండి పురాణ మంతయు వినుచుండిన యెలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణా రూపము నొంది *' ముని వర్య ! ధన్యోస్మి  తమ దయ వల్ల నేను కూడా యీ మూషిక రూపము నుండి విముక్తుడ నైతినని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను. కనుక జనకా ! ఇహములో సిరి సంపదలు , పర లోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి , యితరులకు వినిపించావలెను.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత  వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి*

*ఐదవ అధ్యయము - ఐదవ రోజు పారాయణము సమాప్తం.*


🚩🕉️🕉️🌹🌹🕉️🕉️🚩

  🚩 _*6 వ అధ్యాయము*_🚩


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


 *దీపదానవిధి - మహాత్మ్యం*

*లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట*


🕉️☘️☘☘☘☘☘🕉️


ఓ రాజశ్రేష్ఠుడా ! ఏ మానవుడు కార్తీకమాసము నెల రోజులూ పరమేశ్వరుని , శ్రీ మహావిష్ణువును , పంచామృత స్నానంచేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో , అట్టివానికి అశ్వమేథయాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే యే మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట యెటులనగా పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి , వత్తులు చేయవలెను. వరిపిండితో గాని , గోధుమపిండితోగాని ప్రమిద వలె చేసి వత్తులు వేసి , ఆవునెయ్యి వేసి , దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షణ కూడా యివ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీకమాస మందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి  నిండుగాపోసి వెనుక చేసిన ప్రకారముగా గోదుమపిందితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి యీ నెల రోజులూ దానము చేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానముచేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానమిచ్చిన యెడల సకలైశ్వర్యములు కలుగటయేగాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు యిట్లు పటింపవలెను.


*సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సుఖవహం |*

*దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ ||*


అని స్తోత్రంచేసి దీపదానం చేయవలెను. దీని అర్ధమేమనగా , *"అన్ని విధముల జ్ఞానం కలుగచేయునదియు , సకల సంపదలు నిచ్చునదియునగు యీ దీపదానము చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక !"* యని అర్ధము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేనియెడల పది మంది బ్రాహ్మణులకైననూ భోజనమిడి దక్షణ తాంబూలముల నివ్వవలెను. ఈ విధంగా పురుషులుగాని , స్త్రీలుగాని యే ఒక్కరు చేసిననూ సిరి సంపదలు , విద్యాభివృద్ధి , ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు .  దీనిని గురించి ఒక యితిహాసం గలదు. దానిని వివరించెద నాలకింపుమని వశిష్ఠుడు జనకునితో యిట్లు చెప్పసాగెను.


*లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


పూర్వ కాలమున ద్రవిడ దేశమునందొక గ్రామమున నొక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొద్ది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని , ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుచే ఆమె యితరుల యిండ్లలో దాసి పని చేయుచు , అక్కడనే భుజించుచు , ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులిచ్చిన యెడల ఆ వస్తువులను యితరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు , దొంగలు దొంగిలించి కూడ తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను.


ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల యిండ్లలో దాసీపనులు చేస్తూ , తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి ? ఆమె ఒక్కదినము కూడా ఉపవాసము గాని , దేవుని మనసార ధ్యానించుటగాని చేసి యెరుగదు. పైగా వ్రతములు చేసేవారిని , తీర్ధయాత్రలకు వెళ్ళేవారిని జూచి అవహేళన చేసి , యే ఒక్క భిక్షగానికిని పిడికెడు బియ్యము పెట్టక , తాను తినక ధనమును కూడబెట్టుచుండెడిది.


అటుల కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగానాయకులను సేవించుటకు బయలుదేరి , మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి , ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచిచెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని అమెకడకు వెళ్లి *"అమ్మా ! నా హితవచనము లాలకింపుము. నీకు కోపము వచ్చినాసరే నేను చెప్పుచున్న మాటలను అలకింపుము. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏక్షణములో మృత్యువు మనలను తీసుకొనిపోవునో యెవరూ చెప్పలేరు. పంచభూతములు , సప్తధాతువులతో నిర్మించబడిన యీ శరీరములోని ప్రాణము - జీవము పోగానే చర్మము , మాంసము కుళ్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి యీ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లీ ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి , దగ్గరకు వెళ్లి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా యీ తనువు శాశ్వతమని నమ్మి , అంధకారములో బడి నశించుచున్నాడు. కాన , నా మాట లాలకించి నీవు తినక , ఇతరులకు పెట్టక , అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైన పేదలకు దానధర్మములు చేసి , పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి , వ్రతాదికములు చేసి మోక్షము నొందుము. నీ పాపపరిహరార్ధముగా, వచ్చే కార్తీకమాసమంతయు ప్రాతఃకాలమున నదీ స్నానమాచరించి , దానధర్మముల జేసి , బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగల"* వని ఉపదేశమిచ్చెను.


ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటినుండి దానధర్మములు చేయుచు కార్తీకమాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము నొందెను. కావున *కార్తీకమాసవ్రతములో* అంత మహత్మ్యమున్నది.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఆరవ అధ్యాయము - ఆరవ రోజు పారాయణము సమాప్తము.*


🚩🕉️🕉️🌹🌹🕉️🕉️🚩

🚩 _*7 వ అధ్యాయము*_🚩


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*శివకేశవార్చనా విధులు*


🕉️☘☘☘☘☘☘🕉️


ఓ జనక రాజేంద్రా ! కల్మషఘ్నమైన కార్తీక మహాత్మ్యంలో పుష్పార్చనా - దీప విధానాలను చెబుతాను విను.


*పుష్పార్చనా ఫలదాన దీపవిధి - విశేషములు:*


ఈ కార్తీక మాసములో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించటం వలన  కమలాసనియైన లక్ష్మిదేవి ఆ భక్తుల యిండ్ల స్ధిరనివాస మేర్పరచుకుంటుంది. తులసీ దళాలతోగాని , జాజిపువ్వులతోగాని , మారేడు దళాలతో గాని పూజించేవారు తిరిగి యీ  భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకములో భక్తియుతులైన పండ్లను దానము చేస్తారో వారి పాపాలు  సూర్యోదయానికి చీకట్లవలె చెదిరిపోతాయి. ఉసిరిచెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరిజూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీకములో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీదళాలతో పూజిస్తారో , వారికి మించిన ధన్యులెవరూ  ఉండరనడం అతిశయోక్తి కాదు.


బ్రాహ్మణ సమేతులై , ఉసిరిచెట్టు వున్న తోటలో - వనభోజనమును చేసేవారి మహాపాతకాలు సైతము మట్టిగలసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరిచెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువువలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసములో  విష్ణ్వాలయములో మామిడాకుల తోరణం కడతారో , వాళ్లు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతోగాని , అరటి స్తంభాలతో గాని మండపము కట్టినవాళ్లు వైకుంఠములో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండప్రణామమును చేసిన వాళ్లు అశ్వమేథ పుణ్యవంతులవుతారు. విష్ణువున కెదురుగా జప , హోమ దేవతార్చనలు చేసే వాళ్లు పితరులతో సహా వైకుంఠానికి వెళ్లి సుఖిస్తారు. స్నానము చేసి తడిబట్టలతోనున్న వానికి పొడిబట్టని దానము చేసిన వాడు పదివేల అశ్వమేథాల ఫలాన్ని పొందుతాడు. ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి -  పుష్పము  పరాగమువలె యెగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసెపూలతో హరిపూజను చేసిన వారికి పదివేల యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది.


కార్తీకమాసమందు యే స్త్రీ అయితే బృందావనాన గోమయంతో అలికి , పంచరంగులతోనూ , శంఖ - పద్మ - స్వస్తికాదిరంగ వల్లులను తీరుస్తుందో ఆమె విష్ణువుకు ప్రియురాలవుతుంది. విష్ణు సన్నిధిలో నందా దీపాన్ని ఆర్పించడం వలన కలిగే పుణ్యాన్ని వేయినోళ్ల అదిశేషుడైనా పొగడలేడు. ఈ కార్తీకమాసములో శివుని జిల్లేడుపూలతో పూజించినవాడు దీర్ఘయువై , అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. విష్ణ్వాలయములో మండపాన్ని అలంకరించినవారు హరి మందిరములో చిరస్థాయిగా వుంటారు. హరిని మల్లెపువ్వులతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమై పోతాయి. తులసీ గంధముతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వసంచిత పాపాలన్నీ నాశనమై పోతాయి. భక్తియుక్తులై  అన్నదానమును చేసే వారి పాపాలు గాలికి మంచుతునకలలా యెగిరిపోతాయి.  ప్రత్యేకించి కార్తీక మాసములో నువ్వుల దానము , మహానదీ స్నానము , బ్రహ్మపత్ర భోజనము ,  అన్నదానము ఈ నాలుగూ ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ వుంది. స్నాన దానాదులను నాచరింపనివారూ , లోభియై యధాశక్తిగా చేయని వారు నూరు జన్మలు కుక్కగా పుట్టి , తదుపరి నూరుపుట్టుకలూ శునకయోనిని జన్మిస్తారు.


కార్తీకమాసములో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలాన్ని భేదించుకుని స్వర్గానికి వెడతారు. పద్మాలతో పూజించినవారు చిరకాలము సూర్యమండలములోనే నివసిస్తారు. ఓ  జనక మహారాజా ! కార్తీక మాసములో యెవరైతే అవిసె పువ్వుల మాలికలతో  శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గధిపతులవుతారు. మాల్యములు - తులసీదళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక్క సూక్ష్మాన్ని చెబుతాను విను , అశక్తులయిన వాళ్లు.



      *శ్లో || కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచరేత్ !*

        *మాసస్నానేన యత్సుణ్యం తత్పుణ్యం లభతేనృప !!*

    *శ్లో|| ఆద్యేంతియే తిథౌ మధ్యమే చ దినే యః స్నానమాచరేత్ !*

         *మాస స్నాన ఫలం తేన లభ్యతే నాత్ర సంశయః !!*


కార్తీకమాసంలో ఆదివారం  నాడు లేదా శుక్ల పాడ్యమి నాడు గాని , పూర్ణమనాడు గాని , అమావ్యానాడు గాని సంకల్పరహితముగా ప్రాతఃస్నాన మాచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానము చేసిన పుణ్యం లభిస్తుంది. *'ఆ పాటి శక్తి కూడా లేని వాళ్లు  కార్తీకమాసము నెల రోజులూ ఈ సంపూర్ణ  కార్తీక మహాపురాణాన్ని చదివినా , వినినా కూడా  స్నానఫలాన్ని పొందుతారు. ఇది కేవలం ఆశక్తులకే సుమా ! మహీశా ! కార్తీకమాసములో యితరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవారి పాపాలు నశించిపోతాయి. కార్తీకమాసము విష్ణుపూజార్ధమై యితరులకు సహకరించేవారు స్వర్గాన్ని పొందుతారు. తాము స్వయంగా సంకల్ప పూర్వకముగా విష్ణువును పూజించేవాళ్ళు అవ్యయ పదాన్ని పొందుతారు. కార్తీకమాసము సాయంకాలాలలో దేవాలయాలలో శివ - విష్ణుస్తోత్రాలను పఠించేవారు - కొంతకాలము స్వర్గలోకములో వుండి - అనంతరము ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతీ ! కార్తీక మాసములో యెవరైతే హరిహరులను స్మరించకుండా వుంటారో వాళ్లు ఏడుజన్మలపాటు నక్కలుగా పుడతారనడంలో ఏమీ సందేహము లేదు.*


*' నమ శివాభ్యం నవ యౌ వనాభ్యాం పరస్ప రాశ్లి ష్ట వపుర్ధ రాభ్యాం*

*నాగేంద్ర కన్యా వృష కేత నాభ్యం నమో నమ శంకర పార్వతీ భ్యాం''*


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి*

*సప్తమధ్యాము - సప్తమ దిన పారాయణము సమాప్తం.*


🚩🕉️🕉️🙏🙏🕉️🕉️🚩

🚩 *_8 వ అధ్యాయము_*🚩


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*శ్రీ హరి నామస్మరణా ధన్యోపాయం*

*ఆజా మీళుని కథ*



🕉️☘☘☘☘☘☘🕉️


వశిష్టుడు చెప్పిన దంతా విని ' మహానుభావా ! తమరు చెప్పిన ధర్మములన్నింటిని శ్రద్దగా వింటిని. అందు ధర్మము బహు సుక్ష్మ మనియు , పుణ్యం సులభంగా కలుగు ననియూ , అది - నదీస్నానము , దీపదానము , ఫలదానము , అన్నదానము , వస్త్ర దానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప దర్మములచేతనే మోక్షము లబించుచుండగా  వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్టులె చెప్పు చుందురు గదా ! మరి తమరు యిది సూక్ష్మములో  మోక్షముగా కనబరచినందుకు నాకు అమితాశ్చర్యము  కలుగుచున్నది. దుర్మార్గులు  కొందరు సదాచారములను పటింపక , వర్ణ సంకరులై రౌరవాది నరక హేతువులగు 

మహా పాపములు చేయువారు యింత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్ధించు చున్నాను'యని కోరెను.


అంతట వశిష్టుల వారు చిరునవ్వు నవ్వి .  జనక మహారాజా ! నీవు వేసిన ప్రశ్న సహేతుక మైనదే , నేను వేద వేదంగములను కూడా పటీంచితిని. వానిలో కూడా సుక్ష్మ మార్గాలున్నవి. అవి యేమనగా సాత్విక , రాజస , తామసములు అని ధర్మము మూడు రకములు సాత్విక , మనగా దేశ కాల పాత్రలు మూడును సమకూడిన సమయమును సత్త్వమను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరర్పితము కావించి , మనో వాక్కాయ కర్మలచె నొనర్చిన ధర్మము అ ధర్మమందు యెంతటా ఆధిక్యత కలదు.  సాత్త్విక ధర్మము సమస్త పాపములను నాశన మొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్రమున కలియు తావునందు స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి ధగ ధగ మెరిసి , ముత్యమగు విధానముగా సాత్త్వికత వహించి , సాత్త్విక ధర్మ మాచరించుచూ గంగ , యమునా , గోదావరి , కృష్ణ నదుల పుష్కరాలు మొదలుగు పుణ్య కాలముల యందు దేవాలయముల యందు - వేదములు పటించి , సదచారుడై , కుటింబీకుడైన బ్రాహ్మణునకు యెంత స్వల్ప దానము చేసిననూ , లేక ఆ నదీ తీరమందున్న  దేవాలయం లో జపతపాదు లోనరించినను విశేష ఫలమును పొందగలరు.

రాజస ధర్మ మనగా - ఫలాపేక్ష  కలిగి శాస్త్రోక్త  విధులను విడిచి చేసిన దర్మం. ఆ ధర్మం పునర్జన్మ  హేతువై కష్ట సుఖాలు కలిగించున దగును.

తామస ధర్మమనగా - శాస్త్రోక్త  విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికా చరణార్ధం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నీయదు.

దేశకాల పాత్రము సమ కూడినపుడు తెలిసి గాని తెలియకగాని యే స్వల్ప ధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీ మన్నా నారాయుణుని నామము , తెలిసి గాని , తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక యితిహాసము కలదు.


*🌹ఆజా మీళుని కథ🌹*


పూర్వ కాలమందు కన్యా కుబ్జ మను నగరమున నాల్గు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్య వ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమ వతియను భార్య కలదు. ఆ దంపతులన్యోన్య ప్రేమ కలిగి అ పూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలాకాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించెను. వారాబాలుని అతి గారాబముగా పెంచుచు , అజా మీళుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దిన దిన ప్రవర్ధ మానుడగుచు అతి గారాబము వలన పెద్దలను కూడ నిర్లక్షముగా చూచుచు , దుష్ట సావసములు చేయుచు , విద్య నభ్య సింపక , బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించు చుండెను. ఈ విధముగా కొంత కాలమునకు యవ్వనము రాగా కమంధుడై , మంచి చెడ్డలు మరిచి , యజ్ఞో పవితము త్రెంచి , మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీ ని వలచి , నిరంతరము నామెతోనే కామా క్రీడలలో తేలియాడుచూ , యింటికి రాకుండా , తల్లిదండ్రులను మరిచి , ఆమె ఇంటనే భుజించు చుండెను. అతి గారాబము యెట్లు పరిణమించినదో వింటివా రాజా ! తమ బిడ్డలపై యెంత అనురాగామున్ననూ పైకి తెలియ పర్చక చిన్ననాటి నుంచీ అదుపు ఆజ్ఞలతో నుంచకపోయిన యెడల యీ విధంగానే జురుగును. కావున ఆజామీళుడు కుల భ్రష్టుడు కాగా , వాని బంధువులు తనని విడిచి పెట్టిరి. అందుకు ఆజామీళుడు రెచ్చిపోయి వేటవలన పక్షులను , జంతువులను చంపుతూ కిరాత వృత్తి లో జీవించు చుండెను. ఒక రోజున ఆ యిద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తెనేపట్టుకై చెట్టేక్కి తేనెపట్టు తియబోగా కొమ్మ విరిగి క్రింద పడి చనిపోయెను. ఆజామీళుడు ఆ స్త్రీ పైబడి కొంత సేపు యేడ్చి , తరువాత ఆ అడవి యందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ యెరుకుల దానికి అంతకు ముందే ఒక కుమార్తె వుండెను. కొంత కాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామంధ కారాముచె కన్ను మిన్ను గానక ఆజా మీళుడు ఆ బాలికను కూడ చేపట్టి ఆమెతో కూడ కామ క్రీడలలో తేలియాడు చుండెను. వారికి యిద్దరు కొడుకులు కూడ కలిగిరి. ఇద్దరూ పురిటి లోనె చచ్చిరి. మరుల ఆమె గర్భము దరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి *'నారాయణ'* అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైన నూ ఆ బాలుని విడువక , యెక్కడకు వెళ్ళినా వెంట బెట్టుకుని వెళ్ళుచూ , *' నారాయణా - నారాయణా'* అని ప్రేమతో సాకు చుండిరి. కాని *' నారాయణ'* యని స్మరించిన యెడల తన పాపములు నశించి , మోక్షము పొంద వచ్చునని మాత్రమతనికి తెలియకుండెను. ఇట్లు కొంత కాలము జరిగిన తర్వాత అజా మీళునకు శరీర పటుత్వము తగ్గి రోగ గ్రస్తుడై 

మంచము పట్టి చావునకు సిద్ద పడి యుండెను. ఒకనాడు భయంకరాకారములతో , పాశాది ఆయుధములతో యమ భటులు ప్రత్యక్ష మైరి. వారిని చూచి అజా మీళునకు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక *' నారాయణా ' నారాయణా'* యనుచునే ప్రాణములు విడిచెను. అజా మీళుని నోట *' నారాయణా'* యను శబ్దము వినబడగానే యమ భటులు గడ గడ వణక సాగిరి. అదే వేళకు దివ్య మంగళ కారులు శంఖ చక్ర గదా ధరులూయగూ *శ్రీ మన్నారాయణుని* దూతలు విమానములో నచ్చటికి వచ్చి *' ఓ యమ భటులారా ! వీడు మావాడు మేము వీనిని వైకుంటమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి'* యని చెప్పి , అజా మీళుని విమాన మెక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు *' అయ్యా ! మీ రెవ్వరు ? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటికి వచ్చితిమి గాన , వానిని మాకు వదలుడని కొరగా విష్ణు దూతలు యిట్లు చెప్పదొడంగిరి.



*ఇట్లు స్కాంద పురాణాంర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి*

*ఎనిమిదో అధ్యయము- ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము.*

🚩🌹🌷🕉️🕉️🌷🌹🚩

_*9 వ అధ్యాయము*_🚩


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*విష్ణు పార్షద , యమ దూతల వివాదము*


🕉️☘☘☘☘☘☘🕉️


*'ఓ యమ దూత లారా ! మేము విష్ణు దూతలము వైకుంటము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమ ధర్మరాజు యెటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను'యని ప్రశ్నిచిరి. అందుకు జవాబుగా యమదూతలు ' విష్ణు దూత లారా ! మానవుడు చేయు పాపపున్యడులను సూర్యుడు , చంద్రుడు , భూదేవి , ఆకాశము , ధనంజయాది వాయువులు , రాత్రింబవళ్లు  సంధ్య కలం సాక్షులుగా వుండి ప్రతి దినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించు చుందురు. మా ప్రభువుల వారీ కార్య కలాపములను చిత్ర గుప్తునిచే చూపించి ఆ మనిజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులెటువంటి వారో వినుడు.

వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రములు నిందించు వారును , గోహత్య , బ్రహ్మ హత్యాది మహాపపములు చేసినవారు , పర స్త్రీ లను కామించిన వారును , పరాన్న భుక్కులు , తల్లిదండ్రులను - గురువులను - బంధువులను - కుల వృతిని తిట్టి హింసించు వారున్నూ , జీవ హింస చేయు వారున్నూ దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పిడించు వారును , జారత్వం చొరత్వంచే భ్రష్టులగు వారును , యితరుల ఆస్తిని స్వాహా చేయు వారును , చేసిన మేలు మరచిన కృతఘ్నులును , పెండిండ్లు శుభ కార్యములు జరగనివ్వక అడ్డుతగిలే వారునూ పాపాత్ములు. 


వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి యాజ్ఞ. అది అటులుండగా ఈ అజా

మీళుడు బ్రాహ్మణుడై పుట్టి దురచారములకు లోనై కుల భ్రష్టుడై జీవ హింసలు చేసి , కామాంధుడై వావివరసలు లేక , సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణు లోకమునకు యెట్లు తీసుకొని పోవుదురు ? ' అని యడగగా విష్ణు దూతలు ' ఓ యమ కింకరులారా ! మీరెంత యవివేకులు ? మీకు ధర్మ సుక్ష్మములు తెలియవు. ధర్మ సుక్ష్మములు లేట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును , జపదాన ధర్మములు చేయువారును - అన్నదానము , కన్యాదానము , గోదానము , సాలగ్రామ దానము చేయువారును , అనాధ ప్రేత సంస్కాములు చేయువారును , తులసి వనము పెంచువారును , తటాకములు త్రవించువారును , శివ కేశవులను పూజించు వారును సదా హరి నామ స్మరణ చేయువారును మరణ కాలమందు *' నారాయణా'* యని శ్రీ హరిణి గాని , *' శివ '* అని శివుని గాని స్మరించు వారును , తెలిసిగాని తెలుయక గాని మరే రూపమున గాని హరి నామస్మరణ చెవిన బడిన వారును పుణ్యాత్ములు ! కాబట్టి అజా మీళుడు ఎంత పాపత్ముడైనాను మరణకాలమున *"నారాయణా"* అని పలికిరి.

అజా మీళుడు విష్ణు దూతల సంభాషణ లాలకించి ఆశ్చర్యమొంది *" ఓ విష్ణు దూతలారా ! పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీ మన్నారాయణ పుజగాని వ్రతములు గాని , ధర్మములుగాని చేసి యెరుగను. నవ మాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణ మిల్లలేదు. వర్ణాశ్రమములు విడిచి కుల భ్రష్టుడనై , నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారుని యందున్న ప్రేమచో *"నారాయణా"* యని నంత మాత్రమున నన్ను ఘోర నరక భాదలనుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా ! నేనెంత అదృష్టవంతుడను ! నా పూర్వ జన్మ సుకృతము , నా తల్లి తండ్రుల పుణ్య ఫలమే నన్ను రక్షించినది. " అని పలుకుచు సంతోషముగా విమాన మెక్కి వైకుంఠమున కేగెను. కావున ఓ జనక చక్రవర్తీ ! తెలిసిగాని , తెలియక గాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలేక్కి భాద , కలిగించునో , అటులనే శ్రీ హరినామం స్మరించిన యెడల సకల పాపములును నశించి మోక్షము నోన్దేదరు. ఇది ముమ్మాటికినీ నిజము.



*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి*

*నవమద్యయము- తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము.*

🚩 _*10 వ అధ్యాయము*_🚩


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*అజామీళుని పూర్వ జన్మ వృత్తాంతము*


🕉️☘☘☘☘☘☘🕉️


జనకుడు వశిష్టుల వారిని గాంచి *" ముని శ్రేష్ఠ ! యీ అజా మీళుడు యెవడు ? వాడి పూర్వ జన్మ మెటువంటిది ? పూర్వ జన్మంబున నెట్టి పాపములు చేసియుండెను ? ఇప్పడీ విష్ణు దూతలు వైకుంటమునకు తీసుకొనిపోయిన తరువాత నేమి జరిగెను ? వివరించ వలసినది "* గా ప్రార్ధించెను. అంత నా మునిశ్రేష్టుడు జనక మహారాజును గాంచి యిట్లు పలికెను.

జనకా ! అజా మీళుని విష్ణు దూతలు వైకంఠమునకు తీసుకొనిపోయిన తరువాత యమ కింకరులు తమ ప్రభువగు యమ ధర్మరాజు కడ కేగి , *" ప్రభూ ! తమ అజ్ఞ ప్రకారము అజా మీళుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణు దూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీళుని విమాన మెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. మేము చేయునది లేక చాల విచారించుచూ యిచటకు వచ్చినారము'* అని భయ కంపితులై విన్నవించు కొనిరి.

*"జా రా ! ఎంత పని జరిగెను ? ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి యుండలేదే ? దీనికి బలమైన కారణము ఏదైనా వుండి యుండవచ్చును"* అని యముడు తన దివ్య దృష్టితో అజా మీళుని పూర్వ జన్మ వృత్తాంతము తెలుసుకొని *" ఓహొ ! అది యా సంగతి ! తన అవ సాన కాలమున " నారాయణ" అని వైకంఠవాసుని స్మరణ జేసి యుండెను. అందులకు గాను విష్ణు దూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి. తెలిసి గాని , తెలియక గాని మృత్యువు సమయమున హరి నామస్మరణ మెవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. గనుక , అజా మీళునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా !"* అని అనుకొనెను.

అజా మీళుడు పూర్వ జన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగా నుండెను. అతడు అపురూపమైన అందంచేతను , సిరి సంపదల చేతను , బలము చేతను గర్విష్టి యై శివారాధన చేయక , శివాలయము యొక్క ధనము నపహరించుచు , శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములను బెట్టక , దుష్ట సహవసములను మరిగి విచ్చలవిడిగా తిరుగు చుండెడి వాడు. ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరుని కెదురుగా పాదములుంచి పరుండెడి వాడు. ఇతని కొక బిద బ్రాహ్మణ స్త్రీ తో రహస్య సంబంద ముండెడిది. ఆమె కూడా అందమైనదగుటచే చేయునది లేక ఆమె భర్త చూచియు చూడ నటుల నుండి భిక్షాటనకై వురూరా తిరుగుచూ ఏదో వేళకు యింటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు. ఒకనాడు పొరుగూరికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిని బెట్టుకొని వచ్చి అలిసిపోయి *" నాకు యీ రోజున ఆకలి మిక్కుటముగా నున్నది త్వరగా వంట చేసి పెట్టుము",* అని భార్యతో ననెను. అందులకామె చిదరించుకోనుచు , నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా యీయక , అతని 

వంక కన్నెత్తి యైననూ చూడక విటునిపై మనస్సు గలదియై మగని తూలనాడుట వలన భర్తకు కోపం వచ్చి పక్కనున్న కఱ్ఱతో బదెను. అంత ఆమె భర్త చెతి నుండి కఱ్ఱ లాగు కొని భర్తను రెండితలు కొట్టి బైటకు త్రోసి తలుపులు మూసివేసెను. అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక యింటి ముఖము పట్ట రాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను. భర్త యింటి నుండి వెడలి పోయెను కదా యని సంతోషించి , ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగు పై కూర్చుండి యుండగా ఒక చాకలి వాడు ఆ దారిని పోవుచుండెను. అతనిని పిలిచి *" ఓయీ ! నీవి రాత్రి నాతో రతి క్రీడ సలుపుటకు రమ్మని కొరెను. అంత నా చాకలి *" తల్లి ! నీవు బ్రాహ్మణ పడతివి. నేను నిచాకులస్తుడును , చాకలి వాడిని మిరీ విధముగ పిలుచుట యుక్తము గాదు. నేనేట్టి పాపపు పని చేయజాలను"* అని బుద్ది చెప్పి వెడలి పోయెను. ఆమె ఆ చాకలి వాణి అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటనుండి బయలుదేరి ఆ గ్రామ శివర్చకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరి పరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి వుదయమున యింటికి వచ్చి *" అయ్యో ! నే నెంతటి పాపమునకు ఒడి గట్టితిని ? అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను యింటి నుండి వెడలగొట్టి క్షణికమయిననకామవాంఛకు లోనయి మహాపరాధము చేసితిని"* అని పాశ్చాత్తాపమొంది , ఒక కూలి వానిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తకు వెదికి తీసుకు రావలసినదిగ పంపెను. కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త యింటికి రాగా పాదముల పై బడి తన తప్పులను క్షమించమని ప్రార్ధించెను. అప్పటి నుండి మంచి నడవడిక నవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను. కొంత కాలమునకు శివర్చకునకు నేదియో వ్యాధి సంక్రమించి దిన దినము క్షీణించుచు మరణించెను. అతడు రౌర వాది నరక కుపముల బడి నానా బాధలు పొంది మరల నానా జన్మ మెత్తి సత్య వ్రాతుడను బ్రాహ్మణో త్తమునకు కుమారుడై కార్తీక మాసమున నది స్నానము చేసి దేవత దర్శనము చేసి యుండుట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజా మీళుడై పుట్టెను. ఎప్పటికి తన అవసాన కాలమున *'నారాయణా'* అని శ్రీ హరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగ గ్రస్తురాలై చనిపోయెను. అనేక యమ యాతనలన నుభవించి ఒక మల వాని యింట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మ రాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. మాల వాడు శిశువును తీసుకొనిపోయి అడవి యందు వదిలిపెట్టేను. అంతలో నొక విప్రుడు ఆ దారిన పోవుచు పిల్ల యేడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన యింట దాసికిచ్చి పోషించెను. ఆ బాలికనే అజామీళుడు ప్రేమించెను. వారి పూర్వ జన్మ వృత్తాంత మిదియే. నిర్మల మైన మనస్సుతో శ్రీ హరిని ధ్యానించుట , దాన ధర్మములు , శ్రీ హరి కథలను ఆలకించుట , కార్తిక మాస స్నాన ప్రభావముల వలన నెటువంటి వారైననూ మోక్ష మొందగలరు. గాన కార్తిక మాసము నందు వ్రతములు , పురాణ శ్రవణములు చేసిన వారలిహపర సుఖములు పొంద గలరు.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి*

*దశమా ధ్యాయము- పదవ రోజు పారాయణము సమాప్తము.*


🚩🌹🌷🕉️🕉️🌷🌹🚩

కామెంట్‌లు లేవు: