[ *కోకిలొక్కటి కావు కావని గొంతు విప్పె నుగాదికిన్*
ఈ సమస్యకు నా పూరణ.
లోకమంతయు వెల్గులీనదె రూఢిగా నవకమ్ముగన్
మాకు నిచ్చును వత్సరంబని మంచి గోరుచు పల్కగా
కోకిలొక్కటి - కావు కావని గొంతు విప్పె నుగాదికిన్
చీకటుల్ కొలువుండె నాకని చిత్తమున్ చెడి కాకమున్.
అల్వాల లక్ష్మణ మూర్తి.
*సున్నకుc బుట్టినట్టి యరసున్న గనంబడదేమి చోద్యమో*
ఈ సమస్యకు నా పూరణ.
సున్నయె తండ్రికిన్ చదువు శూన్యమె జీవనకార్యమందునన్
మన్నికయైన దొక్కపని మాటకు మాత్రము గుర్తులేదయో
ఎన్నడు వాని పుత్రునిని నెక్కడనైనను చూడకుంటిమే
సున్నకుc బుట్టినట్టి యరసున్న గనంబడదేమి చోద్యమో.
అల్వాల లక్ష్మణ మూర్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి