*2086*
*కం*
ఉన్నప్పుడు విలువెరుగక
మన్నునబడిపోయినంత మన్ననలెరుగన్
ఖిన్నము మాత్రమె మిగులును
చిన్నగ ననపించు నిజము చిత్రము సుజనా.
*భావం*:-- ఓ సుజనా! ఉన్నంతకాలం విలువలు ఎరుగక చనిపోయిన తరువాత వారి ఔన్నత్యం తెలుసుకోవడం వలన వేదన మాత్రమే మిగులుతుంది. చిన్న విషయం గా కనిపించే ఈ నిజం చాలా చిత్రమైనది.
*సందేశం*:-- సాధారణంగా తల్లిదండ్రులు ఉన్నంతవరకూ వారి విలువలు తెలియవు. వారు గతించిన తరువాత ఎంత బాధపడిననూ వేదన మాత్రమే మిగులుతుంది. ఇదే చిన్న గా కనబడే పెద్ద విషయం అని అప్పటి వరకూ బోధపడదు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి