*శ్రీ మన్మహాగ్ని చయన ఛాందసాహ్వానమ్*.
*1*
*ఆ.వె.*
కోనసీమలోన కొలువై న దైవాలు
దేవయజనమునకు తావులొసగ
చయన యాగమునకు సన్నధ్ధులౌ జని
సేవలొనరుభాగ్య భావనమున.
*2*
*కం*
శ్రీ మన్మహాగ్ని చయనము
భూమండలశుధ్ధమొనరు భూతికరంబౌ.
సామాన్యజనులు సహితము
నీ మహిమాన్విత క్రతువుకు నెగబడు చుండెన్.
*3*
*సీసము*
దేశసౌభాగ్యము దేవయజ్ఞఫలము
ప్రకృతి పులకరించు ప్రాభవమ్ము
దువ్వూరి వారింటి ధూర్జటిగ ప్రకాశ
సోమయాజులు జేయు సోమదీక్ష
ముక్కోటి దేవుళ్ళ మ్రొక్కులు తీర్చేటి
చయనయాగమునకు సాయమొనర
వంశమెల్లవెలుగు పావన మార్గమ్ము
అరుగుదెంచెనిచటయని మరువ తగదు.
*తే.గీ.*
లోక కల్యాణ మొనరించ రోచనమున
యాగ సన్నద్ధమై యుండ యజ్వగణము
ప్రకృతి పులకించి చల్లార పరవశమున
భక్తులందరు పనిజేయు శక్తి తోడ.
*4*
*ఉత్పలమాల*
భూసుర జీవనంబున విభూషిత మౌ యజనంబులందునన్
భాసితమౌ మహాగ్నిసుర భాసుర చైనము జేయనెంచగన్
వాసిగ దేవులెల్లరు ప్రవాసము జేసెడి ఈ పురంబునన్
వాసము జేయనెంచు భువి భారత భక్తులకుత్సవంబగున్.
*5*
*మత్తేభవిక్రీడితమ్*
భువిలో పాపము పెచ్చరిల్లిజని భావోద్రేక చింతన్బడన్
అవనీ పాలకు లెల్లరున్కలిసి స్వాహాదేవి సైతంబుగన్
పవమానాదిగణంబులన్పిలిచి సంభారంబులన్గూర్చగన్
భువిదేవాగ్రులు యజ్ఞముల్సలుపు సంపూర్ణాశ్రయాత్మన్ మదిన్.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి