22, అక్టోబర్ 2020, గురువారం

పీయూషార్ణవమధ్యగాం

 (6)పీయూషార్ణవమధ్యగాం మణిమయద్వీపాన్తరభ్రాజినీం,

షట్చక్రాన్తరవర్తినీం విజయదాం షట్ఛ్తృసంహారిణీమ్ |

శ్రీచక్రాంతరవర్తినీం శశియుతాం పద్మాసనే సంస్థితాం,

వన్దే శారదమాతరం శ్రుతినుతాం సర్వార్థసంపూరణీమ్ ||

భావం-అమృతసముద్రమధ్యమందు ఉండేటటువంటి, మణిద్వీమమునందు విరాజిల్లేటటువంటి, ఆరుచక్రములయందు(మూలాధారము,మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞా, సహస్రారములు) సంచరించేటటువంటి, విజయమును చేకూర్చేటటువంటి, ఆరుగురుశత్రువులను(కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యములు) సంహరించేటటువంటి,శ్రీచక్రమునందు సంచరించుచున్నటువంటి, చంద్రుడు ఆభరణముగా కలిగినటువంటి, పద్మమునందు కూర్చున్నటువంటి, సర్వార్థములను సిద్ధింపజేసేటటువంటి, వేదవినుత అయినటువంటి, శారదామాతను నమస్కరించుచున్నాను.

కామెంట్‌లు లేవు: