22, అక్టోబర్ 2020, గురువారం

ఆనందం పంచేది


 ఆనందం పంచేది అమ్మా నాన్న కానీ కొన్ని జీవితాల్లో ఆనందం తుంచేది కూడా అమ్మ నాన్నే...


మంచిచెడులు అన్నీ తెలిసిన మనమే అర్థరహితంగా జీవిస్తే ఏమి తెలియని పసి హృదయాలు వారి జీవితం కుడా అర్థరహితమై పోతుంది....


జీవితంలో ప్రతి విషయంలో పిల్లలకు విలువలు నేర్పించే అమ్మ నాన్న జీవితం గురించి అవగాహన లేక ఇంకో జీవితాన్ని బలి చేయడమే అర్థంలేని అపోహలూ కొట్టుకోవడం పిల్లలను అనాథలను చేయడం....


గోరుముద్దలు తినిపించాల్సిన చిన్న వయసు కి గొడ్డలి పోట్లు చూపిస్తే జీవితం ఎలా ఉంటుంది....?


తల్లి తండ్రు లారా మీ కడుపున పుట్టిన పిల్లలకి భవిష్యత్తు నివ్వండి కానీ అంతులేని బాధని కాదు


అమ్మ నాన్నలు దయచేసి ఆలోచించండి.... మీ బాధ్యత మీ స్వార్థం కోసం మాత్రమే కాకుండా మీ భవిష్యత్తులో మిమ్మల్ని కాపాడవలసిన పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోవడం అని మరవక పోవడం మంచిద

: మనిషిది చాలా విచిత్రమైన స్వభావం ఇసుకలో సౌదం చూస్తాడు రాయిలో శిల్పం చూస్తాడు లోహంలో ఆభరణం చూస్తాడు ఆకులో ఔషధం చూస్తాడు అద్దంలో అందం చూస్తాడు వ్యసనంలో ఆనందం చూస్తాడు కానీ .. 

సాటి మనిషిలో మాత్రం మనిషిని చూడలేడు ఎందుకో .. !!

కామెంట్‌లు లేవు: