22, అక్టోబర్ 2020, గురువారం

చోద్యం బయ్యెడి

 *51. "చోద్యం బయ్యెడి నింతకాల మరిగెన్ శోధించి యేమేమి సం వేద్యాంశంబులు చెప్పిరో? గురువు లే వెంటం బఠింపించిరో విద్యాసార మెఱుంగఁ గోరెద భవ ద్విజ్ఞాత శాస్త్రంబులోఁ బద్యం బొక్కటి చెప్పి సార్థముగఁ దాత్పర్యంబు భాషింపుమా.*



*భావము:-* “నాయనా! ఎంతకాలం అయిందో నువ్వు చదువులకు వెళ్ళి? వచ్చావు కదా. చాలా చిత్రంగా ఉంది. మీ గురువులు ఏమేం క్రొత్త క్రొత్త విషయాలు చెప్పారు? నిన్ను ఎలా చదివించారు? నువ్వు చదువుకున్న చదువుల సారం తెలుసుకోవాలని ఉంది. నువ్వు నేర్చుకున్న వాటిలో నీకు ఇష్టమైన ఏ శాస్త్రంలోది అయినా సరే ఒక పద్యం చెప్పి, దానికి అర్థం తాత్పర్యం వివరించు వింటాను.




*52. నిన్నున్ మెచ్చరు నీతిపాఠ మహిమన్ నీతోటి దైత్యార్భకుల్ కన్నా రన్నియుఁ జెప్ప నేర్తురు గదా గ్రంథార్థముల్ దక్షులై యన్నా! యెన్నఁడు నీవు నీతివిదుఁ డౌ దంచున్ మహావాంఛతో నున్నాడన్ ననుఁ గన్నతండ్రి భవదీయోత్కర్షముం జూపవే."*



*భావము:-* కుమారా! నా కన్న తండ్రీ! నీ తోడి దైత్య విద్యార్థులు నీతిశాస్త్రం నీకంటే బాగా చదువుతున్నారట కదా! అందుచేత నిన్ను లెక్కచేయటం లేదట కదా! మరి నువ్వెప్పుడు గొప్ప నీతికోవిదుడవు అవుతావు? నేను ఎంతో కోరికతో ఎదురుచూస్తున్నాను. ఏదీ చదువులో నీ ప్రతిభాపాటవాలు నా కొకసారి చూపించు.”




*53. అనినం గన్నతండ్రికిఁ బ్రియనందనుం డయిన ప్రహ్లాదుం డిట్లనియె.*




*భావము:-* అలా అన్న తండ్రి హిరణ్యకశిపుడితో ప్రియ పుత్రుడైన ప్రహ్లాదుడు ఇలా అన్నాడు.

కామెంట్‌లు లేవు: