22, అక్టోబర్ 2020, గురువారం

మహిషాసుర మర్ధిని* *స్తోత్రం*

 *ॐ                 卐                ॐ*

*┉━❀꧁ఓమ్꧂❀━┅┉*

      *ॐ सदगुरुवे नमः*

      *ॐ नमः शिवाय*

    *శ్రీ ఆది శంకరాచార్య*

         *విరచితం*

   *మహిషాసుర మర్ధిని*

         *స్తోత్రం*

*┉━❀꧁ఓమ్꧂❀━┅┉*

🕉🌞🌎🌙🌟🚩  

*శ్లోకము - 5*


*అయి భో శతమఖ ఖండిత కుండలి తుండితముండ గజాధిపతే | రిపుగజగండ విదారణ చండ పరాక్రమ శౌండ మృగాధిపతే ||*

*నిజభుజదండ నిపాతిత చండ నిపాతితముండ భటాధిపతే |*

*జయ జయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||5||*


*భావము:*

---------------------


ఓ మహాతల్లీ! ఇంద్రుని నిమిత్తంగా చేసుకుని వృతాసురున్ని వధించినదానా! అప్రతిహతమైన ముండుడనే రాక్షసుడి ఏనుగుయొక్క తొండాన్ని ఖండఖండాలుగా చేసినదానా! శత్రువులయొక్క ఏనుగుసైన్యాల గండభాగాలను చీల్చి చెండాడగలిగిన సింహమును వాహనముగా గలదానా! నిజభుజ బలంతో చండముండాసురులను వారి సైన్యాలనూ మట్టికరిపించినదానా! మహిషమర్దినీ! మనోజ్ఞమైన శిరోలంకారం కలదానా!! హిమగిరి కుమారీ!!! నీకు జయమగుగాక!!!

కామెంట్‌లు లేవు: