21, ఏప్రిల్ 2025, సోమవారం

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                *విరచిత*

         *”శివానందలహరి”*

            *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉

*ఈ శ్లోకంలో అజ్ఞానమనే తెరను తొలగించి, తన కన్నుల ఎదుట సాక్షాత్కరింపుమని, శంకరులు ఈశ్వరుని వేడుకుంటున్నారు. అనేక విధాలుగా బాధపడుతున్న బుద్ధి యొక్క విచారాన్ని పోగొట్టి, ఉద్ధరింపుమని శంకరులు ప్రార్థిస్తున్నారు.*


*శ్లోకం : 77*


*బుద్ధిః స్థిరా భవితు మీశ్వరపాదపద్మ*


*సక్తా వధూర్విరహిణీవ సదా స్మరంతీ*


*సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది*


*సమ్మోహితేవ శివమంత్రజపేన వింతే !!*


*తాత్పర్యము :~*


*దయాసముద్రుడవైన ಓ ఈశ్వరా! మీ పాదపద్మముల యందు ఆసక్తిగల నా బుద్ధి, భర్తృవియోగాన్ని చెందిన భార్యవలె, నిరంతరమూ నిన్నే ధ్యానంచేస్తూ, "శివ శివ" అనే నామ మంత్రాన్ని జపిస్తూ, మోహాన్ని పొందినదై, స్థైర్యం కోసం, మీ పాదధ్యానం, మీ పాద స్మరణం, మీ పాద సందర్శనం, మీ పాద సంకీర్తనం, మీ పాదపూజ మొదలయిన వాటిని గూర్చి విచారిస్తుంది. దీన్ని ఉద్ధరించు.*


*వివరణ :~*


*బుద్ధి భర్తృవియోగాన్ని పొందిన సాధ్వివలె, శివుని పద్మాలవంటి పాదాలయందు ఆసక్తి కలిగి, ఎల్లప్పుడూ శివుణ్ణే స్మరిస్తూ శివ నామ మంత్రంతో ఈశ్వరుణ్ణే భావించడం, ధ్యానించడం, కీర్తించడం, పూజించడం మొదలయిన వాటిచే, మోహమును పొందిన దానివలె వర్తిస్తోంది.*


*అనగా శివ భక్తి పరాయణుల బుద్ధి, విరహిణియైన సాధ్వి , సదా భర్తనే స్మరిస్తున్న పిచ్చిదానివలె ఉండే విధంగా, ఎప్పుడూ ఈశ్వరునే భావిస్తూ, ధ్యానిస్తూ, కీర్తిస్తూ ఉంటుందని భావం.*


*ఈ శ్లోకంలో శంకరులు పూర్తిగా శివుని యందు నిరంతరాసక్తి కలిగిన తన బుద్ధిని, భర్తకు దూరమై విరహవేదనతో సతమతమయ్యే భార్యతో పోల్చి చెప్పారు.*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

కామెంట్‌లు లేవు: