21, ఏప్రిల్ 2025, సోమవారం

" ఆ 'కలి ' కాలం

 అంశం : మానవ సంబంధాలు -- నాడు... నేడు


శీర్షిక : "" ఆ 'కలి ' కాలం ""


ఒక్క కాకికి కష్టమొస్తే

వంద కాకులు చేరి గోల చేసినట్లు

ఆనాటి మనుష్యుల్లోని మానవ సంబంధాలు

కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ

సమాజాన్ని సన్మార్గంలో నడిపించాయి!

మరి నేడు...

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక బాంధవ్యా లై

బెల్లం చుట్టూ మూగిన ఈగల చందంగా

ధనమున్నంత సేపు ధరి చేరి

ధనమయి పోయాక ఎవరిదారిన వారు పోయే ఆ కలి కాలామిది!

ఎవరికీ వారే యమునా తీరే అనేలా

నేను, నా కుటుంబమనే స్వార్ధం తప్ప

మన అనే భావన దూర్భిణీ పెట్టి వెదికి నా కన్పించని కలి. కాలమిది!

మారింది కాలా లు కాదు

మనుష్యుల మనసుల స్వరూప స్వభావాలు

స్వార్ధ పూరిత మనుష్యుల నిజ స్వరూపాలు!

ధనం తో అన్నీ కొనలేం

మానవ సంబంధాలను అసలే కొనలేం

అందరూ బాగుండాలి

అందులో నేనుండాలను కొంటూ

పరహితం ఆశిస్తూ

హృదయమనే ప్రమిదలో

మానవత్వమనే తైలం పోసి

మంచితనమనే దివ్వెను వెలిగించి

మృగ్యమోతున్న మానవ సంబంధాలను మెరుగు పరుచుకోవాలి

మానవతా విలువలను అంకురింప చేసుకోవాలి!

...........................................

రచన

ఆళ్ల నాగేశ్వరరావు

తెనాలి

గుంటూరు... జిల్లా

ఆంధ్రప్రదేశ్... రాష్ట్రము

సెల్ నెంబర్.7416638823

...........................................

పై వచన కవిత నా స్వీయ రచనే నని హామీ ఇస్తున్నాను.

కామెంట్‌లు లేవు: