21, ఏప్రిల్ 2025, సోమవారం

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                *విరచిత*

         *”శివానందలహరి”*

            *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉🕉️

*"నీ పాద ద్వంద్వాన్ని ఒక్కసారి నా కళ్ళకు కనబడేటట్లు చెయ్యి, నీ పాదాలను ఒత్తుతాను" అని శంకరులు శివుణ్ణి ఈ శ్లోకమున కోరారు.*


 *శ్లోకం : 79*


*నిత్యంయోగి మనస్సరోజదళ సంచార క్షమస్త్వత్క్రమః*


*శంభో! తేన కథం కఠోర యమరాడ్వక్షః కవాటక్షతిః*


*అత్యంతం మృదులం త్వదంఘ్రి యుగళం హామే మనశ్చింతయ*


*త్యే తల్లోచనగోచరం కురు‍విభో! హస్తేన సంవాహయే!!*


*తాత్పర్యము :-*


*ಓయి శంకరా! నీ పాద విన్యాసము నిత్యమునూ పద్మ దళము వలె మెత్తని యోగీంద్రుల మనస్సులలో సంచరించడానికి తగినది. దానితో అతి కఠినమైన యముడి వక్షః కవాటాన్ని తన్నడం ఎలా జరిగింది ?*

*నీ పాద యుగళము మిక్కిలి మృదువైనది. అందుచే నా మనస్సు, నీకు ఆ బాధ ఎలా తీరుతుందా ? అని ఆలోచిస్తుంది. నీ పాద ద్వంద్వాన్ని ఒక్కసారి నాకళ్ళకు కనబడేటట్లు చెయ్యి, దానిని నా చేతితో ఒత్తి నీకు శ్రమ తీరుస్తాను.*


*వివరణ:-*


*శంకరులు ఈశ్వరుణ్ణి ఆయన పాదాలను సేవించే భాగ్యం తనకు ప్రసాదించమని ఇలా కోరారు.*


*ಓ ఈశ్వరా! నిన్ను నిరంతరం యోగీశ్వరులు, హృదయాలలో ధ్యానిస్తూ వుంటారు. అప్పుడు నీవు వారి హృదయ కమలాల రేకులపై సంచరించాలి. ఇది నీకు నిత్యకృత్యం. సహజంగా నీ పాదాలు మృదువుగా వుంటాయి. ఆందులోనూ యోగీశ్వరుల హృదయ పద్మాల రేకులపై నిత్యం నడుస్తూ యుండడం వల్ల అవి మరింత సుకుమరంగా, సుతిమెత్తగా తయారయి యుంటాయి. అటువంటి పాదాలతో బండ రాయి లాంటి కఠినమైన యముడి వక్షఃస్థలాన్ని నీవు ఎలా తన్నావు ? అయ్యో ! నీసాహసాన్ని తలచుకుంటేనే నా హృదయం ద్రవించి పోతుంది. ఏదీ నీ పాదాలను ఒక్కసారి నా కనుల ముందు పెట్టు. నా చేతులతో వాటిని పట్టుకుని ఒత్తుతాను.".అని చెప్పి శంకరులు ఈశ్వర పాదసేవా భాగ్యాన్ని దక్కింౘుకునే ప్రయత్నం చేశారు.*


*భగవంతుడి పాద దర్శనంవల్ల కలిగే ఆనందానుభూతిని గురించి కేవలం బ్రహ్మాదులకే తెలుస్తుంది.మనం శివ పాదారవింద దర్శనం వల్ల కలిగే అనుభూతిని ఊహించలేము.*


*గుహుడు రామచంద్రుని పాదములను కన్నులారా చూసి , వాటిని కడిగి ఆ పాదాలను తన మనస్సులో నిల్పుకొని పరమానందంతో పారవశ్యం చెందాడని రామాయణం చెపుతోంది.*


*అలాగే గోపికలు బాలకృష్ణుని పాదాలను చూసి వాటిని చేతితో పట్టి ఎత్తి కన్నులకద్దుకుని తమ శిరస్సులపైన, హృదయం పైన పెట్టుకుని మైమరచి పోయారు.*


*భాగవతంలో అక్రూరుడు నంద గోకులానికి వెళ్ళి కృష్ణుడు నడచిన ఇసుకపై ఆయన పాద ముద్రలను చూసి ఆనందంతో తన రథాన్ని దిగి ఆ ఇసుకలో పొర్లాడాడు. ఇదీ భగవంతుడి పాద మహిమ.*  


*అందుకే శంకరులు ఈశ్వరుణ్ణి తనకు శివుని పాద సేవా భాగ్యాన్ని కల్పించమని కోరారు..*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

కామెంట్‌లు లేవు: