🕉🕉🕉🛐🛐🕉🕉🕉🕉
*అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలు*
*వాటి కథనాలు క్లుప్తంగా !*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*దేవీ నవరాత్రులు జరిగినన్ని రోజులూ దేశం మొత్తం ఎంతో ఘనంగా అమ్మవారిని స్మరించుకుంటారు. అయితే అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలు ఉన్న ప్రాంతాల్లో పూజలు మరింత ప్రత్యేకం. ఆ ప్రాంతాల గురించి తెలుసుకుంటే జన్మ ధన్యం అయినట్టే……*
*లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే…. అనే శ్లోకం అందరికీ తెలిసే ఉంటుంది.*
*ఇది ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకం. అష్టాదశ శక్తిపీఠాల విషయంలో దీన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి.*
*వీటిలో నాలుగు శక్తిపీఠాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి, అవి శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, ద్రాక్షారామం.*
*మిగిలిన వాటిలో పన్నెండు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా మిగిలిన వాటిలో ఒకటి శ్రీలంకలోనూ రెండవది కాశ్మీర్‌లోనూ ఉంది.*
*ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో మూడు గయాక్షేత్రాలూ (గయ-శిరోగయ, పిఠాపురం-పాదగయ, జాజ్‌పూర్-నాభిగయ)*
*రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలూ (శ్రీశైలం, ఉజ్జయిని) ఉండటం మరో విశేషం.*
*ఆ క్షేత్రాల గురించిన వివరాలు...*
*1. శాంకరీదేవి: లంకాయాం శాంకరీదేవి అంటే...మునులూ రుషుల లెక్కప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్యరేఖకు సున్నాడిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు.*
*ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)లోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది.*
*2.కామాక్షి : సతీదేవి వీపుభాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది. పాశాంకుశాలూ చెరకుగడ, భుజంపై చిలుకతో పద్మాసనస్థితిలో కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరిసంపదలూ కలుగుతాయని ప్రతీతి.*
*3.శృంఖల: అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉన్నదని కొందరూ, కోల్‌కతకు దగ్గరలో ఉన్నదని మరికొందరూ అంటారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు సమీపాన ఉన్న సురేంద్రనగర్‌లో కొలువై ఉన్న 'చోటిల్లామాత'ను అక్కడివారు శృంఖలా (శృంగళా) దేవిగా భావిస్తారు. కానీ... పశ్చిమబెంగాల్‌లో ఉన్న 'పాండువా'నే అసలైన శక్తిక్షేత్రం అని ఎక్కువ శాతం మంది విశ్వసిస్తారు. అయితే, పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది. పురాతత్వశాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ 'మేళతాళ' పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం.*
*(రేపు మరికొన్ని శక్తి పీఠాలు గురించి తెలుసుకుందాం)*
*ఓం శ్రీ మాత్రే నమః॥*
*ఓం శ్రీ మాత్రే నమః॥*
*ఓం శ్రీ మాత్రే నమః॥*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*ఓం శాంతిః శాంతిః శాంతిః!*
*సర్వేజనా సుఖినోభవంతు!!*
*ఓం తత్సత్!!*
*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*
*ఓం నమః శివాయ!!!*
🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐
*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*
🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి