22, సెప్టెంబర్ 2023, శుక్రవారం

మహాభారతములో - ఆది పర్వము*

 *మహాభారతములో - ఆది పర్వము*


*ప్రథమాశ్వాసము*


           *2*


శౌనకుడు నైమశారణ్యంలో సత్రయాగం చేస్తున్న సమయంలో అక్కడకు రోమహర్షుని కుమారుడైన ఉగశ్రవసుడు అను సూతుడు వచ్చాడు. సూతుడు తనను తాను మునులకు పరిచయం చేసుకుని తాను పురాణకథలు చెప్పటంలో సిద్ధహస్థుడినని చెప్పాడు. అక్కడ ఉన్న మునులు పుణ్యకథను వినాలని కోరికను ఉగ్రశ్రవసువునకు తెలిపారు. ఉగ్రశ్రవసువు వారికి ఒక కథ చెప్పటం ప్రారంభించాడు.


 పూర్వం కృష్ణద్వైపాయనుడు అను మహర్షి ఒకటిగా ఉన్న వేదాలను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అని నాలుగు భాగాలుగా విభజించాడు. తర్వాత బ్రహ్మదేవుని అనుమతి పొంది అష్టాదశ పురాణాలను, భాగవతకథ, అణు ధర్మశాస్త్రాలను, రాజవంశ చరిత్రలను, ఇతిహాసాలు మొదలైన రచనలను చేసాడు. ఈ మహా భారతం గ్రంథాన్ని ధర్మజ్ఞులు ధర్మశాస్త్రమని, ఆత్మ జ్ఞానులు వేదాంతమని, నీతి కోవిదులు నీతి శాస్త్రమని, కవులు మహాకావ్యమని, ఇతిహాసికులు ఇతిహాసమని, పౌరాణికులు పురాణమని, లాక్షణికులు సర్వ లక్షణ గ్రంథమని అంటారు. ఈ మహాభారతాన్ని చెప్పుటకు దేవలోకంలో నారదుని, పితృలోకంలో దేవలుడిని, గరుడ, గంధర్వ, యక్ష, రాక్షస లోకాలలో చెప్పుటకు  శుకమహర్షిని, మనుష్యలోకంలో వైశంపాయుని నియమించాడు.  వైశంపాయుడు జనమేజయునికి చెప్తుండగా నేను విని అది మీకు చెప్తున్నాను.

కామెంట్‌లు లేవు: