7, మే 2025, బుధవారం

నిమిత్త మాత్రులం

 *🙏🏻🙏🏻🙏🏻జై శ్రీ సంతోషిమాత 🙏🏻🙏🏻🙏🏻*


💎 *ఒక రోజు హనుమంతుడు శ్రీరాముణ్ణి కలుసుకున్నాడు. తన మనసులో కదులుతున్న ఆలోచనలను విన్నవించుకున్నాడు. "ప్రభూ! ఒక వేళ నేను లంకకు వెళ్ళకపోతే నా జీవితంలో ఎంతో పెద్ద లోపం మిగిలిపోయేది. అన్నిటికంటే ముందు విభీషణుడి ఇంటిని నేను చూశాను "ఈ రావణ లంకలో సాధువులు కూడా ఉంటారా" అనుకున్నాను. నేను లంకలో సీతాదేవిని వెతక లేకపోతే విభీషణుణ్ణి కలిసినప్పుడు ఉపాయం చెప్పాడు.*💎


              *నేను ఎంత ప్రయత్నించినా తెలియని విషయం లంకలో ఉన్న ఆ సాధువు ద్వారానే నాకు తెలిసింది ప్రభూ! బహుశా ఈ దృశ్యం చూపించడానికే ఇక్కడకు నన్ను పంపిచారేమో! అశోక వాటికలో రావణుడు వచ్చినప్పుడు ఆయన క్రోధంతో కత్తి దూసి సీతమ్మను చంపబోతుంటే, నాకు ఒక్కసారిగా దూకి, ఆ కత్తిని లాక్కొని, అతని తల ఖండించా లనిపించింది.*💎


        🔔 *కాని మరుక్షణమే మండోదరి రావణాసురుని చెయ్యి పట్టుకుని ఆపింది. ఆ దృశ్యం చూసి నేను పులకరించిపోయాను. ఓ తండ్రీ! మీరు ఎంతమంచి పాఠాన్ని నేర్పించారు! ఒకవేళ నేను సీతమ్మను రక్షించి ఉంటే "నేను లేకపోతే ఏమయ్యేది" అనే భ్రమ ఏర్పడేది. చాలమందికి "నేను లేకపోతే ఎలా?" అనే ఇలాంటి భ్రమ ఏర్పడుతుంది. నాకు కూడా అదే జరిగేది. ప్రభూ!*🔔


            *మీరు సీతమ్మను రక్షించడమే కాదు, ఆ పనిని రావణుడి భార్యకే అప్పగించారు. సీతమ్మకు ఏమవుతుందనే చింత, భయం నాకు తొలగిపోయాయి. అలాగే, త్రిజట లంకలోకి కోతి వచ్చిందని చెప్పింది. నాకు త్రిజట కూడా ఒక గొప్ప సాధ్విని అనిపించింది. ఈ కోతి లంకను తగుల బెడుతుందని చెప్పింది. కాని మరి "నా శ్రీరాముడు లంకను తగుల బెట్టమని చెప్పలేదు కదా? ఎలా?" అని ఆలోచనలో పడిపోయాను.*🔔


       🤔 *రావణాసురుడి సభలో నేను బంధితుణ్ణి అయితే ఎలా ఉంటుందో చూడ్డానికి బందీని అయ్యాను. రావణుడి సైనికులు నన్ను చంపడానికి వచ్చినప్పుడు నన్ను రక్షించుకోవడానికి నేను ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. కాని దూతను చంపడం సరికాదని విభీషణుడు చెప్పాడు. నన్ను రక్షించడానికి ఈ ఉపాయం మీరే చేశారని నాకు అర్థమయింది.*🙂


            *ముందు విభీషణుణ్ణి నాకు చూపి నా భ్రమను తొలగించారు. సీతమ్మను రక్షించడానికి మండోదరిని నియమించారు. నన్ను రక్షించడానికి రావణుడి తమ్ముణ్ణి పంపించారు. ప్రభూ! అన్నింటి కంటే ఆశ్చర్యకరమైన విషయం...రావణుడు " కోతిని చంపకూడదు. కాని దాని తోకకు నూనెలో ముంచిన వస్త్రాన్ని చుట్టి నిప్పు అంటించవచ్చు" అన్నాడు. ఆ విధంగా లంకలో త్రిజట చెప్పిన మాట సత్యమయింది. "లంకను తగులబెట్టడానికి నూనెనూ, నిప్పునూ నేను ఎక్కడినుంచి తీసుకురాగలను" అనుకున్నాను. కానీ ఆ ఏర్పాట్లు కూడా రావణాసురుడే చేశాడు. రావణుడితో కూడా మీరు పని చేయించు కున్నప్పుడు నాతో చేయించు కోవడం పెద్ద విషయమేమీ కాదు" అన్నాడు వినయంగా.*


          *అందుకే ఈ ప్రపంచంలో ఏది జరుగుతున్నా అది కర్మసిద్ధాంతం ప్రకారమే, దైవ సంకల్సం తోనే. మనం కేవలం "నిమిత్త మాత్రులం" అని గుర్తుంచుకోవాలి*👍🏼🔔🙏🏼🙏🏼.. *ఆంధ్ర ఫోకస్✍️*సర్వేజనా సుఖినోభవంతు🙏🏻🙏🏻*

కామెంట్‌లు లేవు: