🌸 *దయాసముద్ర తరంగాలు*
(శృంగేరి శారదా పీఠం 36వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి జీవిత విశేషాలు)
శ్రీచరణులు నిరంతర పఠనశీలి. ఎన్నో గ్రంథాలను అవలోకిస్తుంటారు. కొన్ని పుస్తకాలను సంపాదించి శృంగేరికి వెళ్లినప్పుడు శ్రీచరణులకు సమర్పిద్దామని ఒక భక్తుడు అనుకుని పుస్తకాలను అమ్మే కొట్టుకువెళ్లాడు. అక్కడ పుస్తకాలను పరిశీలిస్తుంటే ఒకపుస్తకం పై అర నుండి క్రింద పడింది. అతను దానిని తీసి పైన పెట్టాడు. కాస్సేపటికి ఆ పుస్తకం మళ్లీ క్రిందపడింది. ఆ భక్తుడు తిరిగి దానిని పై అరలో పెట్టాడు. కొన్ని పుస్తకాలను ఎంచుకుని వాటిని డబ్బుకట్టే చోటికి తీసుకువెళ్తుంటే, రెండుసార్లు తాను పై అరలో పెట్టిన పుస్తకం మళ్లీ నేలమీదపడి ఉండటం చూసాడు. అప్పుడు ఆపుస్తకాన్ని కూడ కొన్నాడు.
శృంగేరికి వెళ్లి శ్రీచరణులను దర్శించిన తరువాత భక్తుడు తన సంచీనుండి తాను కొన్నపుస్తకాలను బయటికి తీసి శ్రీచరణులకు సమర్పించాడు అయితే మూడుసార్లు నేలమీద పడిన పుస్తకాన్ని మాత్రం సమర్పించలేదు.
శ్రీజగద్గురువులు : (ఆ పుస్తకాన్ని చూస్తూ) ఆపుస్తకమేమిటి?
భక్తుడు : యితరపుస్తకాలను వెదుకుతున్నప్పుడు దీనిని కొనాలనిపించింది.
శ్రీజగద్గురువులు : అలాగా! మేము దానిని ఒక్కసారి చూడవచ్చా?
భక్తుడు : తప్పక (పుస్తకాన్ని సమర్పిచాడు)
శ్రీజగద్గురువులు : (పుస్తకం పై అట్టను చూసి) ఆశ్చర్యంగా ఉంది. చాలా కాలంనుండి ఈ పుస్తకాన్ని మేము చదవాలనుకుంటున్నాము.
భక్తుడు : ఈవిధంగా ఈ పుస్తకాన్ని నేనెందుకు కొన్నానో నాకిప్పుడు అర్ధమైంది.
శ్రీచరణులు చిరునవ్వుతో యిలా అన్నారు "ఆ గొప్పతనం మాది కాదు. ఇలా. జరగాలని అమ్మవారి సంకల్పం. అలా జరిగింది."
ఆంగ్లమూలం:
కె.సురేష్ చందర్ గారు
https://chat.whatsapp.com/LbYrKf7JokM6lc6MEhj5if
తెలుగు అనువాదం :
తుమ్మలపల్లి హరిహరశర్మ గారు.
🌸 *శారదే పాహిమాం శంకర రక్షమాం* 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి