8, డిసెంబర్ 2025, సోమవారం

దయతో అంగీకరించ గలరు."

 😃😃😃😃😃😃

మధ్యాహ్నం పడుకుందామని మెయిన్ గేటు వెయ్యబోతుండగా ఒక పెంపుడు కుక్క గబగబా లోపలి వచ్చింది. కుక్కలు ఏమైనా తరుముతున్నాయేమో అని అటూ ఇటూ చూశాను. ఏమీ లేవు.


పోన్లే అని దానిని లోపలి


రానిచ్చాను. అరుగు మీద పడుకుంది.


నేను తలుపు వేసుకుని లోపల పడుకున్నాను. సాయంత్రం అయ్యింది. నేను తలుపు తీశాను. కుక్క నా దగ్గరకి వచ్చి తోక ఊపుతూ నాకేసి చూస్తోంది. బయటకు వెళ్లి పోతుందేమో అని గేటు తీశాను. వెంటనే వెళ్లి పోయింది.


ఇలా గత 6 రోజులుగా జరుగుతోంది. మధ్యాహ్నం రావడం, పడుకోవడం, సాయంత్రం వెళ్ళిపోవడం. ఆ పెంపుడు కుక్క ఎవరిదీ?


నిన్న ఒక చీటీ రాసి దాని మెడకు తగిలించి పంపాను. అందులో ఇలా రాశాను.


"ఏమండీ ! మీ కుక్క ప్రతి రోజూ మధ్యాహ్నం అయ్యేసరికి మా ఇంటి దగ్గరకి వచ్చి పడుకుంటోంది. నాకు ఇబ్బంది ఏమీ లేదు గానీ, మీరు వెతుక్కుంటారు అని రాస్తున్నాను."


ఇదిగో ఇవాళ దాని మెడలో ఒక కాగితం ఉంది.


"ధన్యవాదాలు! మా ఇంట్లో భోజనాలు కాగానే మా ఆవిడ తెలుగు సీరియళ్ళు పెట్టి దానిని నిద్ర పోకుండా చేస్తున్నందు వలన మీ ఇంటికి వచ్చి పడుకుంటోంది. అది చాలా సుఖ పడుతోంది. మీరు అనుమతిస్తే నేను కూడా వద్దామని అనుకుంటున్నాను. దయతో అంగీకరించ గలరు."


😃😃😃😃😃😃

కామెంట్‌లు లేవు: