🙏సంస్కృత భాషా వైభవం 🙏
సంస్కృతం వేదకాలము నాటి భాష , భారతదేశ 23 ఆధికారిక భాషలలో ఒకటి.
సంస్కృతం' సమ్యక్ కృతం నుండి వచ్చింది. సంస్కృతంలో, 'సమ్యక్' అంటే పరిపూర్ణం, బాగా, సంపూర్ణం, మరియు 'కృతం' అంటే పూర్తయింది.
సారాంశం సంస్కరింప బడిన భాష.
సంస్కృతం యొక్క పూర్వ సాంప్రదాయ రూపాన్ని వేద సంస్కృతం అని పిలుస్తారు . పూర్వము ధృవీకరించబడిన సంస్కృత గ్రంథం ఋగ్వేదం , అటువంటి ప్రారంభ కాలం నుండి వ్రాతపూర్వక ప్రతులు లేవు, ఆకాలంలో లిపి లేదు వేదం కేవలం మౌఖికం ద్వారానే వ్యాప్తిలోకి వచ్చింది. చరిత్ర కారులు ఏదో క్రీస్తు పూర్వం అంటారు. క్రీస్తు ఎప్పటి వాడు? ఇప్పటికి 2400 సంవత్సరాలు మరి వేదం ఐదు వేల సంవత్సరాల పూర్వం. వీరు ఎప్పటికి సంస్కృత భాష పుట్టుక గురించి చెప్పలేరు. ప్రపంచంలో మొదటి భాష సంస్కృతం. ఎవ్వరైనా అంగీకరించాలి.
భారతదేశము పాశ్చాత్యుల అధీనమయిన కాలములో, పాశ్చాత్యులు భారతీయభాషయే తమ భాషకు తల్లియని అంగీకరించుచో, అట్లొప్పుకొనుట పాలకజాతివారి గర్వమునకు భంగకరమును, పాలితజాతివారి ఆత్మగౌరవమునకు ఉద్దీపకమును అగును. అయినను ఉదారులగు పాశ్చ్యాత్యులు కొందరు ఈ సత్యమును బాహాటముగా చాటిరి. విమర్శకులలో ఉన్నతశ్రేణికి చెందిన కర్జన్ పండితుడు వ్రాసిన మాటలు
“గ్రీకు, లాటిను, మొదలైన భాషలన్నియు భిన్న, భిన్న కాలములయందు సంస్కృతభాషనుండియే ఆవిర్భవించినవి అని ఆధారాలతో పేర్కొన్నాడు
సంస్కృతం హిందూ, బౌద్ధ, జైన మతాలకు ప్రధాన భాష. నేపాలు లో కూడా సంస్కృతానికి భారతదేశములో ఉన్నటువంటి స్థానమే ఉంది.
పాణిని సంస్కృత భాష అభివృద్ధిలో గొప్ప మైలురాయి. అతను, తన కాలంలో ప్రబలంగా ఉన్న పది వ్యాకరణములను సంక్షిప్తీకరిస్తూ, అష్టాధ్యాయి అనే వ్యాకరణానికి సంబంధించిన గొప్ప వ్యాకరణ గ్రంథాన్ని వ్రాసాడు, ఇది సాహిత్య సంస్కృతం మరియు మాట్లాడే సంస్కృతం రెండూ పాణిని భాషా విధానాన్ని అనుసరించాయి. నేడు సంస్కృత భాష యొక్క ఖచ్చితత్వం పాణిని యొక్క అష్టాధ్యాయీ యొక్క గీటురాయిపై పరీక్షించబడింది
పరమేశ్వరుని డమరుక నాదము నుండి వెలువడిన శబ్ద బ్రహ్మమే సంస్కృత భాష.అట్లు వెలువడిన పదునాలుగు రకములైన సూత్రములను మాహేశ్వర సూత్రములందురు.
1 అ,ఇ,ఉ,ణ్,
2 ఋ,ఌ,క్
3 ఏ,ఓ,ఙ్
4 ఐ,ఔ,చ్
5 హ,య,వ,ర,ట్
6 ల,ణ్
7 ఞ,మ,ఙ,ణ,న,మ్
8 ఝ,భ,ఞ్
9 ఘ,ఢ,ధ,ష్
10 జ,బ,గ,డ,ద,శ్
11 ఖ,ఫ,ఛ,ఠ,థ,చ,ట,త,వ్
12 క,ప,య్
13 శ,ష,స,ర్
14 హ,ల్.
భారత దేశంలో కనీసం పది లక్షల కంటే ఎక్కువ మందే సంస్కృతాన్ని అనర్గళంగా మాట్లాడగలరు. కర్ణాటకలోని మత్తూరు అనే గ్రామములో పూర్తిగా సంస్కృతమే వ్యవహారభాష. సంస్కృతం అంటే 'సంస్కరించబడిన', 'ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన' అని అర్థం .ప్రపంచంలోని 876 భాషలకు సంస్కృతం జీవంపోసింది . సంస్కృతమునకు అమరవాణి, దేవభాష, సురభాష, గీర్వాణి మొదలగు పేర్లు ఉన్నాయి. శౌరసేని, పైశాచి, మాగధి మొదలగు ప్రాకృత భాషలు కూడా సంస్కృతము నుండియే పుట్టినవి. సంస్కృతమునందు ఏకవచనము, ద్వివచనము, బహువచనము అను మూడు వచనములు ఉన్నాయి.
అందువలన ఏ పదాన్ని సంస్కృతంలో చేర్చలేము.
ఇంకో విషయం ఏమిటంటే సంస్కృతంలో ప్రతి శబ్దానికి వ్యుత్పత్తి ఉంది.సంస్కృతంలని పదాలు మాత్రం అన్ని భాషలలోకి చేరాయి.సంస్కృత భాషకు ఇవ్వడమే గాని పుచ్చుకోవడం తెలియదు.
ప్రపంచంలోని కొన్ని భాషలతో జన్య జనక సంబంధం ఉంటే మిగిలిన అన్ని భాషలతోను పోష్య పోషక సంబంధం ఉంది. మన తెలుగు భాషకు సంస్కృతం పెంపుడు తల్లియే గాని కన్నతల్లి కాదు. ఎంతగా పోషించింది అంటే కన్నతల్లి అయిన మూల ద్రావిడ భాషనే మరిపించింది. చివరకు సంస్కృతం నుండి తెలుగు పుట్టినదేమో అనే సందేహం కలుగజేసింది.మూల ద్రావిడ భాష నుండి తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం అనే నాలుగు నాగరిక భాషలు, తుళు, గోండి, కోసి, నాయకి, పర్జీ వంటి అనాగరిక భాషలు వెలువడ్డాయి. లిపి కలిగిన భాష నాగరికభాష. లిపి లేని భాష అనాగరిక భాష
సంస్కృతమునందు నామవాచకములను విశేష్యములనియు, శబ్దములనియును, క్రియాపదముల యొక్క మూలరూపములను ధాతువులనియును వ్యవహరింతురు.
సంస్కృత భాషకు ఏ భాషలోనూ లేని విధంగా మూడు వచనాలు ఉన్నాయి.
సంస్కృతాన్ని మొదట సరస్వతీ లిపిలో వ్రాసేవారు. కాలక్రమేణ ఇది బ్రాహ్మీ లిపిగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత దేవనాగరి లిపిగా పరివర్తనం చెందింది. ఇదే విధంగా తెలుగు లిపి, తమిళ లిపి, బెంగాలీ లిపి, గుజరాతీ లిపి, అనేక ఇతర లిపులు ఉద్భవించాయి. క్రియా పదముల యొక్క లింగ, వచన, విభక్తులు నామవాచకమును అనుసరించి ఉండును.
మొదటి కావ్యాన్ని వాల్మీకి రచించాడు; అతను రామాయణాన్ని గొప్ప-కావ్యంగా వ్రాసాడు, ఇది తరువాతి సాహిత్యంపై గొప్ప ప్రభావాన్ని చూపింది. నేటికీ వాల్మీకి మార్గంలో సరికొత్త కవిత్వం రాస్తున్నారు.
రెండవ ఇతిహాసం మహాభారతాన్ని కృష్ణద్వైపాయన వ్యాసుడు రచించాడు,
తరువాత కాళిదాసు వంటి కవులు గుప్తుల కాలంలో గణనీయమైన కృషి చేశారు. భారవి, భట్టి, కుమారదాసు మరియు మాఘ - అందరూ మహాకావ్యాలు రాశారు. . శాస్త్రీయ సాహిత్యంలోని కొన్ని ఇతర విభాగాలు మరియు శాస్త్రీయ రచయితల పేర్లు: చారిత్రక కావ్యాల రంగంలో కల్హణుడు మరియు బిల్హణుడు : భర్తృహరి, అమరుక, బిల్హణ, జయదేవ, సోమదేవ మొదలైనవారు గేయ కవులుగా ప్రసిద్ధి చెందారు. బృహత్కథ, మరియు శృంగార కవిత్వం, చంపు కావ్యాలు, కవితలు మరియు సంకలనాలపై రచనలు, కవిత్వం మొదలైనవి సంస్కృత సాహిత్యంలో అసమానమైన భాగంగా ఉన్నాయి
ఉత్తరాఖండ్, ఒక భారతీయ రాష్ట్రం, సంస్కృతాన్ని తన అధికారిక భాషగా పరిగణించింది.సంస్కృత భాషకు ఎప్పుడూ మాండలికం లేదు. అలాగే, ప్రతి యుగంలో, భాష ఎప్పుడూ అలాగే ఉంటుంది.పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, సంస్కృతం నేర్చుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి