శీర్షిక..గుండె గూటిలో!
సముద్రమంత గంభీరం
గగనమంత విశాలం
గుండె గూటిలో ఎన్నో ఆలోచనలు
గలగలపారే ఆశలు అలలు
రాగాల అనురాగాల పల్లకిలో
తీయని అనుభూతుల సందడి
ఆనందాల అందాలను పంచుతూ-పంచుకుంటూ
గల గల పారే గోదారిలా నవ్వుతూ-నవ్విస్తూ
ఎదను దోచేస్తుంది జలపాతంలా..
ఆ గుప్పెడంత గుండెలోనే విప్పి చెప్పలేని బాధలు
నిరాశా నిస్పృహలు భారంగా గుండె బరువుతో
మౌనంగా మనసుని కృంగదీస్తున్న వేదనల పెను చీకట్లు
కరిగిపోతున్న కాలంతో పోటీ పడలేక నిట్టూర్పులు
గుండె దిటవు చేసుకొంటూ..
స్వాతంత్రం కోసం గుండెలు ఎదురొడ్డిన సాహస ధైర్యం
శతృవుని చీల్చి చెండాడే పరాక్రమం ఆ గుండెల్లోనే
కసాయి గుండెలు..పశువాంఛతో
అమానుష అత్యాచారాలతో అమ్మతనాన్ని చీల్చేస్తూ
జాతికి వెన్నుపోటు పొడిచే దేశ ద్రోహులు
గుండెలు తీసిన బంట్లు, విద్రోహ చర్యలతో..
మమతల కౌగిలిలో బంధించిన
లలిత లాస్య దయా కరుణా సేవా త్యాగం తో
గుండెను అర్పించిన ఘనులు, త్యాగధనులు
నీవు అండగా ఉంటే జనజీవిత స్రవంతులు
నిర్మలమైన గంగా నదిలా సాగదా జీవితం పవిత్రంగా..
ంంంంంంంంంంంంంంంంంంంంంం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి