*2022*
*కం*
వంచించగ ఘనుడేనని
మంచిగ భావించుముందు మనిషిగ నీకా
వంచితుడిచ్చిన విలువల
నెంచగనీ కుంచితమతి నెరుగుము సుజనా.
*భావం*:-- ఓ సుజనా! ఇతరులను మోసగించి గొప్పగా భావించే ముందు మనిషి గా మోసపోయిన వాడు నీకు ఇచ్చిన విలువలు గుర్తించి నీ అల్పబుధ్ధిని తెలుసుకొనుము.
*సందేశం*:-- చాలా మంది ఇతరుల ను మోసగించి తమనుతాము గొప్ప వారి గా భ్రమపడుతూ ఉంటారు కానీ మిమ్మల్ని ఎంత గొప్ప గా భావించి మీపై విశ్వాసాన్నీ చూపాడో తెలుసుకుంటే మీరు ఎంతటి నీచమైన పని చేసారో అర్థమవుతుంది.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి