24, మే 2025, శనివారం

ఏదీ వేసవి?*

 🌞🌞 *ఏదీ వేసవి?* 🌞🌞 



సీ॥

వేసవిగాడ్పులేవి? మహోష్ణతాపముల్ 

నిట్టూర్పులన్ వ్రేల్చు బిట్టులేవి? 

దిక్కులన్నిటి గల్పు తీవ్రదుమారముల్ 

చెలరేగి తిరుగాడు సీమలేవి? 

నీటముంచుకదీయ నెఱ చల్లగాలులన్ 

సృజియించు వీవనాశ్రేణులేవి? 

రోళ్ళను బగిలించు రోహిణీకార్తెలో 

సూర్యఖరమయూఖశౌర్యమేది? 

గీ॥ ప్రబలి ౘదలను దిరుగాడి వానతోడ 

పిడుగుల వడగండ్ల జెలగి భీతిగొల్పి 

ధరణి జృంభించు మేఘాలదర్పమెగయ 

గ్రీష్మలక్షణ మీనాడు కినిసెనేల? 

*~శ్రీశర్మద*

కామెంట్‌లు లేవు: