6, సెప్టెంబర్ 2023, బుధవారం

తేలిగ్గా క్రైస్తవులుగా మారిపోతారు

 "బ్రహ్మణులను అంతం చేస్తే భారతీయులందరు తేలిగ్గా క్రైస్తవులుగా మారిపోతారు" సెయింట్ జోవియర్ అనే క్రైస్తవ మత బోధకుడు పోర్చుగల్ రాజుకి ఉత్తరంలో వ్రాసిన సారాంశమిది.....

       బ్రాహ్మణ వ్యతిరేక వాదం, భారతీయులకు ముఖ్యంగా కొన్ని వర్గాల వారికి నూరిపోసిన దృష్టాంతనికి పరాకాష్ట ఆ పలుకులు..పరాయి మత చాందస వాదులచే భారతీయుల మెదడు పొరలలో నాటబడ్డ బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి కాస్తoత బుర్ర ఉంటే చాలు, మరి ప్రపంచాన్నే మార్చేసే తెలివితేటలు ఎం అవసరంలేదు....

ఈ పుణ్య భారత ధరిత్రిని ఇస్లామీ మతోన్మాద పాలకులు 800 సంవత్సరాలు, ఇసాయి మతోన్మాద పాలకులు 200 సంవత్సరాలు పాలించారు...ఈ జాత్యహంకార మతోన్మాద పాలకులు భారత దేశాన్ని, దేశ సంపదని దోచుకుంటూ మన మెదడు పొరలలో నాటిన ఒక విషబీజం బ్రాహ్మణ వ్యతిరేకవాదం.....

       హరిజనులు,నిమ్నకులాలు,అణగారిన వర్గాలని అణిచివేసింది కొంత మంది భూస్వాములు,జమీందార్లు ఇసాయిలు, ఇస్లామీలు కానీ బ్రాహ్మణులు కారు కదా..

మన దేశాన్ని పాలించిన హిందూ చక్రవర్తుల్లో అధిక శాతం బ్రహ్మణేతరులే కదా.. సామ్రాట్ చంద్రగుప్తమౌర్య, ఛత్రపతి శివాజీ మహారాజ, చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు కాకతీయ చక్రవర్తులు శాలివాహన చక్రవర్తులు చోళులు పాండ్యులు చేర హోయసళ చక్రవర్తులు ఇంకా చాలా చాలా రాజవంశాలు..వీరెవ్వరు బ్రాహ్మణులు కారు కదా.. 

*హిందూ సనాతనధర్మాన్ని పునఃప్రతిష్ట చేసిన అపర శంకర భగవానులు శంకరాచార్యులు ఒక చండాలుడి పాదాలపై పడ్డాడు, ఏం శంకరులు బ్రాహ్మణులు కారా...

*భగవాన్ రామనుజాచార్యుల వారు నీ తల వేయి వక్కలవుతుందని హెచ్చరించిన ధైర్యంగా పవిత్రమైన "ఓం నమో నారాయణాయా"మంత్రాన్ని అందరికి ఉపదేశించాడే కానీ,నా వర్గం కదా అని బ్రహ్మణులుకే చెప్పలేదే..

*చాణక్యుడు బ్రహ్మణుడే..కానీ పట్టం కట్టింది మాత్రం బ్రాహ్మానేతరుడు అయిన చంద్ర గుప్తుడికి అని చరిత్రలో ఉన్నది కదా.. 

*సమర్థ రామదాసు బ్రహ్మణుడే కదా.. పట్టం కట్టింది నిమ్నవర్గానికి చెందిన హిందూ సామ్రాజ్య స్థాపకుడైన శివాజీ మహారాజుకి..

*గోవింద దీక్షితులు.. పట్టం కట్టింది శూద్రనాయకుడైన జనాంగానుడికి.. 

*విద్యారణ్యుడు పట్టం కట్టింది కురబలైన హరిహర-బుక్కరాయ సోదరులకే.

ఇంకా చరకుడు, శుశ్రుతుడు,వరాహామిహిరుడు,ఆర్యభట్ట....

ఇలా చరిత్రలో చాలా మంది బ్రాహ్మణోత్తములు దేశం కోసం ధర్మం కోసం వర్గ బేదం లేకుండా హిందువులు అందరి కోసం సర్వం వదిలేసిన వారున్నారు..కానీ కొందరి బ్రాహ్మణుల వల్ల మొత్తము బ్రాహ్మణ సమాజాన్ని అవమాణిస్తారా...???

మరి ఈ బ్రహ్మణులు పూజించేదెవరిని..క్షత్రియుడైన శ్రీరామున్ని,గొల్లగోపకుడు యాదవుడు శ్రీకృష్ణున్ని, స్మశానంలో సంచరించే శివున్ని..

కుహనా మేధావులు చెప్తా ఉంటారు వేద జ్ఞానం కేవలము బ్రహ్మణులకే అని.. అలా అయితే పవిత్ర రామయాణన్ని రచించింది ఎవరు..?? మహాభారతం, భగవద్గితలను, పురాణలను రచించిన వారు బ్రాహ్మానులు కాదు ఇతర వర్గాలకు చెందిన వారే కద.. 

ఈ రోజు బ్రాహ్మానులకు గవర్నమెంట్ పథకాలుండవు,Resarvations ఉండవు.. ఎంత మంది బ్రాహ్మణులు పేదరికంలో మగ్గిపోతున్నారో చూడట్లేదా..??ఇతర కులాల్లో ధనికులు-బీదలు ఎలాగైతే ఉన్నారో, బ్రహ్మణులలో కూడా అంతేగా..కానీ ప్రతి అడ్డమైనా ఎదవకి Target మళ్ళీ బ్రహ్మణులే.. ఇదెక్కడి న్యాయమండి..ఎప్పుడో కొందరు చేసిన ఎదవ పనులకు వీరా బాధ్యులు..!!.ఈ రోజుకి కాశీ కి వెళ్తే రిక్షా తొక్కే వాళ్లలో సగం మంది బ్రహ్మణులే.. ఢిల్లీ రైల్వేస్టేషన్ లో కూలీ పని చేసేవారిలో 50% మంది బ్రహ్మణులే..అంతెందుకు మన తెలుగు రాష్ట్రాలలో వంట పని చేసేవారిలో 75% మంది బ్రహ్మణులే.....

    ఈ రోజు కొత్త మనుషులు పుట్టుకొచ్చారు..కాళ్లు లేనివారికి కాళ్ళు,చూపు లేనివారికి చూపు..నయం కాని Aids ని కాన్సర్ ని కూడా నయం చేసే అన్యమతస్తులు ఆఖరికి ఇంకాసేపట్లో చనిపోయేవారిని కూడా బతికిస్తాం అని మభ్యపెడుతున్నారు.. స్వస్థత సభలటవి.. కానీ వాళ్లని ఎవ్వరూ ఏమి అనరు.. కానీ వారిని హిందువులు ఎవరైనా విమర్శిస్తే మాత్రం బ్రాహ్మణులను అనరాని మాటలు అంటారు, బ్రాహ్మణులు తేరగా దొరికారు కదా..... 

        చరిత్రలో బ్రాహ్మణులపై దాడులు చూస్తే.. హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని ఎంతోమంది బ్రహ్మణులని ఊచకోత కోశారు, అప్పుడు కత్తులతో, ఇప్పుడు మాటలతో..

         మహా పవిత్ర పుణ్య క్షేత్రం అయిన కాశీలో, గంగ ఒడ్డున మతం మారడానికి నిరాకరించారు అన్న కారణంతో వేల మంది బ్రాహ్మణులను వారి పిల్లలను గొంతులు కోసి నరికి చంపి దూరం నుంచి కనపడే విధంగా ఒక పెద్ద గుట్టగా వేసాడు ముస్లిం మతోన్మాద ఔరంగజేబు.. అమాయక బ్రాహ్మణుల జంధ్యాలు తెంచి గుట్టగా పోసి నిప్పంటించి చలి కాచుకున్నడు క్రూరుడైన ఔరంగజేబ్.. 

 వేల మంది గౌడ సరస్వతి బ్రాహ్మణులను కిరాతకంగా చంపించాడు సెయింట్ జేవియర్ నేర విచారణ పేరుతో.. దీనినే మనం "Goa Inquisition" పేరుతో చరిత్రలో చదివాము కదా..... 

       మైసూరు ప్రాంతం మేల్కొటే పట్టణంలో దీపావళి పండుగ రోజున 800 మంది అయ్యంగార్ బ్రాహ్మణులను ఊచకోత కోయించాడు టిప్పు సుల్తాన్. అందుకే ఇప్పటికీ ఆ ప్రాంతంలో బ్రాహ్మణులు దీపావళి జరుపుకోరు. 

ఇక కాశ్మీరీ పండిట్ల సంగతి తెలియనిది ఎవరికీ. మతం మారతారా లేక ఇళ్ళు విడిచిపెట్టి పోతారా అని నమాజ్ అనంతరం మైకుల్లో ప్రకటన చేస్తే ప్రాణాలు అరచేత పట్టుకుని ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిభిరాలలో చేరి దిక్కు లేని జీవితం గడుపుతున్నారు లక్షల మంది కాశ్మీరీ హిందువులు.. ముష్కర జీహాదీల చేతుల్లో వేలాది మంది హత్య చేయబడ్డారు.. 

బ్రాహ్మణులు ప్రధానంగా జ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల, మత మార్పిడి మాఫియాలు ఎక్కువగా బ్రాహ్మణ వ్యతిరేక కధలు ప్రచారం చేస్తుంది. వారు చెప్పే తాటాకు, చెంబు కధలు చరిత్రలో ఎక్కడా కనపడవు. కాని ఒక అబద్దాన్ని పదే పదే చెబితే దాన్నే నిజం అనుకుంటుంది ఆలోచించే సమయం లేని లోకం.....

     హిందూ ధర్మాన్ని అంతం చేయాలంటే బ్రాహ్మానులను అంతం చేయాలి ఇదే ముస్లిం కృిస్టియన్ మతోన్మాదుల కమ్యూనిస్టు ఉన్మాదుల సిద్ధాంతం.. నేటికి కూడా అన్యమతస్తుల మూకుమ్మడి ఓట్ల కోసం ఇలా బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతాన్ని కొన్ని పార్టీలు వెనక ఉండి నడిపిస్తున్నారు. దయచేసి హిందువులు ఎవరు వారి ఉచ్చు లో పడకండి,ఎంతో మంది ముస్లింల పాలనలో వేదశాస్త్రాధ్యనాలు చేసేవారిని క్రూరంగా చంపారు, అయినా ధర్మం కోసం ప్రాణాలను పణంగా పెట్టి చదివి తరువాత తరాలవారికి అందించిన వారు బ్రాహ్మణులు, బ్రిటిష్ వారు ఎంతో మంది బ్రాహ్మణుల నుండి వేద శాస్త్ర భాష్యాలను నేర్చుకుని వారి ని వధించారు. ఎన్నో ముష్కరదాడులనుండీ లక్షల సంఖ్య లో ప్రాణత్యాగాలు చేసి ఎన్నో దేవాలయాలను కాపాడారు బ్రాహ్మణులు. ఇప్పటికీ సంపాదనలేకపోయినా సాంప్రదాయంగా వేదశాస్త్ర అధ్యయనాలు చేస్తూ జీవితాలను త్యాగం చేస్తున్నారు బ్రాహ్మణులు, కానీ కమ్యూనిస్టు లు,హేతువాదులు(వ్యాధులు),అంబేద్కరిస్టులు,బుధ్ధిస్టులు పేరులతో భారత స్వదేశంలో ఉన్న విదేశీ క్రైస్తవులు బ్రాహ్మణుల ను అడుగడుగునా వేధిస్తూనే ఉన్నారు., గ్రామాలనుండి తరిమేసారు,నానారకాల పనులు చేసుకుంటూ కూడా సర్వేజనాస్సుఖినో భవన్తు అనుకుంటూనే బ్రతుకుతున్న బ్రాహ్మణుల ను దూరం చేసుకుంటే నష్టపోయేది హిందూ సమాజమే,తద్వారా క్రైస్తవ, ముస్లింలు పెరిగి శాంతి కూడా నశిస్తుంది. మనకోసం జీవించే బ్రాహ్మణుల ను,గోవులను కాపాడుకోండి. *గోబ్రాహ్మణేభ్యశ్శుభమస్తు నిత్యం లోకాస్సమస్తాస్సుఖినో భవన్తు*

 మన సనాతన ధర్మాన్ని నిజమైన భారత చరిత్ర ని తెలుసుకోండి, ధర్మంగా జీవించండి.....

Courtesy :- శ్రీమాన్ Prasadrao Klg గారు 🙏🙏💐


నేను విశ్వకర్మీయుణ్ణి, బ్రాహ్మణుడను కాను.....

కామెంట్‌లు లేవు: