6, సెప్టెంబర్ 2023, బుధవారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 14*

  *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 14*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*క్షితౌ షట్పంచాశత్ విసమధిక పంచశదుదకే*

*హుతాశే ద్వాషష్టి శ్చతురధిక పంచాశ దనిలే |*

*దివి ద్విష్షట్త్రింశన్ మనసి చ చతుషష్టి రితి యే*

*మయూఖాస్తేషా మప్యుపరి తవ పదాంబుజ యుగమ్ ||*



సూర్యకిరణాల ద్వారా సూర్యుడిని తెలుసుకున్నట్లు విశ్వమంతా వ్యాపించిన అమ్మవారి శక్తి యొక్క చైతన్య కిరణముల వల్ల అమ్మవారి పాదాలను తెలుసుకుని ఉపాసించాలి అంటున్నారు ఈ శ్లోకంలో.ఎక్కడ ఉన్నాయి ఈ చైతన్య కిరణాలు? మయూఖములు అంటే కిరణములు,కళలు



క్షితౌ షట్పంచాశత్ = భూమియందు 56


విసమధిక పంచశదుదకే = జలమునందు 52


హుతాశే ద్వాషష్టి = అగ్నియందు 62


చతురధిక పంచాశత్ అనిలే = వాయువునందు 54


దివి ద్విష్షట్త్రింశన్ = ఆకానమునందు 72


మనసి చ చతుషష్టిః = మనశ్చక్రంలో 64


మొత్తం 360 కళలు/కిరణాలు. ఈ 360 ఒక సంవత్సరానికి ప్రతీక.పంచభూతములు, మనసు ఈ ఆరు ఆరు బుతువులకు ప్రతీకలు.ఒకొక్క బుతువులో ఒకొక్క పంచభూత ప్రకృతి ప్రధానంగా ఉంటుంది. ఈవిధంగా అమ్మవారు ఈ విశ్వ నిర్వహణ చేస్తున్నారు.

పైన చెప్పిన కళల సంఖ్య మన శరీరంలో వరుసగా మూలాధారం నంచి ఆజ్ఞాచక్రం వరకు అన్వయించుకోవచ్చు. వీటిలో ప్రతి ఒక్క చక్రము వరుసగా పృథివ్యాపస్తేజోవాయురాకాశముల తత్త్వం కలిగి ఉంటాయి. వీటన్నిటిపైన సహస్రార పద్మం లో అమ్మవారి పాదాలు ఉన్నాయి. పైన చెప్పబడిన 360 కళలు దేశ ,కాల పరిమితులకు లోబడి ఉంటాయి కానీ అమ్మవారి పాదాలు వీటికి అతీతములు.


            🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: