6, సెప్టెంబర్ 2023, బుధవారం

లవ్ జిహాద్

 లవ్ జిహాద్ ఫలితం ఇది..!


@ పెద్దకూతురు మరణం..!

@ చిన్న కూతురుకు జైలు..!

@ తీరని ఆవేదనలో తల్లిదండ్రులు..!!! 

@ మొత్తంగా కుటుంబం చిన్నాభిన్నం..!!!

@ లవ్ జిహాద్ ముప్పు నుంచి కుటుంబాన్ని కాపాడే క్రమంలో ప్రాణాలు విడిచిన దీప్తి త్యాగం గొప్పది..

@ బాధిత కుటుంబానికి భగవంతుడు ధైర్యం ప్రసాదించాలి..

@ ప్రేమ పేరుతో కుటుంబాన్ని నాశనం చేసిన చందనకు అంతకుమించి శిక్ష పడాలి..

@ "చందన" ఉదంతంతో నైనా హిందూ కుటుంబాలు మేల్కోవాలి 

@ ఖరాకండిగా  అమ్మాయిల విషయంలో అప్రమత్తంగా ఉండాలి

@ చేతులు కాలకముందే జాగ్రత్తలు వహించాలి : VHP 


రక్తం పంచుకు పుట్టిన సొంత అక్కను అంతం చేయాల్సిన కర్కషత్వం ఎక్కడిది.. ? 

క్షణికమైన శారీరక సుఖాల కోసం కుటుంబాలను చిదిమేసే చిత్రమైన ఆలోచన ఎక్కడిది..?

డబ్బును తప్ప మనసును ప్రేమించిన వ్యక్తికి సర్వం దార పోసే దరిద్రపు ఆలోచన ఎక్కడిది..?

జీవితాంతం అష్ట కష్టాలు పడి సంపాదించిన డబ్బును ఒక్క రాత్రిలోనే దానం చేసే దుర్నీతి ఎక్కడిది..?

తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు.. కుటుంబ బాంధవ్యాలు.. రక్తసంబంధీకులు.. స్నేహితులు .. చుట్టాలు .. అన్నిటిని మించి పేగు తెంచుకు పుట్టిన తల్లిదండ్రులను గుండెల మీద తన్నే రాక్షసత్వం ఎక్కడిది..?

కులం.. గోత్రం.. చదువు..సంపాదన.. ఉద్యోగం.. కుటుంబం మంచి చెడులు చూసి, పది మందిని ఒప్పించి మెప్పించి చేసే పెళ్లిని కాదని.. అడ్రస్ లేని వాని వెంబడి వెళ్లే తెంపరి తనం ఎక్కడిది..?

అంటే... ఇలాంటి వందలాది ప్రశ్నలకు సమాధానం ఒకటే.. ! దానిపేరే  ..."లవ్ జిహాద్". 


జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన ఈ సంఘటనతో రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి.కానీ

ఇలాంటి సంఘటనలు విశ్వహిందూ పరిషత్ కు నిత్యం తారస పడుతూనే ఉంటాయి. అయితే ఒకదాన్ని తలదన్నే రీతిలో మరో సంఘటన చోటు చేసుకోవడం విశేషం. కోరుట్ల సంఘటన కూడా పోలీసులు వెల్లడించక ముందే విశ్వహిందూ పరిషత్ ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేసింది. లవ్ జిహాద్ కోణంలోనే ఆలోచించింది. అయితే ఆధారాలతో సహా పోలీసులు వెల్లడించాక  విశ్వహిందూ పరిషత్ అనుమానం నిజమైంది. ఎందుకంటే దాదాపు 20 ఏళ్ల చందన తన 22 సంవత్సరాల అక్కను ఒక్క రాత్రికి రాత్రే ఊపిరాడకుండా ముక్కుకు, మూతికి ప్లాస్టర్ వేయడం.. చున్నీతో కాళ్లు చేతులు గట్టిగా కట్టేయడం.. నిమిషాల వ్యవధిలో నిర్దాక్షిణ్యంగా చంపేయడం చూస్తుంటే దాని వెనుక అంతకుమించి క్రూరమైన కుట్ర "లవ్ జిహాద్" రూపంలో దాగి ఉంది అని విశ్వహిందూ పరిషత్ బల్లగుద్ది చెబుతోంది. అయితే ఇక్కడ చందన తన ప్రేమ కోసం అమాయకంగా అక్క దీప్తిని బలి తీసుకోవడం దారుణం. "మన కులం.. మన మతం.. కాని వాడిని పెళ్లి చేసుకోవద్దని చందన నిర్ణయాన్ని దీప్తి తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో అక్కపై పగ పెంచుకుని చివరకు ప్రాణాలు తీయడం ఘోరం.     


ఫలితంగా పెద్ద కూతురు హత్యకు గురి కావడం... చిన్న కూతురు జైలు పాలు కావడం.. కష్టం చేసిన సొమ్ము బజార్లో పడటం.. మొత్తంగా కుటుంబం చిన్నాభిన్నమై రోడ్డున పడటానికి "లవ్ జిహాద్" రూపంలో ఉమర్ షేక్ సుల్తానా మాత్రమే కారణం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఎందుకంటే ప్రేమించిన వాడు అష్ట కష్టాలు పడి భార్యను చూసుకోవాలి. కానీ అమ్మాయి డబ్బులకు ఆశపడి వారి కుటుంబ సభ్యులను అంతం చేసే ఆలోచన రావడం తోనే ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు రుజువైంది.


హిందూ అమ్మాయిలపై తీవ్రమైన వేట కొనసాగుతోంది. ప్రేమ పేరుతో విషపు వల విసురుతోంది లవ్ జిహాద్ మూఖ.

 నిత్యం ఎక్కడో ఒక చోట ముస్లిం అబ్బాయి -  హిందూ అమ్మాయి ప్రేమ వ్యవహారం వెలుగు చూస్తూనే ఉంది. అయితే ఒక్కో సంఘటన ఒక్క రీతిలో ఉండటం విస్మయానికి గురిచేస్తుంది. మొన్నకు మొన్న అలంపూర్ టెంపుల్ లో ఆలయ అధికారి లవ్ జిహాద్ ను ప్రోత్సహించడం ఒళ్ళు గగుర్పొడిచే అంశం. అంతకుముందు ఉన్నత చదువు చదివిన ఓ యువతీ కరీంనగర్ లో  పండ్లు అమ్మే వాడిని ప్రేమించి.. పెళ్లి చేసుకుంది. చివరకు వాడి వేధింపులు తట్టుకోలేక పిల్లలతో సహా మానేరు డ్యాంలో దూకి ప్రాణాలు విడిచిన సంగతి మర్చిపోనేలేదు. ఇలాంటి సంఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. వీటన్నింటిని గమనిస్తుంటే.. హిందూ అమ్మాయిలపై ఎంతటి కుట్ర జరుగుతుందో ఆలోచించాలి.

 భాగ్యనగర్ లోనైతే తల్లిదండ్రులు సంపాదించిన విలువైన నగలు, వజ్రాలు, కోట్ల రూపాయలతో పారిపోవడం కొంత మంది అమ్మాయిల వంతు అయింది. పెరుగుతున్న డిజిటల్ మీడియా ఆధారంగా.. హిందూ అమ్మాయిల బలహీనతను వాసరగా చేసుకుని దుర్మార్గులు ఘోరమైన రాక్షస క్రీడా సాగిస్తున్నారు.


ఇలాంటి విషయాలపై నిరంతరం ప్రతి సమావేశంలో విశ్వహిందూ పరిషత్, దాని యువ  విభాగాలు బజరంగ్ దళ్, దుర్గా వాహిని నాయకులు మొత్తుకుంటూనే ఉన్నారు. దుర్గా వాహిని ఆధ్వర్యంలో "నారీ సురక్ష" అనే కార్యక్రమం ద్వారా మహిళల రక్షణ కోసం విరివిగా ప్రచారం సాగిస్తున్నారు. లెక్కకు మించి అవగాహన కల్పిస్తున్నారు. అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉన్నారు. కాలేజీలు, యూనివర్సిటీలతో మొదలుకుంటే అనేక సందర్భాల్లో అవేర్నెస్ క్యాంపులో నిర్వహిస్తూనే ఉన్నారు. లవ్ జిహాద్ పర్యవసనాలు తెలియజేస్తూనే ఉన్నారు. చివరకు "ది కేరళ స్టోరీ" లాంటి సినిమాలు చూపించారు. కానీ ఏం లాభం..? పెద్ద పెద్ద కుటుంబాలు బుద్ధి తెచ్చుకోలేకపోతున్నాయి. చేతులు కాలక ముందే జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నాయి. ఫలితంగా ఎదిగి  వచ్చిన అమ్మాయిలు అటు క్రైస్తువులు, ఇటు ముస్లింల వలలో చిక్కి నాశనం అవుతున్నాయి.. కుటుంబాలు చిద్రమవుతున్నాయి. 

నివురు గప్పిన నిప్పులా.. ఇలాంటి సంఘటనలు సమాజంలో ఇంకా చాలా దాగి ఉన్నాయి. మీడియా ద్వారా బయటికి వచ్చిన విషయాలు కొన్ని మాత్రమే. పరువుకు భయపడి  లోలోపల కుమిలిపోతున్న కుటుంబాలు అనేకం.


"లవ్ జిహాద్" ఉపద్రవం నుంచి హిందూ సమాజాన్ని కాపాడేందుకు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, దుర్గావాహిని నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. హిందూ ధర్మం పై జరుగుతున్న దాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటూనే.. ప్రతి హిందూ అమ్మాయిని ధర్మం వీడకుండా జాగ్రత్త లు పడుతూనే ఉంటాయి. అమ్మాయి లవ్ జిహాద్ బారిన పడి హిందూధర్మం వీడితే ఆ కుటుంబాని కంటే ఎక్కువగా విశ్వహిందూ పరిషత్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. చిట్ట చివరి వరకు అటు పోలీసులు, ఇటు న్యాయస్థానాలను ఆశ్రయించి యువతుల రక్షణ కోసం పనిచేస్తుంది VHP.


ఇప్పటికైనా హిందూ సమాజం మేల్కోవాల్సిందే. తమ ఇళ్లలోని ఆడపిల్లల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించేలా చూసుకోవాల్సిందే..!


ఏది ఏమైనా లవ్ జిహాద్ నుంచి తన కుటుంబాన్ని, తన చెల్లిని, కాపాడుకునేందుకు దీప్తి చివరి వరకు పోరాడింది. తన చెల్లిని, తన తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను..  తమ కుటుంబ గౌరవ మర్యాదలను రక్షించేందుకు చిట్టచివరి శ్వాస వరకు పోరాటం చేసిన దీప్తి చాలా గొప్పది. కానీ చందన పై ప్రేమపేరుతో ఆ కుటుంబాన్ని చిద్రం చేసేందుకు వచ్చిన ఆ ముష్కరుడు అమ్మాయి ప్రాణం తీయడం దౌర్భాగ్యం. దీప్తి ఆత్మకు శాంతి చేకూరాలని విశ్వహిందూ పరిషత్ ప్రగాఢంగా కోరుతోంది. కూతురును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న  ఆ తల్లిదండ్రులకు  భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటుంది. "లవ్ జిహాద్" బారినపడి .. సొంత అక్కను చంపి, కుటుంబాన్ని రోడ్డుపాలు చేసిన చందన అంతకుమించి శిక్ష అనుభవించాలి.


"చందన" ఉదంతంతోనైనా హిందూ కుటుంబాలు మేలుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు .. ప్రతి అన్న.. ప్రతి తమ్ముడు తన ఇంట్లోనే ఆడపడుచుల విషయంలో జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రతి కదలికలను కనిపెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్వహిందూ పరిషత్ సూచిస్తుంది. లేదంటే దానికి ఆ కుటుంబమే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే విషయం సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. 


తల్లిదండ్రులు సంపూర్ణమైన వ్యాపారం.. పెద్ద కూతురు దీప్తి సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. చిన్న కూతురు చందన బీటెక్ పూర్తి.. కొడుకు బెంగళూరులో ఉన్నత చదువు.. ఇలా గుట్టుగా గౌరవంగా బతుకుతున్న కుటుంబం నేడు ఉమర్ షేక్ సుల్తానా కారణంగా తలకిందులైంది. రోడ్డున పడింది. జీవితంలో కోలుకోలేని దెబ్బ తింది. ఇలాంటి బాధ మరి ఎవరికి రాకుండా ఉండాలంటే.. ప్రతి హిందూ కుటుంబం తన ఆడపిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మనకే మంచిదని  హిందూ సమాజానికి చేతులు జోడించి విన్నవిస్తోంది విశ్వహిందూ పరిషత్.

కామెంట్‌లు లేవు: