*2038*
*కం*
నిద్దుర రానప్పుడెపుడు
నిద్దురకై యత్నమొనర నిస్పృహ కలుగున్.
ఒద్దికతో వేరొకపని
నుద్దియచేయుటయె మేల గుర్విన సుజనా.
*భావం*:-- ఓ సుజనా! నిద్ర రానప్పుడు నిద్ర కోసం ప్రయత్నాలు చేస్తే నిరాశ/విసుగు/చికాకు కలుగుతుంది. జాగ్రత్తగా వేరొక ఉపయుక్తమైన పనిచేయడానికి ప్రయత్నం చేయటం(ఆ పని చేసిన సంతృప్తి చేత నిద్ర రావచ్చు.) మంచిది.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి