శా.
మాయా పద్ధతి చేతఁగాదు, పర సంపత్కైతవప్రక్రియో/
పాయ వ్యాప్తికి బుద్ధిబోదు, కృపణత్వం బొప్ప దుర్మార్గులం/
దే యాచ్ఞామతి స్తోత్ర పాఠము లొకింతేఁ జేయఁగాఁ జాలఁ దం/
డ్రీ! యీ జీవితనౌక పట్టగల దొడ్డేరీతి? విశ్వేశ్వరా!
విశ్వనాధ స్వభావోచితమైనపద్యం!
మాయచేయటం నాకుచేతకాదయ్యా!ఇతరులసందలనుకొల్లగొట్టే ఉపాయమూతెలియదు.ధనం కోసం దేహీయని దుర్మార్గులనాశ్రయించిస్తోత్ర పాఠములు చేయనూలేను.
మరి యీజీవిత నౌకను ఒడ్డుకు చేర్చేదెట్లయ్యా!
విశ్వేశ్వరా!ఏమో యికనీదేభారమయ్యా!!
-విశ్వనాధశతకం

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి