14, జూన్ 2025, శనివారం

భవబంధాలు

 ఈ భవబంధాలు, జనన మరణాల నుండి విముక్తులము కావలెనంటే వైరాగ్యము చాలా అవసరము. 

త్యాగము వలననే వైరాగ్యము అలవడుతుంది. 

వైరాగ్యము అంటే కుటుంబాన్ని వదిలేసి హిమాలయాలకు పరుగెత్తడం కాదు! తన ప్రాపంచిక మౌలిక బాధ్యతలను విస్మరించడం కాదు! ఏకాంతవాసం చెయ్యడం కాదు! కాషాయవస్త్రాలు ధరించడం కాదు! దండకమండలాలను పట్టుకుని తిరగడం కాదు! శిరోముండనం చేయించుకోవడం కాదు! మరి “వైరాగ్యం” అంటే ఏమిటి?! ప్రాపంచిక వస్తు విషయాలపై, అసక్తిని, కోరికలను విసర్జించాలి. 


కక్కేసిన ఆహారంపై వచ్చినంత విరక్తి ప్రపంచిక విషయ సుఖాలపై రావాలి.

కర్మలను భగవంతుని ఆజ్ఞగా భావించి ఫలితం ఆశించకుండా చేయాలి, మనసులో భగవంతుని చింతన నిరంతరం చేస్తుండాలి. 

మన కంటిని తెరవడం ద్వారా సుమారు 80% ప్రాణశక్తి బయటకు పోతుంది.

 కనుక దీనిని కాపాడుకోవడానికి ధ్యానము చేస్తుండాలి. 

మానవ జన్మ మళ్లీ మళ్లీ వచ్చేటటువంటిది కాదు కనుక సమయం ఉన్నంతలోనే భగవంతుని చేరుకోవడానికి సాధన చేస్తుండాలి.


                   *~బాబా~*

కామెంట్‌లు లేవు: