ఉత్సాహ సంపన్న మదీర్ఘ సూత్రం
క్రియా విధిజ్ఞం వ్యసనే ష్వసక్తమ్।
శూరం కృతజ్ఞం దృఢ సౌహృదం చ
లక్ష్మీ స్స్వయం యాతి నివాస హేతోః।।
ఉత్సాహ-ఉత్సాహంతో,
సంపన్నం-కూడిన వాడును,
అదీర్ఘ సూత్రం-త్వర త్వరగా,
క్రియా-పనులు చేసే,
విధిజ్ఞం-పద్ధతి తెలిసిన వాడును,
వ్యసనేషు-దురభ్యాసాలందు,
అసక్తం-సంబంధం లేని వాడును,
శూరం-పరాక్రమవంతుడును,
కృతజ్ఞం-కృతజ్ఞుడైన వాడును,
చ-మరియును,
దృఢ-బలమైన,
సౌహృదం-మంచి హృదయం గల వాడును నైన వానిని,
నివాస-తా నుండడానికి,
హేతోః-కారణంగా,
లక్ష్మీః-లక్ష్మీదేవి,
స్వయం-స్వయంగానే,
యాతి-వెళ్తుంది।।
ఈలోకంలో మిక్కిలి చురుకైన వాడును,త్వర త్వరగా పనులు పూర్తి చేసే వాడును,దురభ్యాసాలు లేని వాడును,కార్య నిర్వాహణలో సమర్థుడును, పరాక్రమవంతుడును, కృతజ్ఞుడును,దృఢ సౌహృదం గలవాడును నైన వారి ఇంటికి శ్రీ లక్ష్మీ దేవి స్థిర నివాసం ఉండడానికి స్వయంగానే వస్తుంది।।
14-6-25/శనివారం/రెంటాల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి