ఉత్సవే వ్యసనే చైవ
దుర్భిక్షే రాష్ట్ర విప్లవే।
రాజ ద్వారే శ్మశానే చ
య స్తిష్ఠతి స బాంధవః।।
ఉత్సవే-సంబరంలోనూ
వ్యసనే-కష్టంలోనూ,
చ ఏవ-ఇంకా,
దుర్భిక్షే-కరవు కాలాన,
రాష్ట్ర-దేశంయొక్క,
విప్లవే-తిరుగుబాటునందు,
రాజ ద్వారే-రాజ సముఖమున,
చ-మరియును,
శ్మశానే-శ్మశానంలోను,
యః-ఎవ్వడైతే,
తిష్ఠతి-(కలిసి) ఉంటాడో,
సః-వాడే,
బాంధవః-బంధువు।।
ఈలోకంలో సంబరంలోనూ,కష్ట సమయంలోనూ, కరువు కాలంలోనూ, దేశం అల్లకల్లోలం ఐనప్పుడూ,రాజ సముఖంలోనూ, ఇంకా శ్మశానంలోనూ తోడుగా ఉండిన వాడే అసలైన బంధువు।।
13-6-25/శుక్రవారం/ రెంటాల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి