2, జూన్ 2023, శుక్రవారం

గీతాసారం

 పురుషులు అయినా స్త్రీలు అయినా తమ పుట్టుకకు సార్థకత చేకూర్చుకోవాలి. చిన్నతనంలోనే వైధవ్యం అయితే ఏమి ఆమె చరిత్రలో సాధించినవి అత్యధికంగా ఉన్నవి. ఆమె చదువుకోలేదు..ఆమెకు ఉన్న జ్ఞానం అపారం.ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకున్న సమర్థురాలు.


పండితులను రప్పించి వారికి విశేష దక్షిణలు ఇచ్చి శాస్త్రాలు, పురాణేతిహాసగాథలు చెప్పించుకుని వినేది.

ఓ మారు అహల్యా బాయి తమ రాజ పురోహితుని పిలిచి 'భగవద్గీత' చదివి అర్థం చెప్పమని కోరిందట.


ఆ రాజ పురోహితుడు మొదటి శ్లోకం "ధర్మ క్షేత్రే కురు క్షేత్రే సమ వేతా యుయుత్సవః" అని రెండో పాదం చదవ బోతుంటే ఆవిడ స్వామీ నాకు గీతా సారమంతా అర్థమై పోయింది. అని అన్నారట. ఆయన ఆశ్చర్య పోయి నేనింకా చదవనే లేదు కదమ్మ మీకెలా అర్థ మయిందని అడిగాడట. 


అందుకు అహల్యా బాయి చిరునవ్వు  నవ్వి 'క్షేత్రే క్షేత్రే ధర్మం కురు' అనే కదా దాని అర్థం నీవు ఏ క్షేత్రం లో ఉన్నావో ఆ క్షేత్ర ధర్మాన్ని పాటించు అనే కదా కృష్ణ

పరమాత్మ చెప్తున్నది. 


నీవు రాజుగా వుంటే రాజధర్మం,తండ్రిగా వుంటే పితృ ధర్మం, కొడుకుగా వుంటే పుత్ర ధర్మం అలాగ ఎవరి ధర్మం వారు పాటించాలని చెప్పారు. అదే కదా గీతాసారం.


ఇపుడు నేను మహా రాణిని రాజధర్మం పాటించాలని, శత్రు నిర్మూలన చేసి మన ధర్మాన్ని నిలబడితే గానీ మన ధర్మం నిలబడదు. ధర్మోద్దరణ చేస్తేనే లోకమంతా సుఖమయంగా వుంటుంది అని అన్నారట. 


పండితులయిన రాజపురోహితులవారు  ఆమె అమేయ జ్ఞానానికి అబ్బుర పడ్డాడట.

కామెంట్‌లు లేవు: