*ఈ రాక్షస సంహారం అంతం ఎప్పుడు..?*
ఎర్రకోట సాక్షిగా చిమ్మింది రక్తం
త్రివర్ణముపై చీకటి నీడలా కమ్ముకుంది
ఏ మాశించింది ఈ ఘోర నిప్పురవ్వలతో
భీతావహ దృశాలతో మనసు మండుతుంటే..
స్వార్థపు పొరల్లో ఇంకిపోయి
మతమైకములో విచ్చలవిడిగా తిరుగుతూ
అంధత్వం ఆవహించినట్లు నటిస్తూ
నడిరోడ్డుపై అక్రమ వలల్లో బంధిస్తున్నారు..
సరిహద్దు రేఖలను తుంచుకుంటూ
చీకటి లోకములో రంగులను పులుముకుంటూ
అర్థము లేని ప్రశ్నలతో సతాయిస్తూ
కూర్చున్న కొమ్మలను నిలువునా నరుకుతున్నారు..
ఎంత విజ్ఞానం వికసిస్తే నేమి
మూఢత్వానికి మూర్ఖత్వాన్ని జోడిస్తూ
నరమేధాన్ని నడివీదుల్లో ప్రదర్శిస్తూ
సామాన్యులను బలిగోరే మూర్ఖపు చర్యలు..
ఏం ఆశిస్తుంది ఈ అజ్ఞానము ప్రపంచం
తోటి మనిషిని చంపి పిశాచిలా విహరిస్తూ
ఉనికి కోసం రక్తపుటేరులను పారించుట
మతోన్మాదమ మత్తులో తూగుట న్యాయమా..
ఏ పవిత్ర గంధం బోధించింది
మనిషిని మనిషిని చంపుకొనే సిద్ధాంతాన్ని
ఏ భగవంతుడు ప్రబోధించాడు
రక్తపు మడుగులలో స్నానాన్ని ఆచరించమని..
విజ్ఞాన ఫలం విశ్వంలో సూర్యోదయం చేస్తుంటే
ఇంకా అజ్ఞానపు చీకట్లో ముష్కర యుద్ధాలు
ఉగ్రవాదుల ఉగ్రరూపం లో మారణ హోమాలు
ఇంకెప్పుడు అంతం ఈ రాక్షస సంహారం..
కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి