ప్రతిరోజూ…
శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…
74d2;1311e2; నడిచే దేవుడు…
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀🌼P0398.పరమాచార్య పావన గాధలు…
*కోపము – శిక్ష*
➖➖➖✍️
```
అది ఎన్నికల సమయం. కాంచీపురం జిల్లా కలెక్టరు గారే స్వయంగా చీఫ్ ఎలెక్షెన్ ఆఫీసరుగా బాధ్యతలు నిర్వహిస్తున్నందున కార్యాలయంలో మొత్తం అందరూ ఎన్నికల నిర్వహణలో తలమునకలయ్యారు. ఎల్లుండే ఎన్నికలు జరిగే రోజు.
ఢిల్లీ నుండి ఇద్దరు ముగ్గురు ఐ.ఎ.యస్ అధికారులు జరగబోయే విధానసభ లోకసభ ఎన్నికల పర్యవేక్షణకై కంచికి వచ్చారు. అందులో ఒకరు చాలా నిఖార్సైన వ్యక్తిత్వం కలవారు మరియు చాలా కోపిష్టి కూడా. వారు వేరే రాష్ట్రంవారు కావడం వల్ల వారికి తమిళం రాదు.
నేను తహసీల్దార్ కావడం చేత వారి బస మరియు బాగోగులు చూడటం నా కర్తవ్యం. వారిని కలిసిన కొద్దిసేపటికే వారి గుణగణాలను అంచనా వెయ్యగలిగాను. ఆయన భార్యా పిల్లలతో సహా రావడం చేత వారికి ప్రభుత్వ ట్రావెలర్స్ బంగ్లాలో సకల సౌకర్యాలతో విడిది ఏర్పాటు చేసాము. వారి మనసు పాడుకాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవల్సిందని నాకు పై అధికారుల నుండి వచ్చిన ఆదేశం యొక్క సారం.
వారికి కొన్ని తమిళ పదాలు తెలుసని కూడా నాకు తెలిసింది.
వారు కుటుంబ సమేతంగా పరమాచార్య స్వామివారిని చూడాలని నాకు చెప్పారు.
నేను వారిని కంచి శ్రీమఠానికి తీసుకుని వెళ్ళాను. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి స్వామివారు జపం చేసుకుంటున్నారు. శ్రీమఠం సేవకులొకరు అక్కడ నేలపైన ఒక జమఖానం పరిచి ఉంచారు. ఆ అధికారి కుటుంబ సమేతంగా దానిపైన కూర్చున్నారు. నేను వారి పక్కనే నిలబడి ఉన్నాను.
స్వామివారు దర్శనం ఇవ్వడం మొదలుపెట్టగానే నేను వారినందరిని స్వామి వద్దకు తీసుకుని వెళ్ళాను.
మహాస్వామివారు ఒక చిన్న గదిలో చెక్క కుర్చీపై కూర్చుని ఉన్నారు. గది తలుపు ఇవతలి నుండి మేము స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఆరోజు స్వామివారు మౌనవ్రతంలో ఉన్నారు. చేతిసైగలతోనే కొన్ని ప్రశ్నలను అడిగి ఆ ఆఫీసరు కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి పంపించారు.
సరిగ్గా అదే సమయంలో కోపిష్టి యువకుడైన ఒక మఠం ఉద్యోగి అరవడం మొదలుపెట్టాడు. “వాడు ఎవడైతే ఏంటి! వాడేమైనా పెద్ద పోటుగాడా! రాస్కెల్ నా జమఖాణం మీద కూర్చోవడానికి వాడికి ఎంత ధైర్యం? మఠం పవిత్రత అంతా పోయింది. ఇప్పుడే రాష్ట్రపతికి టెలిగ్రాం చేస్తాను”
అతను అలా అరవడం మాకు అవరోధంగా మారింది. నాకు చాలా బాధకలిగింది. పరమాచార్య స్వామివారి సమక్షంలో ఒక వ్యక్తి ఇలా అరవడం మఠాన్ని,స్వామివారిని అవమానించినట్టే కదా? అతను ఇలా అరవడానికి కారణం తను జమఖాణం పైన కూర్చోవడమే అని ఆఫీసరుకు తెలిస్తేదాని పర్యవసానం మా పనిమీద కూడా పడుతుంది కదా!
ఒక పదిహేను నిముషాలు అలా అరిచి అతను వెళ్ళిపోయాడు. నేను స్వామివారిని మనస్సు లోనే ప్రార్థిస్తున్నాను “స్వామీ ఆ యువకుడు అరుస్తున్నది తను జమఖాణం పైన కూర్చున్నందువల్లే అని ఆ ఆఫీసరుకు తెలియకుండా చూడు” అని.
దర్శనం ముగించుకుని మేము మఠం నుండి బయటకు రాగానే ఆఫీసరు అడగనే అడిగాడు. “ఎవరతను? ఎందుకు అలా అరుస్తున్నాడు? అది కూడా మహాత్ములైన స్వామివారి ముందు”
నేను తెలివిగా చిన్న అబద్ధం చెప్పి తప్పించుకున్నాను. “ఈరోజు పౌర్ణమి కదా. ఆ యువకుడికి కొంచం చిత్తభ్రమ ఉంది. కాబట్టి అతను అలా ఎవరో ఒకరిపై అరుస్తూ ఉంటాడు” అని.
“ఓహ్ అలాగా! నువ్వు ఈ విషయం ముందే చెప్పిఉంటే అతనికోసం కూడా మనం స్వామివారిని ప్రార్థించేవారం కదా” అని తన ఔదార్యాన్ని చాటుకున్నాడు ఆఫీసరు.
క్రమశిక్షణకి కట్టుబాట్లకి మారుపేరైన మహాస్వామివారు ఈ అరుపులు విన్నారు. ఆరోజు దర్శనానికి వచ్చిన వారందరూ వెళ్ళిపోగానే ఆ యువకుడిని పిలిచి మందలించడమే కాకుండా మూడురోజులపాటు మఠంలోనికి రాకూడదని చెప్పారు.
వేరొక సేవకుని ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. తప్పుచేసినవాడు ఎంతటి మేధావి, భక్తుడు అయినా అనాగరికులుగా కోపంతో ప్రవర్తిస్తే వాళ్ళకి శిక్ష తప్పదు.✍️
- టి.యస్.కోదండరామశర్మ, మహాపెరియవళ్–దరిశన అనుభవంగళ్
జయజయ శఙ్కర హరహర శఙ్కర```
*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*
```
#KanchiParamacharyaVaibhavam # “కంచిపరమాచార్యవైభవం”🙏
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి