15, సెప్టెంబర్ 2020, మంగళవారం

దీపారాధన

ఒక సారి వెలిగించిన వత్తిని మళ్లీ వెలిగించవచ్చా?
         నేడు వెలిగించిన వత్తిని తీసివేసి రేపటి రోజున కొత్త వత్తి తో దీపారాధన చేయాలి. ఒకరోజు న వెలిగించిన మూడు వత్తులలో ఒక వత్తి శాంతించి మిగిలిన వత్తులు వెలుగుతున్నప్పుడు వాటి సాయంతో కొండెక్కిన వత్తిని వెలిగించవచ్చును. అన్ని వత్తులు ఒకేసారి శాంతించినప్పుడు కూడా అప్పటికప్పుడే అయితే మరోసారి వెలిగించుకోవచ్చును. ఒకసారి చేసిన దీపారాధన లో వత్తులు ఆనాటికి మాత్రమే పరిమితం అని గుర్తించాలి.
 కార్తీక మాసం లో దేవుని దగ్గర దీపం ఎంతసేపు వెలగాలి?
దీపం వెలగవలసిన సమయం తక్కువ కాకుండా చూసుకోవడం అవసరం. దీపం కనీసం గోదోహన కాలం పాటు వెలగాలి అన్నారు. అంటే ఆవు పాలు పితికేందుకు పట్టేంత కాలమైన దీపం వెలగాలని అర్థం. సామాన్య భాషలో అరగంట దాకా వెలిగేంత చమురు పోసి దీపారాధన చేయాలి. అలాగే పూజ పూర్తి అయ్యాక మనంతట మనమే దీపం ఆర్పకూడదు. దానంతట అది ఆరిపోయేవరకు అలా ఉంచాలి. పూజ మధ్యలో దీపం ఆరిపోకుండా చూసుకోవాలి. దీపం ఆరింది అనడం కూడా అపశకునం గా భావిస్తారు. దీపం కొండెక్కింది లేదా ఘనమయ్యింది అంటూ ఉంటారు.

కామెంట్‌లు లేవు: