25, అక్టోబర్ 2020, ఆదివారం

శక్తి యెుక్క చైతన్య గమనం

 గణిత శాస్త్ర ప్రకారం శక్తి యెుక్క చైతన్య గమనం కోణ పరంగా జరిగినది. అది అధో కోణ మని, దానికి అధిపతి గం అనే బీజాక్షరములు కలిగిన గణపతి యని, గం అనే అక్షర రూపం శక్తి గణపతి యని తెలియుచున్నది. యిక యీ అధోకోణ ప్రకృతి 🌿🍃సత్వరజస్తమెూగుణాత్మకమైన క్షేత్రం.  దాని శక్తి ప్రకృతి పరంగా మార్పు చెందుటయే సృష్టియని, దానికి ఊర్ధ్వకోణ పురుష ప్రకృతి కలిసిన షట్కోణాకృతి కలిగిన సమస్తమును సృష్టియని తెలియుచున్నది. ( .) ౦ పూర్ణమై 360 డిగ్రీలు 360 రోజులలో పూర్ణమై నిండియున్నది. దీనికి పౌర్ణమి మూలమైనమూలమైనశక్తి గమనమే కారణం. అచ్చటనుండి చతుర్స్రమై అనగా నాలుగు దిక్కులలో గల ప్రకృతిగా విశ్వవ్యాప్తమైనదిగా మారినది. ప్రకృతి శక్తుని గమనించిన భూమి పైననే తప్ప దాని లక్షణము  మిగిలిన ఏగ్రహములలో యిటువంటి లక్షణము కలుగుటకు వీలుపడదు. మనిషి పుట్టుట యే మార్పును తెలియునని. లేనియెడల ప్రకృతి తత్వం తెలియదు. అందుకే దానిని నాశనం చేయు అధికారం ఎవరికీ లేదు. వకవేళ అటువంటి ప్రవృత్తి వున్నవారెవరైనా వారు నశించవలసినదే. అందుకే అవతార రూపమైన మానవ పరిణామ క్రమం. మనం స్వంతంగా ఏ ప్రకృతినీ సృష్టించ లేదు. మనం కారణం మాత్రమే. వకవేళ సృష్టించేము అంటే అది అహంకారం తప్ప వేరు కాదు. అందుకు మనం కృతఙ్ఞతలు చూపాలి. దీనినే శరణాగతి యని మనకు తెలియుచున్నది. దానిని లోపరచుకొన ప్రయత్నం రాక్షసత్వం. దానిని పరిమితంగా ఆశ్వాదించుట జీవ లక్షణము రూపంలో నున్న దైవత్వం. దీనికి సృష్టి ఆదినుండి సంఘర్షణ జరుగుతూనే యున్నది. యిది యే మాయయని అది తెలియుటయే ఙ్ఞానమని తెలియుచన్నది.

కామెంట్‌లు లేవు: