25, అక్టోబర్ 2020, ఆదివారం

ధార్మికగీత - 60*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                         *ధార్మికగీత - 60*

                                   *****

      *శ్లో:- యస్యాస్తి విత్తం స నరః కులీనః ౹*

             *స పండితః ౹ స శ్శ్రుతవాన్ ౹ గుణజ్ఞ: ౹*

             *స ఏవ వక్తా ౹ స చ దర్శనీయః౹*

             *సర్వే గుణాః కాంచన మాశ్రయన్తి ౹౹*

                                   *****

*భా:- "ధనమూల మిదం జగత్" అని లోక  ప్రసిద్ధి. అలాంటి డబ్బు ఎవరి వద్ద ఉంటుందో, ఎన్ని బలహీనతలున్నా సరే  అతడే ఉత్తమ వంశ సంజాతునిగా జనులచే కీర్తింప బడతాడు. అతడే సర్వజ్ఞుడైన పండితునిగా పూజింప బడతాడు. అతని వాక్కు వేదవాక్కుగా,ప్రామాణికంగా పరిగణింప బడుతుంది. అతడే పరిణతి చెందిన సకల శాస్త్ర పారంగతునిగా చెలామణి అవుతాడు. అతడే సర్వ   సద్గుణ సంపన్నునిగా, సుగుణ గణఖనిగా కొనియాడ బడతాడు. అతడే  ప్రవచన శిఖామణిగా, ఉపన్యాస కేసరిగా నీరాజనాలు అందు కుంటాడు. అతడే "సత్పురుషుని"గా ముద్రాంకితుడై,  ఆతని దర్శన, స్పర్శన, భాషణాదులకై జనాలు తహతహ లాడుతుంటారు.  డబ్బు చేత సాధ్యం కాని పని లోకంలో లేదని రూఢి అవుతున్నది. ఇలా అన్ని "సుగుణాలు" డబ్బుగలవాడి వద్దకే చేరుకుంటున్నాయి. కాని ఆ డబ్బు "క్షణికమ"ని విజ్ఞులు, "శాశ్వతమ"ని అజ్ఞులు గాఢంగా నమ్ముతారు. "సిరి"కి దాసులం కాకూడదని, "హరి"కి మాత్రమే దాసులమవ్వాలని సారాంశము. "హరి" అనే రెండక్షరాలు  మన పాపాలు హరించడానికి, ముక్తిని ప్రసాదించడానికి సమర్థములని గమనించాలని సారాంశము*


                                    *****

                     *సమర్పణ  :  పీసపాటి*  

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: