25, అక్టోబర్ 2020, ఆదివారం

ఉత్తమ స్తవా దుచ్చ మందతః*

 *ఉత్తమ స్తవా దుచ్చ మందతః*

*చిత్తజం జప ధ్యాన ముత్తమం*


భావము :-భగవంతుని స్తోత్రములతో  బిగ్గరగా శబ్దము చేస్తూ శృతించుట కంటే మౌనముగా నిలిచి జపము చేయుట మంచిది. ఆ జపము కంటే ధ్యానము శ్రేష్టమైనది  అంటారు. ఈ విధంగా ఒక దాని కంటే  ఒకటి  శ్రేష్ఠమైనవని చెప్పారు మహర్షి. ఇక్కడ చెప్పే మౌనము వాక్ మౌనము.

మౌన ధ్యానమంటే తను సంకల్పించిన దైవము యొక్క రూపమును మాత్రము మనస్సు నందు నిలుపుట. 

మనము పూజ చేయునప్పుడు చేతితో పూజ చేయుచున్ననూ,  మనస్సు వేరే ఆలోచనలతో ఇతర రూపములను పొందుచుండును. కనుక త్రికరణ శుద్ధి లేక,  దేహము ఒక పని, మనస్సు వేరొక పని, వాక్కు వేరొక పని చేయుచుండును. మనస్సు నందు దైవమును నిలుపునపుడు వేరే ఆలోచనలు రావు. కనుక ఈ మానస ధ్యానము శ్రేష్టము

కామెంట్‌లు లేవు: