25, అక్టోబర్ 2020, ఆదివారం

*శ్రీ సూర్య నారాయణ దండకం.*

 *శ్రీ సూర్య నారాయణ దండకం.*


శ్రీసూర్య నారాయణా వేదపారయణా లోకరక్షామణి దైవచూడమణీ 2సార్లు
ఆత్మరక్షా నమః: పాపశిక్షా నమోవిశ్వకర్తా నమో విశ్వభర్తా
నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథాధినాథా
మహాభూతభేదంబులున్ నీవయై బ్రోచు మెల్లపుడున్ భాస్కరాహస్కరా!!

పద్మినీ వల్లభ వల్లకీ గానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్షనేత్రా
మహాదివ్యగాత్రా అచింత్యావతారా నిరాకార ధీరా పరాకయ్యయోయయ్య
దుర్థాంత నిర్థూత తాపత్రయా భీలదావాగ్ని రుద్రా తనూద్భూత నిస్సార
గంభీర సంభావితానేక కామాద్య నీకంబులన్ దాకి
ఏకాకినై చిక్కి ఏదిక్కులుం గానగాలేక యున్నాడ నీవాడనో తండ్రి!!

జేగీయమానా కటాక్షంబులన్ నన్ కృపాదృష్టి వీక్షించి రక్షించు
వేగన్ మునీంద్రాది వంద్యా జగన్నేత్రమూర్తీ ప్రచండస్వరూపుండవై యుండి చండాంశు
సారథ్యమన్ గొంటి నాకుంటి నశ్వంబులేడింటి చక్రంబులున్ దాల్చి ద్రోలంగ
మార్తాండరూపుండవై చెండవా రాక్షసాధీశులన్ గాంచి
కర్మానుసారాగ్ర దోషంబులన్ దృంచి కీర్తి ప్రతాపంబులన్ మించి
నీదాసులన్ గాంచి యిష్టార్ధముల్ కూర్తువో!!

*ఓం ఆదిత్యాయ నమః*

*శుభ సూర్యోదయం*

🙏🙏🌞🙏🙏🌞🙏🙏🌞🙏🙏 

కామెంట్‌లు లేవు: