3, నవంబర్ 2020, మంగళవారం

అద్వైత వేదాంత పరిచయం

 **దశిక రాము**


**అద్వైత వేదాంత పరిచయం**


05. కర్మయోగం


  మనిషికి నాలుగు పురుషార్థాలు లక్ష్యాలుగా ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ అనే మూడు పురుషార్థాలు ఐహిక లక్ష్యాలను సాధిస్తే, మోక్ష పురుషార్థం ఆధ్యాత్మిక లక్ష్యసాధన చేస్తుంది. మోక్షసాధన చేయని మానవ జన్మ వృధా. ప్రాపంచిక లక్ష్యాలని సాధించినా అంతిమ లక్ష్యం మోక్షమే అవాలి.

  ఈ మోక్షాన్ని దృష్టిలో పెట్టుకుని శాస్త్రం ఒక మార్గాన్ని సూచించింది.

1. మార్గం - సాధన       2. లక్ష్యం - సాధ్యం

3. చేసేవాడు - సాధకుడు  4. లక్ష్యం సాధిస్తే ` సిద్ధ:    

  సాధకుడు అనే మనం సాధ్యం అనే లక్ష ్యం పొందాలంటే ఒక సాధన అనే మార్గంలో వెళ్ళాలి. అప్పుడు సాధ్యం పొంది సిద్ధ: అవుతాము. అంటే సాధక స్థాయినుంచి సిద్ధ: స్థాయికి చేరుకోవటమే జీవన ప్రయాణం.

  సిద్ధ: అంటే కొన్ని సిద్ధులు పొందటం కాదు, సిద్ధ: అంటే తనని తాను తెలుసుకున్నవాడు.ఈ మార్గాలు మూడు ఉన్నాయి. ప్రతి మార్గాన్నీ యోగం అంటారు. యోగం అంటే సాధకుడిని సాధ్యంతో కలిపేది ` ప్రయత్నం చేసే వ్యక్తి  కోరే గమ్యం. యోగం యుజ్‌ అనే ధాతువు నుంచివచ్చింది. యుజ్‌ అంటే కలపటం. ఇక్కడ సాధక, సాధ్యాలని కలపటం.

  యుజ్యతే సాధ్యేన సహ సాధక: యేన సహ సాధన `

మూడు యోగాలు యివి :`

       1.కర్మయోగం   2.ఉపాసనయోగం     3.జ్ఞానయోగం

  మొత్తం మార్గాన్ని మూడు మెట్లున్న మేడమెట్లుగా భావించవచ్చు. ఇవి ఒకదాని బదులు ఒకటి కాదు. మూడూ ముఖ్యమే. మూడూ అవసరమే అందరికీ. మొదటి అంతస్తులోకి క్షేమంగాచేరాలంటే ఒక్కొక్క మెట్టూ ఎలా ఎక్కాలో, ఇవి కూడా అలాగే ఎక్కాలి, మోక్షమనే అంతిమ లక్ష్యం పొందటానికి. అందుకని మూడు యోగాలూ ముఖ్యమే.

5.1 కర్మయోగం :`

  కర్మయోగం అంటే ఏమిటి? కర్మయోగంలో రెండు పదాలున్నాయి. కర్మ, యోగం. ఇక్కడకర్మ అంటే సరిjైున పనిచేయటం. యోగం అంటే సరిjైున దృక్పథం. సంస్క ృతంలో భావన అంటారు. తేలిగ్గా చెప్పాలంటే, కర్మయోగం అంటే సరిjైున పనిని, సరిjైున దృక్పథంతో చేయటం. 

  సరిjైున పని అంటే ఏమిటి? మనిషి చేసే పనులని మూడు రకాలుగా శాస్త్రం వర్ణించింది. అవి 

1. ఉత్తమ కర్మ:  అత్యుత్తమ సానుకూల ఆధ్యాత్మిక ప్రభావం చూపేది.

2. మధ్యమ కర్మ: మధ్యరకం కర్మ. ఇందులో ఆధ్యాత్మిక ప్రభావం చాలా తక్కువ            ఉంటుంది. లేదా అసలు ఉండకపోవచ్చు కూడా. చాలా ప్రాపంచిక   లాభాలు ఉంటాయి.

3. అధమ కర్మ : వీటికి ప్రతికూల ఆధ్యాత్మిక ప్రభావం ఉంటుంది. అంటే ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదు, లేదా తగ్గుతుంది. వాటిని వివరంగా చూద్దాము.

5.1.1  ఉత్తమ కర్మాణి :` దీన్నే సాత్త్విక కర్మాణి అని కూడా అంటారు. భగవద్గీత 17,18 అధ్యాయాల్లో శ్రీకృష్ణ భగవానుడు ఈ అంశాలన్ని వివరంగా చర్చిస్తాడు. ఉత్తమ కర్మాణి లేదా సాత్త్విక కర్మాణిని పర ఉపకార కర్మాణి అని కూడా అంటారు. ఎదుటివారి బాగుకోసం చేసే మంచి కర్మలు.

  శ్రూయతం ధర్మ సర్వస్వం

  శ్రుత్వా చైవ అవధారయాం

  పరోపకార పుణ్యాయ

  పాపాయ పరపీడనం

  పుణ్యకర్మలన్నీ పర ఉపకార కర్మలే. ఎదుటివారికి తోడ్పడేవే.

  పరోపకారాయ వహంతి నద్య:

  పరోపకారాయ  దుహంతి గావ:

  పరోపకారాయ  ఫలంతి వృక్ష:

  పరోపకారార్థం ఇదం శరీరం.


ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఉత్తమ కర్మల్లో మనం ఇచ్చేది ఎక్కువ, తీసుకునేది తక్కువ ఉంటుంది.ఇస్తూ ఉంటే, ఎదుగుతూ ఉంటాం. అందుకే మన సాంప్రదాయం దానం, త్యాగం పదాలని నేర్పించింది.

  పర ఉపకార కర్మలని నిష్కామ కర్మాణి అని కూడా అంటారు. అంటే ఉత్తమ కర్మాణి, సాత్త్విక కర్మాణి, పర ఉపకార కర్మాణి, నిష్కామ కర్మాణి ` ఏదన్నా ఒకటే. ఇది ఆధ్యాత్మిక ఎదుగుదలకి అధికంగా తోడ్పడుతుంది.

  పర ఉపకార కర్మలు ఏవి? శాస్త్రం వాటిని పంచమహా యజ్ఞ: అంది.

🙏🙏🙏

సేకరణ

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: