3, నవంబర్ 2020, మంగళవారం

సాలిగ్రామ తీర్థం


: "సాలిగ్రామ తీర్థం" (విష్ణు తీర్థం). తీర్థము ఎలా పుచ్చుకోవాలి? తీర్థం అంటే ఏమిటి? మిగిలిన తీర్థం ఏమి చేయాలి? ఈనాటికీ చాలామందికి తెలియని సమస్య, పక్క వాళ్ళు ఏం చేస్తారో చూసి గొర్రెదాటు పద్ధతి మనది. కదూ! అవుననే చెప్పాలి. ప్రమాణాలతో ఆధ్యాత్మిక దృష్టికోణంతో కొన్ని విషయాలు పరిశీలించి చూద్దాం! 1) తీర్థం అనేది నేల మీద పడకూడదు, అటు లో పడిన ప్రతి చుక్క కోటి బ్రహ్మరాక్షసులు పుట్ట గలరు ట, అందుకే కింద పెద్ద పళ్ళెం కింద ఉంచుతారు, గమనించారా? 2) "కొంతమంది పెద్దలు తలకు రాసుకోకూడదు అని చెబుతారు, ఎందుకంటే ఆ ఎంగిలి తీర్థ పు నీళ్లు పక్కనున్న వాళ్ల మీద పడతాయి అని జాగ్రత్త కొరకు మాత్రమే అని గమనించగలరు. తలకు రాసుకుంటే "బ్రహ్మహత్య" దోషము పోతుంది. (సూక్తిముక్తావళి గ్రంథము). 3) "విష్ణు తీర్థము "కాళ్ళమీద పడరాదు. 4) ఆలయములో గాని, మీ ఇంటిలో గాని "తీర్థం" మిగిలిపోయిన తులసి కోట లో కానీ, ఎవరూ తొక్కని ప్రాంతమందు, లేదా ప్రవాహం మందు, విసర్జించవలెను. 4) దైవ ప్రసాదముగా నివేదించు ట కు ఈ తీర్థమును ప్రోక్షణ చేసి, తులసిదళం వేయవలెను, కొద్దిగా ఆవునెయ్యి ప్రోక్షణ చేయవలెను, 5) ఒక ఏకాదశి నుండి మరియొక ఏకాదశి వరకు (15 రోజులు) తీర్థమును నిలువ ఉంచవచ్చు. ఇంటిలో దేవతార్చన చేయువారు లేనప్పుడు,. మాత్రమే,. 6)"తీర్థమును మూడుసార్లు విడివిడిగా తీసుకోవలెను, ఒకేసారి తీసుకొనరాదు. 7) తీర్థమును పుచ్చుకునేవారు తమ కుడి చేతి ని, ఆవు చెవి దొప్పలా, (gokarna కృతి) శబ్దమూ లేకుండా పుచ్చుకో వలెను (తీర్థ గోష్టి గ్రంథము). 7)"తీర్థము పుచ్చుకున్న తరువాత చెయ్యి ని కడుక్కో వలసిన పనిలేదు. తల మీద రాసుకున్న వచ్చు కానీ పక్క వాళ్ళకి ఇబ్బంది కలుగ రాదు. 8)"శంఖము లోని నీటిని తల మీద ప్రోక్షణ చేసుకోవలెను. 9) "ekadashi దినము వలననే శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున కూడా తీర్థమును ఒక్కసారి పుచ్చు కొనవలెను. (పంచరాత్ర గ్రంథము). 10)"ఏకాదశి "నాడు ఒక మారును, "కృష్ణ జయంతి" నాడు మూడు మారులు తీర్థమును గ్రహించవలెను అని తెలుపుచున్నది.(విష్ణు పురాణం) సర్వపాపములు నశించును. 11)" ఒక్క "ఏకాదశి "దినమున తప్ప మిగతా ఏ ఉపవాసము ఉండి న రోజు అయియైననూ గంధము కలిపిన తీర్థమును విష్ణు వ్రత అభిమానము వలనగాని, వ్రత బంధము నేమో అను భయము వలన కాని, మూడు మార్లు తీసుకొనడం అతడు నాకు ద్రోహం చేసిన పాతకము నందును, ఎందుకు సందేహము పడనక్కరలేదు. (విష్ణు రహస్యం గ్రంథము నుండి సేకరణ). 13) మనకు అత్యంత ప్రియమైన దంతా (అనగా మనము సంపదగా భావించే గృహం, ధనం, ధాన్యం, భార్య బిడ్డలు మొదలైనవన్నీ) భగవంతునికి సమర్పించి, మనం వండుకునే భోజన పదార్థములను శ్రీహరి కృపా కటాక్ష లబ్ధ మైనదిగా భావించి, శ్రీహరి రూప, గుణ చింత నా ఆనందమున, కుటుంబ సభ్యులు, అతిథులతో కూడి భుజించుట ఎంత యోగ్యమని శ్రీ ఆచార్యుల వారి సందేశం. (సదాచార స్మృతి 15 శ్లోకం). 16) " భోజనానంతరం సాలిగ్రామ తీర్థమును తప్పక ఒకసారి స్వీకరించవలెను. తినే ఆహారము సత్వరంగా జీర్ణం అయ్యేందుకు, సాత్విక బుద్ధి ఉద్దీపన మునకు, కుడి చేతితో కడుపును నిమురుతూ" ఓం నమో నారాయణాయ" అనే మంత్రాన్ని కొద్దిసేపు జపం చేయాలని చెప్పబడింది

వందేమాతరం


విదేశీ పరిపాలనలో కన్నా స్వాతంత్రానంతర స్వదేశీ పరిపాలనలోనే హైదవ ధర్మం ఎక్కువగా నష్టపోయింది. విదేశీ పాలనలో బలవంతంగా, వేరే గత్యంతరం లేక ప్రజల మతాంతికరణ జరిగింది. అందుకే వారు అవకాశం చూసి తిరిగి తమ ధర్మన్ని తిరిగి స్వీకరించారు. కానీ నేడు స్వార్ధంతో , స్వలాభంతో మతం మారుతున్నారు. విదేశీ పాలకులు కూడా గౌరవించిన మన దేవాలయ వ్యవస్థని, సంధర్బానుసారంగా సమాజాన్ని జాగృతం చేసి ప్రజలను సంఘటితం చేసే నిస్వార్ధ అర్చక సమాజాన్ని నేడు అపహాస్యం చేయడమే నేటి ఈ పరిస్థితికి కారణం.


సుమారు 1300 సంవత్సరాల విదేశీయుల ఆక్రమణల పరంపర తర్వాత కూడా హిందువులు మొత్తానికి మొత్తంగా విదేశీ మతాలను స్వీకరించక పోవడం, బలవంతంగా తమ మతం లోకి మార్చినా.., ఆమారినవారు వారు కూడా వెంటవెంటనే వారి పూర్వ హిందూధర్మం లోకి వెళ్లిపోవడం, భారతదేశంలో విదేశీ ఆక్రమణ కారుల రాజ్యాలు ముందు వెనకగా అన్నీ కూడా, తొందరలోనే కూలిపోవడం గమనించి ఇక్కడి పరాక్రమోపేతులైన వీరులను, వారి రాజ్యాలను, ఇక్కడి జీవన విధానమైన హిందుత్వాన్ని నేరుగా ఎదుర్కోలేక ఎడారి మతాలవారు, ముఖ్యంగా విదేశీ ఏజెంట్లు అయిన కమ్యూనిస్టులు దొంగదెబ్బ తీయాలనుకున్నారు.


 హిందుత్వాన్ని మరియు హిందుత్వ శిక్షణను ఇచ్చే అర్చకులను, పురోహితుల నిర్మూలనే లక్ష్యంగా చేసిన దుష్ప్రచారాల కారణంగా, వేసిన ఎత్తుగడల ఫలితంగా చాలామంది హిందువులు తమ పరంపరాగతమైన పూజలు అర్చనలు చేయడం మరిచిపోయారు, ఆలయాలను, పూజారులను చిన్నచూపు చూసే పరిస్థితి దాపురించింది.


  గొర్రె కసాయి వాన్ని నమ్మినట్టు, నమ్మి వాడి వెంటనే వెళ్ళినట్లుగా విదేశీ మతాల ఎత్తుగడలు ప్రచారాలకు మోసపోయి మతం మార్చుకొన్నారు.


  ఎవరైతే తన పూర్వీకులను హింసలపాల్జేసి, హత్యలుచేసి, అవమానాలకు గురిచేసి మతం మార్చాడో, వాడి వెంటనే వెళుతూ, వాడి చరిత్రనే పలుకుతూ, వాడి గొప్పతనాలు అంటూ వాడి నికృష్టపు జీవితాలను వల్లెవేస్తూ, తమవైన వాటినన్నింటినీ మర్చిపోయి విదేశీయులకు, విదేశీ భావాలకు, విదేశీ మతాలకు తనకుతాను బానిసగా మార్చుకుంటున్నారు.


 మన దేశానికి అనువైన, మనవైన ఆచారాలను జీవన విధానాన్ని, యోగ, ప్రాణాయామము, ఆయుర్వేదము, మన చరిత్రను, మన పురాణాలను, మన భాషను, మన గ్రంథాలను, రామాయణం, భారతం, భాగవతం,వేదాలను, మన వేషాన్ని, మన అలంకరణ పద్ధతులను, మన ఆహారపు రీతులను, మన గృహ నిర్మాణ పద్ధతిని, మన గౌరవ పరంపరను, మన కుటుంబ జీవన పద్ధతిని, మన పండుగలను, జాతరలను, మన సాంస్కృతిక పరంపరను, మన 64 కళలను, ప్రకృతిని పంచభూతాలను గౌరవించి రక్షించుకునే మన పద్ధతులను, మన పూజలను, యజ్ఞయాగాదులను, అవి నిర్వహించే అర్చక పురోహితులను అవమానాలకు గురిచేసే దురాచారం తెలుగునాట ప్రబలింది.


 ముఖ్యంగా కమ్యూనిస్టులు, నక్సలైట్లు, ప్రస్తుతపు అర్బన్ నక్సలైట్లు మీడియాలో, పుస్తకాలు రచించే విభాగంలో, విద్యావ్యవస్థలో యూనివర్సిటీలలో, సినిమా మరియు సాంస్కృతిక రంగాలలో విదేశీయుల మరియు విదేశీ మతాల ఎత్తుగడలో భాగంగా ఆయా విభాగాలలో దూరిపోయి చేస్తున్న దౌర్భాగ్యపు అప ప్రచారాల కారణంగా ఇది మరింతగా ప్రజల మనసుల్లోకి చేరిపోయింది.


  హిందువుల పూజలు ఆచారాలు యజ్ఞాలు పండుగలు, మరియు "ప్రతి హిందువు జీవితంలో ఆచరించవలసిన సంస్కారాలు" మరిచిపోయి వ్యవహరిస్తున్నదాని ఫలితమే మతంమార్పిడులు ఇలా శత్రువుల యొక్క కుట్రలు కొంత మేర వారికనుకూలంగా ఫలితాలనిస్తున్నాయి.


  మతం మార్పిడులు ఎక్కడెక్కడైతే జరిగాయో ఆయా స్థలాల ప్రజలు పూర్తిగా ముస్లిములుగా, క్రైస్తవులుగా మారిపోయారు. ఇప్పుడు ఆయా ప్రాంతాలు భారతదేశంలో భాగాలుగా కూడా లేకుండా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లుగా విడిపోయాయి. మరియు ఎక్కడైతే విధర్మీయుల సంఖ్య పెరిగిందో ఈ దేశపు ధర్మాలు అనుసరించే వారి సంఖ్య తగ్గిన ఆ రాష్ట్రాలలోని ఆయా ప్రాంతాల్లో, మరియు వారి యొక్క సంఖ్య20 శాతం మించిన ప్రతి ప్రాంతం కూడా "హమ్ కు చాహియే ఆజాది అంటూ, భారత్ కో టుకుడే కరో" అంటూ దేశం నుండి విడిపోవడం కోసం కుట్రలు చేస్తున్నారు.


 భారత భూభాగాలు యధాతథంగా ఉండాలంటే ఇక్కడి భూమి పుత్రులైన హిందువుల సంఖ్య తగ్గకూడదు. హిందువుల సంఖ్య తగ్గకూడదంటే మతంమార్పిడులు జరగకుండా తమ ఆరాధ్య దైవాలను చక్కగా పూజించుకునే విధమైన సమాజం ఉండాలి.


 హిందువు హిందువుగా జీవించడం కోసం, తనదైన జీవన పద్ధతులు కొనసాగించు కొనేందుకు సమాజాన్ని సన్నద్ధం చేయడానికి మరియు పూజా విధులను నేర్పించే అర్చకుల పురోహితుల సంఖ్య తగిన నిష్పత్తిలో పెంచుకోవడానికి మరియు వారి గౌరవప్రదమైన జీవనం కోసం హిందూ సమాజం ఆలోచించాలి.


 ఆలయాలను ఆలయాల వ్యవస్థలను అర్చకులను పురోహితులను కాపాడుకొని ధర్మాన్ని రక్షించుకుని రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలవాల్సిన దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఈ పని చేయలేనప్పుడు ఆ శాఖను రద్దు చేయడం ఉత్తమం. హిందూ సమాజం నేరుగా స్పందించి ఆలయాలను అర్చక పురోహితులను కాపాడుకోవాలి.


  ఆచారాలను కాపాడుకోవాలి మన ధర్మాన్ని రక్షించుకోవాలి అప్పుడే దేశం కూడా రక్షించుకోబడుతుంది.


ఆ సంస్కరణ ఎక్కడో కాదు నాతోనే మొదలవ్వాలని ప్రతీ ఒక్కరూ దృడంగా నిశ్చయించుకొని తమ భావితరలను ఆ దిశలో తీర్చిదిద్దడంతోనే ప్రారంభిచాలి.


అవకాశం చూసుకొని సాధ్యమైనన్ని ఎక్కువసార్లు దేవాలయ దర్శనం చేసుకోవాలి.


మనతో పాటు మన పిల్లలనూ తీసుకొనివేళ్లాలి.


ఎవరో కొద్దిమంది తప్ప పురోహిత సమాజం చాలా ధూర్భరంగా ఉంది.(అర్చకుని జీతం 5-10 వేలు. కానీ అదే దేవాలయంలోని సపాయివాని జీతం 25-30 వేలు). వారిని గౌరవిద్ధాం.


సమయం దొరికినప్పుడు సమాజంలో మన ఇరుగుపొరుగు వారిని కలుద్దాం. వారి మనసు తెలుసుకొని అవసరమైతే ధర్మవిరుద్దంగా మరులుతున్న వారికి అదరణతో సూచనలిద్ధం.


కారణాన్వేషణ కాకుండా కర్తవ్య దిశగా సాగుదాం.


ధర్మరక్షణే ధ్యేయంగా , బావితరాలముందు నిర్ధోషిగా కాకుండా ఆదర్శంగా నిలుద్దాం.


జైహింద్ – జైభారత్


దశక ప్రభాకరశాస్త్రి

[03/11, 10:40 am] +91 99089 49429: ఓ అవ్వ కథ.

***********


నాలుగు దిక్కులు కలిసే చోట ఏ దిక్కులేక నిలుచుండిపోయింది ఆ అవ్వ. ఎటువైపు వెళ్ళాలో తెలీక, అడుగు ముందుకు పడక అక్కడే ఆగిపోయింది. భగభగమండే ఆ సూరీడుకి జాలిపుట్టి మబ్బులమాటున దాక్కున్నాడు. గిర్రున తిరిగే భూమి గిర్రుగిర్రున తిరిగే ఆ అవ్వ కళ్ళను ఆపలేకపోయింది. అక్కడే ఉన్నచోటనే కుప్పకూలిపోయింది ఆ అవ్వ.


కొంతసేపటికి కళ్ళుతెరిచి చుట్టూ చూసింది. ఎవరూ లేరు. ఎవరో పుణ్యాత్ములు ఆ అవ్వని తీసుకొచ్చి చెట్టుకింద పడుకోబెట్టి వెళ్ళిపోయారు. తనలో తానే నవ్వుకుంది ఆ బోసినవ్వుల అవ్వ. దాహం కోసమని చుట్టూ చూసింది. ఆ చెట్టు ఎదురుగా ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ పేరు అమ్మ చేతి ముద్ద. 


ఒంట్లో ఉన్న ఓపికనంతా కూడగట్టుకుని ఆ హోటల్ ముందుకెళ్ళి నిలబడింది. ఇంకా బోణీ కాలేదు పోయిరా.. అని కసురుకున్నాడు ఆ హోటల్ లో పని చేసే కుర్రాడు. వినబడనట్టు అలాగే నిలబడిపోయింది. ఇక నిలబడలేక పక్కనే ప్లేట్లు కడిగే బిందెలో నీళ్ళు కొన్ని తాగి తిరిగి అదే చెట్టు కిందకెళ్ళి కూర్చుంది.


అలానే చెట్టుకు ఆనుకొని కూర్చుంది. ఆ చెట్టు చల్లని గాలి వల్ల అవ్వ ప్రాణానికి హాయిగా ఉంది. అలా కళ్ళుతెరుచుకుని గాల్లోకి చూస్తూ గతాన్ని జ్ఞాపకం చేసుకుంటోంది. 


ముగ్గురు కొడుకులు ఒక కూతురు. నలుగురు బిడ్డల్ని ఇచ్చి, తాగి తాగి ఇక తాగలేక పైకి పోయాడు కట్టుకున్నోడు. పెద్దోడు లారీ క్లీనర్ పనికి వెళ్ళి తల్లికి సాయంగా ఉండేవాడు. మిగిలిన ముగ్గురిని వెంటబెట్టుకుని కూలిపనికి పోయి పోషించుకునేది. అదీ లేకపోతే కట్టేలమ్మేది. ఏ పని దొరికితే ఆఁ పని చేసి ఏ లోటు లేకుండా శ్రమ తెలియకుండా నలుగురు పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేసింది. 


ఇక సాయం చేసింది చాల్లే అనుకున్నాడేమో తల్లికి చెప్పకుండా పెద్దోడు పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయాడు. రూపాయి అడగనూ లేదు ఒక రూపాయి ఇయ్యనూ లేదు. 

తనకు ఉన్నంతలో కూతురికి పెళ్ళిచేసి పంపింది. రెండో కొడుకూ లక్ష్మణుడంత గోప్పోడు కాకపోయినా అన్న అడుగుజాడల్లో నడిచి తనూ పెళ్ళి చేసుకొని వేరే వెళ్ళిపోయాడు. కొంచెం అమాయకుడైన చిన్నవాడు మాత్రం తల్లిని అంటిపెట్టుకుని ఉన్నాడు. 


వయసు మీద పడుతోంది. తెలిసిన అమ్మయైతే అన్యోన్యంగా ఉంటారని అనుకుంది. బంధువుల అమ్మయిని తెచ్చి చిన్నవాడికి పెళ్ళి చేసింది. కొడుకు పెళ్ళి తన చేతులమీదుగా జరిగిందని సంబరపడింది. కోడలు వచ్చిన మూడు రోజలకే ఇంటిని రెండు ముక్కలు చేసింది. మీ అమ్మకి నేను సేవ చేయలేను అని మొహమ్మీదే చెప్పేసింది. అమ్మ చేతి ముద్దలు తిన్నావాడు గుప్పెడు అన్నం పెట్టి ఆకలి తీర్చలేక పోయాడు. ఇందులో తనకు వేరేగా చేసేదేముందో అర్దం కాలేదు.. మీరు తినే దాంట్లో ఒక ముద్దపెడితే చాలుగా అని మనసులోనే అనుకొని నవ్వుకుంది.


కోడలు మాటలకి కొడుకు మౌనానికి ఎమ్ చేయాలో తోచక వారికి దూరంగా ఇళ్ళు వదిలి వెళ్ళిపోయింది. తల్లిని వెతకాలని ఉన్నా మనసు రాలేదో భార్య ముందు నోరు పేగల్లేదో... మళ్ళీ మౌనంగా ఉండిపోయాడు..


పెరిగే వయస్సు కాలాన్ని దాటిస్తుంది...

కరిగే కాలం కథలను కంచికి చేరుస్తుంది...


అలా గతాన్ని తలిచుకుంటూ ఆ చెట్టుకింద శాశ్వత నిదురలోకి జారుకుంది ఆ అవ్వ. కొంతసేపటికి జనం గుమ్మిగూడారు. అవ్వ చనిపోయిన విషయం చూసిన వాళ్ళు ద్రువీకరించారు.

ఎదురుగా ఉన్న హోటల్ యజమాని దూరం నుండి చూసి ఏంటా అని ఆరా తీసాడు.. హోటల్ లో పనిచేసే కుర్రాడు జరిగిన విషయం చెప్పాడు. గిరాకీ లేదు కదా అని చూద్దామని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు హోటల్ యజమాని. దూరం నుండి చూసి గుండె ఆగిపోయిన వాడిలా నిలబడిపోయాడు. అవును ఆ అవ్వ తన తల్లి. తనను లాలించి పాలిచ్చి ఎన్నో కష్టాలకోర్చి పెంచిన కన్న తల్లి. ఈ రోజు ఇలా అనాధలా.. విగతజీవిగా పడి ఉంది. బోరున ఏడవాలని ఉంది, మళ్ళీ నోరు పేగల్లేదు. నోట మాట రాలేదు. అలా దూరం నుండే నిలబడి చూస్తున్నాడు. కళ్ళ నుండి కన్నీరు ధారలా కారుతోంది. 


తనని పిలుస్తున్నారు అని కళ్ళు తుడుచుకుని వెనుతిరిగి వెళ్ళిపోయాడు. హోటల్ వదిలి బయట పనేంటని నిలదీసిన భార్య ముందు సమాదానం లేనివాడిలా నిలబడిపోయాడు. భార్యతో నాలుగు మాటలు తిని మళ్ళీ తన పనిలో నిమగ్నమైపోయాడు. చివరికి ఆ అవ్వ అనాధ శవంలా అక్కడి నుండి మోయబడింది.


ఇలా ఎంతోమంది అందరూ ఉండి అనాధల్లా జీవనం సాగిస్తున్నారు. దీనికి బాధ్యులు ఎవరు???.


ఇది ఎవరో రాస్తే మనం చదివి తెలుసుకునే కథ కాదు. అనునిత్యం మనం కళ్ళారా చూస్తున్నాం, కొన్ని మన కుటుంబాలలో జరుగుతున్న, జరిగిపోయిన వాస్తవాలు ... నేను అనుకున్నది మీకు అర్దమయ్యేలా చెప్పానని , మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచెయ్యండి...


📝సుశాంత్ కారెం.

భద్రాద్రి కొత్తగూడెం.

[03/11, 10:40 am] +91 99089 49429: *నిరంతర సాధన*


మనిషి ఒక క్రమమైన మార్గంలో నడవాలంటే నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. మనసును లక్ష్యంతో నింపితే, అది మనిషిని తుదివరకు నడిపిస్తుంది. లక్ష్యం అనేదే లేకపోతే మనిషి ఎటు నడవాలో నిర్ణయించుకోలేడు. మనసుకు నియంత్రణ లేక పరాధీనమవుతుంది. కోరికల చట్రంలో బిగుసుకుని మనసులో పుట్టిన ప్రతి వాంఛను తీర్చుకునే ప్రయత్నం జరుగుతుంది. అందుకే లక్ష్యం లేకుండా జీవించే వ్యక్తిని పశువుతో పోలుస్తారు పెద్దలు.

లక్ష్యంతో జీవించడమంటే ఉన్నత ఆశయాలకోసం ఉత్తమ ఆదర్శాలను పాటించడం. మనిషి గురిపెట్టి చేసే ప్రయత్నాలన్నీ లక్ష్యంతో కూడినవిగా చెప్పలేం. మృగానికి వేటలో జంతువు లక్ష్యమైనా, అది లక్ష్యంతో జీవిస్తున్నట్లు కాదు. లక్ష్యం ఆమోదయోగ్యమైనది, విలువలతో కూడినది అయి ఉండాలి. ఇదే లక్ష్యశుద్ది. లక్ష్యశుద్ధి ఉంటేనే లక్ష్యసిద్ధి కలుగుతుంది. లక్ష్మి సిద్ధిస్తుంది. లక్ష్మి అంటే కేవలం ధనం కాదు. అన్ని సిరిసంపదలకు మూల స్థానం. లక్ష్యాన్ని సాధించాలన్న తపన నుంచి శ్రద్ధ, పట్టుదల, కృషి, నైపుణ్యం, ఏకాగ్రత, క్రమశిక్షణ, బాధ్యత క్రమంగా మనిషికి అలవడతాయి. ఇవే అష్టైశ్వర్యాలు


మనిషిలో లక్ష్య నిర్దేశం విద్యార్థి దశలోనే ఏర్పడాలి. విద్యా బోధన కేవలం పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా సమర్థంగా చింతన చేసే శక్తిని, నైతిక విలువలను బోధించాలి.

ప్రతి వ్యక్తీ ఏదో ఒక ప్రత్యేక కళ, ప్రతిభతోనే పుడతాడు. ఏదో ఒక రంగంలో నైపుణ్యం అతడిలో సహజంగానే దాగి ఉంటుంది. తనలోని ప్రతిభను అతడు గుర్తించలేడు. అనుభవజ్ఞులు మాత్రమే వ్యక్తిలో దాగిఉన్న ప్రతిభను గుర్తించి, బయటకు తీసి, సానపట్టి నిపుణుడిగా తీర్చిదిద్దగలరు. సముద్రాన్ని లంఘించగల అసమాన సామర్థ్యం తనలో దాగిఉందని వానర పెద్దలు చెబితేగాని హనుమకు తెలియలేదు!

లక్ష్య నిర్దేశానికి, లక్ష్య సాధనకు మనిషి గురువుల నుంచి మార్గదర్శనం పొందాలి. లక్ష్య సాధనకు సత్ప్రవర్తన, ఇంద్రియ నిగ్రహం, ఏకాగ్రత, ఉద్రిక్తతా రాహిత్యం అనే నాలుగు సూత్రాలను కఠోపనిషత్తు బోధిస్తుంది. ఏ రంగంలో విజయం సాధించాలన్నా మనిషి తన శక్తియుక్తులు బలహీనతలను, అందుబాటులో ఉన్న అవకాశాలు, వాటిని అందుకోవడంలో అవరోధాలు అనే నాలుగు అంశాలను క్షుణ్నంగా విశ్లేషించి కార్యాచరణకు సిద్ధపడాలని విజ్ఞులు చెబుతారు. లక్ష్య సాధనాక్రమంలో తప్పిదాలు జరగడం సహజం. ఓటమి అంచుకు చేరనూ వచ్చు. తప్పిదాలను తలచుకొని కుంగిపోవడం, ఓటమికి భయపడి లక్ష్యాన్ని మధ్యలో వదలడం అవివేకం. నిరాశా నిస్పృహలు ముసురెయ్యకుండా మనసును ఉల్లాస ఉత్సాహాలతో నింపాలి. కొన్ని సందర్భాల్లో లక్ష్యం చాలా పెద్దదిగా, అసాధ్యమైనదిగా అనిపిస్తుంది. దానిపై అనురక్తి తగ్గే అవకాశమూ ఉంది. అప్పుడు ఆ లక్ష్యాన్ని తరచూ జ్ఞప్తికి తెచ్చుకొనే స్వయం సూచనా ప్రక్రియను పాటించాలి.

విజయాన్ని వినయంతో స్వీకరించాలి. పరాజయాన్ని గుణపాఠంగా భావించి మరింత కృషితో మరొకసారి ప్రయత్నించాలి. అవమానాన్ని అనుభవంగా గ్రహించాలి. శక్తిమేరకు కృషిచేసి ఫలితాన్ని యథాతథంగా ఆహ్వానించే మనోస్థితిని అభ్యసించాలి. ఆందోళన, వ్యాకులత అనే బలహీనతలను అధిగమించేందుకు మనసును నిబ్బరంగా, తటస్థంగా ఉంచే ప్రయత్నం చేయాలి. దీనికోసం రోజూ కొంతసమయం ఏకాంతంగా తనతో తాను గడపాలి. నిజానికి లక్ష్యసాధన అనేది నిరంతర ప్రక్రియ. నిరంతర సాధనలో గెలుపు ఓటములుండవు. శ్రద్ధగా పనులను ఆచరించడమే గెలుపు. సాధనలో ఉండటమే లక్ష్యం.

✍🏻పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ

[03/11, 10:41 am] +91 99089 49429: *మాట కోసం*


ఒకరోజు గంగయ్య కాయలు కోయను మామిడి తోపులోకి పోతూ, భుజాన గడ చంకలో గోతాము పెట్టుకున్నాడు.

కొంత దూరం పోయేసరికి,చంకలో సంచి పడిపోయింది కానడు.

ఆడుకుంటున్న రవి అదిచూచి తీసుకుని పరుగెత్తుకుంటూ పోయి గంగయ్యకిచ్చాడు

"సెహబాష్ రా అల్లుడు. సాయంత్రం తోటలోకిరా మంచి పండు ఇస్తాను.


గంగయ్య కాయలన్నీ కోసుకుని మూటగట్టి ఎత్తే మనిషి కోసం ఎదురు చూస్తున్నాడు.

అంతలో రవి వచ్చి" మావయ్యా!పండు"

"అరె!శుభమా అని మూట కట్టేశాను కదరా! ఇంక విప్పకూడదు. వచ్చే కాపులో ఇస్తాలేరా ఏమి అనుకోకు.".


రవి చెట్టు చెంతకు పోయి

నాలుగు వైపులా పరిశీలించి" నీకు చెత్వారంగాని వచ్చిందా ఏమి మామా. కొసాకొమ్మన తాటికాయంత మామిడి పండును వదిలేశావు."

నిజమా!అని చెట్టెక్కి నాలుగు మూలల వెదక సాగాడు గంగయ్య.

ఒకమూలన దాగి తమాషా అంతా చూస్తున్నాడు రవి.

చీకటి పడేవరకు వెదకి విసుగు చెంది దిగడంలో కాలుజారి క్రింద పడ్డాడు కొమ్మలు వళ్ళంతా గీసుకుని రక్తసిక్తమైనది.


ఎలాగో తంటాలు పడి మూట ఎత్తుకుని ఇల్లు చేరుకున్నాడు.

"ఏమిటి ఈ అవతారం?" అన్నది భార్య.

అంతలోకే రవి వచ్చి"అత్తమ్మా! పండు ఇస్తానని ఆశపెట్టి చివరకు ఇవ్వనే లేదు"అని జరిగినదంతా పూస గ్రుచ్చినట్టు చెప్పాడు.

భార్యకు వళ్ళు మండిపోయింది. "పాపం పసిబిడ్డ ఒక్క పండు నోరుతెరచి అడిగితే ఇవ్వలేక పోయావా? కోతులు ఎత్తుకు పోయినంత చేస్తుందా నీ పాపిష్టి బుద్దిగాకపోతే, మాట తప్పినందుకు దేవుడు తగిన శిక్షేవిధించాడు. మాటకోసం మనపూర్వులు హరిశ్చంద్రుడు ,శిబిచక్రవర్తి,బలి చక్రవర్తి ఎన్నో బాధలనుభవించారు.అటువంటి పవిత్రమైన నేలపై పుట్టి పండుకాడ మాటతప్పుతావా?" అంటూ తలవాచేలా చివాట్లుపెట్టింది.


ఒరే!నీకు దండం పెడతాను నీకు కావలసినన్ని పళ్ళు ఎత్తుకుపోరా ఈమనిషితో వేగలేకున్బాను"

నాలుగు పళ్ళు తీసుకుని ఎగురుకుంటూ ఇల్లు చేరాడు రవి.

✍🏻జంజం కోదండ రామయ్య

కామెంట్‌లు లేవు: