7, ఆగస్టు 2020, శుక్రవారం

ఏడిద శ్రీ సంగమేశ్వర క్షేత్రం పురాతనమైన క్షేత్రం.


 ఇక్కడ శ్రీ సంగమేశ్వరలింగం ను స్వయంగా ఇంద్రుడి ప్రతిష్ట అని పురాణ ఆధారాలు ఉన్నాయి.
అగస్త్య మహాముని మేరు పర్వతం పొగరు అణచి దక్షిణ దేశాలకు వచ్చినప్పుడు తాను వచ్చిన దారిలో కదంబ వృక్షం విత్తనాలను నాటుకుంటూ వచ్చారని ప్రతీతి.... ఇక్కడ ఎక్కువగా కదంబ వృక్షాలు కనిపిస్తుంటాయి.... అగస్త్య మహాముని తపస్సు చేసిన ప్రాంతం ఇదే..
 భరద్వాజ , తుల్య భాగ నదుల అంతర్వహిక సంగమం ఈ సంగమేశ్వరం గా పేర్కొంటారు.త్రివేణి సంగమంగా కూడా ప్రసిద్ధి.ఇక్కడ ఉన్న కోనేరు లో మహా మునులు పుణ్య స్నానాలు ఆచరించే వారని చెబుతారు. శ్రీరామచంద్రమూర్తి వనవాసం చేసిన సమయంలో ఈ క్షేత్రాన్ని దర్శించారని చరిత్ర కారులు పేర్కొంటారు. ఇక్కడ ఉన్న శ్రీ రామ పాదాలు ఆధారంగా చరిత్రకారులు శ్రీరామచంద్రమూర్తి బస చేసినట్లు చెబుతారు. ఇక్కడ మహర్షులు తపస్సు చేసిన ప్రదేశంగా పురాణ కథలు ఉన్నాయి.సంగమేశ్వర క్షేత్రం లో మరెక్కడా కనిపించని విధంగా కదంబ వృక్షాలు ప్రత్యేకంగా ఉంటాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ సంగమేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం కు భక్తులు అధిక సంఖ్యలో వస్తూఉంటారు. ఈ ప్రాంతంలో షష్టి మహోత్సవాలు సంగంలో వైభవంగా నిర్వహిస్తుంటారు.దీంతో షష్టి సందడి సంతరించుకుంది.
 ప్రతి శివరాత్రికి ఊరినుండి మూడున్నర కిలోమీటర్ల దూరంలోగల సంగమేశ్వర క్షేత్రానికి ఊరి ప్రజలందరూ ఎంతో ఉత్సాహంతో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన  రథాన్ని లాక్కొని వెళతారు....శైవ క్షేత్రంలోనే రుద్ర భూమి కలిగిన.... అతి కొద్ది క్షేత్రాలలో ఇది ఒకటి..... దక్షిణ కాశీగా పేరుగాంచినది....

క్రెడిట్స్.... @సయ్యద్ హుస్సేన్ జర్నలిస్ట్, గోదారమ్మ తనయుడు....

కామెంట్‌లు లేవు: